జగనే జన నాయకుడు అంటున్న సర్వేలు


ఎన్నికలకు సిద్ధం కండి అంటూ వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర  అప్రతిహతంగా సాగుతుండగా, ప్రజల్లో వైయస్ జగనే కాబోయే ముఖ్యమంత్రి అని అంచనాలు సాగుతున్నాయి. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో నే ఈ చర్చ పరిమితం కాగా, చంద్రబాబుపై నాన్బెయిలబుల్ వారెంట్ వచ్చిన నేపథ్యంలో కాబోయే ముఖ్య మంత్రి ఎవరనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. నేషనల్ మీడియా, వివిధ సర్వేల సారాంశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. దుబారా సీఎంగా, కాస్ట్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ఆల్రెడీ నెగిటివ్ ముద్ర ఎక్కువగానే ఉంది. ఓటుకు నోటు కేసు, ప్రత్యేక విమానాల్లో విదేశీ ప్రయాణాలు, అనవసరపు ఆర్భాటాలకు ఖర్చులు, అవినీతి, కుల ప్రాధాన్యత, హోదాపై యూటర్న్ ఇలాంటివన్నీ జాతీయ మీడియాలో చర్చకు వచ్చాయి. ఇప్పుడు బాబ్లీ కేసులో చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవడం మరోసారి చర్చనీయాంశమైంది. 
అధికార పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు సంసిద్ధం అని ప్రకటిస్తున్నాయి. ఇలాంటప్పుడు చంద్రబాబు కేసులన్నీ బయట పడడం, బాబ్లీ కేసు లాగే ఓటుకు నోటు కేసు తో సహా అన్ని కేసులోనూ స్టే లు ఎత్తేస్తే బాబు పరిస్థితి ఏమిటని చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో తక్షణ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారని జరిగిన సర్వేలో 43 శాతానికి పైగా వైయస్ జగన్ సీఎం అవుతాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని అంచనా 38 శాతం   మాత్రమే వ్యక్తమైంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పీఠం ఎక్కి అవకాశం ఐదు శాతాన్ని మించలేదు. ఈ సర్వే ఫలితాలతో గత కొంతకాలంగా మళ్లీ మీరే రావాలి అని బాబును ప్రజలు పిలుస్తున్నారని చేస్తున్న పచ్చ ప్రచారం ఒట్టి బూటకమేనని తేలిపోయింది! ఇక ప్రశ్నిస్తాం అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ బాబుగారి అడుగుజాడల్లో నడుస్తూనే తానేదో ప్రత్యేక పార్టీ అన్నట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నా... ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని జనసేన మరోపక్క బాజాలు కొడుతున్న... అదంతా ఉత్తి ఆర్భాటమే నని... పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కేవలం ఐదు శాతం మాత్రమే ఉందని ఈ సర్వేలో ప్రజలు తేల్చేశారు. తాజా ఫలితాలతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో పరిపాలించేది ఏ పార్టీ అనేది, ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి ఎవరు అనేది సుస్పష్టమైంది.
Back to Top