'జగన్ కోసం ముమ్మరంగా జనం సంతకం'

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా చేపట్టిన 'జగన్ కోసం జనం సంతకం' రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. రెండు కోట్ల సంతకాల దిశగా పరుగులు తీస్తోంది. రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతి లభించేవరకూ పార్టీ సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కార్యక్రమం సాగిన తీరు.. సేకరించిన సంతకాల సంఖ్యపై ప్రత్యేక కథనం.

చిత్తూరులో 17,69,592

తిరుపతి :

చిత్తూరు జిల్లాలో 17 లక్ష ల 69 వేల 592 మంది సంతకాలు చేసినట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, అనుబంధసంఘాల జిల్లా అధ్యక్షులు, ఆ సంఘాల మండల కమిటీలు, పార్టీ కార్యకర్తలంతా ఉత్సాహంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి కోసం పనిచేసిన వీరందరికీ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో 2 లక్షల 88 వేల 162 మందితో సంతకాలు చేయించారన్నారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదనరెడ్డి నేతృత్వంలో 1,67,230, తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో 1,40,00 సంతకాలు చేయించారని నారాయణ స్వామి తెలిపారు. సత్యవేడులో ఆదిమూలం నాయకత్వంలో 1,04,000, నగరిలో రోజా ఆధ్వర్యంలో 70 వేలు, చిత్తూరులో ఏఎస్‌ మనోహర్ ఆధ్వర్యంలో 90 వేలు, జీడీ నెల్లూరులో తన ఆధ్వర్యంలో 1,04,00 సంతకాలు జరిగాయన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో 70 వేలు, కుప్పంలో సుబ్రమణ్యంరెడ్డి నేతృత్వంలో 80 వేలు, పుంగనూరులో లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప నాయకత్వంలో లక్ష 7వేలు, మదనపల్లెలో డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో లక్ష 60 వేల మందితో సంతకాలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 72వేలు, పూతలపట్టులో జిల్లా అధికార ప్రతినిధి బాబురెడ్డితో పాటు అన్ని మండలాల కన్వీనర్ల నేతృత్వంలో లక్ష, పీలేరులో 20వేల మంది సంతకాలు చేశారన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో లక్ష 5వేలు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ 92వేల సంతకాలు సేకరించినట్టు నారాయణ స్వామి చెప్పారు. సంతకాలు చేసిన పత్రాలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అప్పగించినట్టు ఆయన తెలిపారు.

కోటి సంతకాలకు అనూహ్య స్పందన


అమలాపురం:  కోటిసంతకాలు కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆపార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో రాయవరం, మండపేట రూరల్ మండలాల పరిధిలో సంతకాలు సేకరించిన 70 వేల ప్రతులను అమలాపురంలో చిట్టబ్బాయికి అందజేశారు. మరో 30 వేల ప్రతులను సిద్ధం చేసినట్టు పాపారాయుడు తెలిపారు. స్టీరింగ్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్లు పి.కె. రావు, మిండగుదిటి మోహన్, పార్టీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బసవా చినబాబు, మాజీ ఎంపీపీ సిరిపురం శ్రీనివాస్, మండపేట రూరల్ కమిటీ అధ్యక్షుడు వల్లూరి రామకృష్ణ, వెలగల రామకృష్ణారావు, పినిపే రాధాకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎం. తాతాజీ తదితరులు పాల్గొన్నారు. సంతకాల సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సత్తెనపల్లి నుంచి 80 వేల సంతకాలు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చేపట్టిన ‘జగన్ కోసం జన సంతకం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. వివిధ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 80వేల మందికిపైగా సంతకాలు చేశారన్నారు. సత్తెనపల్లి పట్టణంలో 18,328, సత్తెనపల్లి రూరల్‌లో 22,988, ముప్పాళ్ళ మండలంలో 14,819, రాజుపాలెం మండలంలో 10,609, నకరికల్లు మండలంలో 11,128 మంది సంతకాలు చేయగా ఆ జాబితాలను ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందజేశారు. అనంతరం లోటస్‌పాండ్‌లోని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వై.యస్.విజయమ్మను అంబటి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, సత్తెనపల్లి టౌన్ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల కన్వీనర్లు రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, తోటా ప్రభాకర్, మేడికొండ ప్రకాష్‌రెడ్డిలను అంబటి ఆమెకు పరిచయం చేశారు.

ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో 2,31,000 సంతకాలు

హైదరాబాద్: ‘జగన్ కోసం జనం’ సంతకం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. జగన్ కోసం జనం సంతకంలో భాగంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను శుక్రవారం పార్టీ కార్యాలయంలో కేంద్ర పాలకమండలి సభ్యులు వై.వి. సుబ్బారెడ్డికి పుత్తా ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,31,000ల మంది జగన్‌కు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. ఇంకా 20 వేల సంతకాలు జరగనున్నాయన్నారు.

మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు

మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలో సేకరించిన లక్షకు పైచిలుకు సంతకాలను శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు నియోజకవర్గ నేత హరివర్ధన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి ఇన్ని సంతకాలు చేపట్టినందుకు హరివర్ధన్‌రెడ్డిని అభినందించి, సంతకాల చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సుల మేరకు త్వరలోనే జగన్ జైలు నుంచి విడుదలై అందరి ముందుకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ మండలాల కన్వీనర్లు రాంరెడ్డి, తుంకి మల్లేష్, ప్రతాప్‌రెడ్డి, కర్రె జంగయ్య, నాయకులు అశోక్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మల్కాజిగిరిలో లక్ష

హైదరాబాద్: సంతకాల సేకరణలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను నాయకులు శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి జి. సూర్యనారాయణరెడ్డి నాయకత్వంలో సేకరించిన 1,03,333 సంతకాల ప్రతులను జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డితో కలసి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జననేత జగన్‌పై కాంగ్రెస్, సీబీఐ పన్నిన కుట్రలను ప్రజలు నిరసిస్తున్నారన్నారు. ఇందుకు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు రోహిత్‌యాదవ్, మల్లారెడ్డి, దేవదాస్, విక్కీయాదవ్, మోమిన్‌బాషా, బుచ్చయ్య, జగన్మోహనరెడ్డి, భిక్షపతిగౌడ్, కృష్ణమూర్తి, సుధాకర్ పాల్గొన్నారు.
ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది డివిజన్‌లలో సేకరించిన 71 వేల సంతకాల ప్రతులను పార్టీ ప్రధాన కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ సమక్షంలో అందచేశారు. ఈ సందర్బంగా జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి నిర్దోషి అని ప్రజలంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే సంతకాల సేకరణకు స్వచ్ఛందంగా భారీ ఎత్తున మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top