జగన్ పై చంద్రబాబు కక్షకు సాక్ష్యం ఇదిగో...


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే చంద్రబాబుకు మా చెడ్డ కోపం. పైగా ప్రజా సంకల్ప యాత్ర ను ఎన్ని విధాల తక్కువ చేద్దామనుకున్నా, ఎంతలా బురదజల్లాలని చూసినా ప్రజా శ్రేణులు ప్రతిపక్ష నేత వెన్నంటే ఉంటున్నాయి. టిడిపి మాటలు మాయలు నమ్మం పొమ్మంటున్నాయ్. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ పై పబ్లిక్ గా, ఎంతో సెక్యూరిటీ తో ఉండే ఎయిర్పోర్టులో కత్తితో దాడి జరిగింది. ఈ విచారకరమైన సంఘటనపై ముఖ్యమంత్రి నిన్న రాత్రి తాపీగా స్పందించారు. ప్రెస్ మీట్ లో బాబు స్పందించిన తీరు చూస్తే జగన్ అంటే ముఖ్యమంత్రికి ఎంత ద్వేషమో క్లియర్ గా అర్థం అవుతుంది. ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ తుళ్లుతూ ఏదో తనకు అనుకూలమైన, ఆనందరకరమైన విషయం జరిగినంట్టుగా చంద్రబాబు ఫీలింగ్స్ ఉండటం చూసి విలేఖర్లే అశ్చర్యపోయారు. దాంతోపాటు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు ఎలాంటివారికైనా జుగుప్స కలిగించేలా ఉంది. ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మరో కేబినెట్ హోదా నాయకుణ్ణి గురించి ఇంత చౌకబారుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
బాబు మాటల తీరిది...
జగన్ జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వలేదు...
తనకిస్తున్న సెక్యూరిటీ వాహనాలు బావుండలేదని, రక్షణ సరిగ్గా లేదని ఎన్నాళ్లుగానో చెబుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. విమానాశ్రయంలోనూ భద్రతలేని వాతావరణం.  ప్రాధమిక చికిత్స అందించాలన్న కనీస జ్ఞానం ప్రదర్శించని వ్యవస్థ. ఇలాంటి చోట కంప్లైంట్ ఇవ్వాలనీ, ఇచ్చినా అది సమగ్ర విచారణకు నోచుకుంటుందనే నమ్మకం ఎవ్వరికీ కలగదు. అయితే వైఎస్ జగన్ తాను బయలుదేరాల్సిన ఫ్లైట్ ను ఈ కారణంతో ఆలస్యం చేసి, మిగితా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశ్యంతో వెంటనే అక్కడ నుండి బయలు దేరారు. తీవ్రంగా అయిన గాయాన్ని కూడా లెక్కచేయకుండా ముందుకు పోగల సామర్థ్యం ఉన్న నాయకుడి లక్షణం అది. చంద్రబాబు దాన్ని తప్పుపట్టడం ఓ తెలివి తక్కువ చర్యే. 

అందరూ జగన్ గురించి ఆరా తీయడమేంటి?
అంటే చంద్రబాబు దృష్టిలో వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి ఇతర నాయకులెవ్వరూ ప్రస్తావించకూడదా? ఆ దాడిని ఖండించకూడదా? ఇదెక్కడి న్యాయం. ఓ రాజకీయనేత, ప్రజల్లో ఎంతో పాలోయింగ్ ఉన్న నాయకుడు, ఓ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినేత అయిన వ్యక్తికి ప్రమాదం జరిగితే ఎవ్వరూ స్పందించరా? అలా స్పందించిన వారిపైనే ఆరోపణలు చేయడం ఎలాంటి పిరికిపంద చర్య అవుతుందో చంద్రబాబకు అర్థం కానట్టుంది. ప్రతిపక్ష నాయకుడిపై బాబుకు ఉన్న ఆకారణ ద్వేషాన్ని ఇది బైటపెడుతోంది. నిజానికి చంద్రబాబు పై అలిపిరిలో దాడి జరిగిన సంఘటనలో ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి నాడు ధర్నా చేసారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ఇన ప్రద్శించే గుణం ఆ కుటుంబానిది. కానీ నేడు చంద్రబాబు కనీసం దాడిని ఖండిచకపోగా విశాఖలో ఆసుపత్రికి వెళ్లకుండా జగన్ హైదరాబాద్ వెళ్లాడంటూ వెర్రిమాటలు మాట్లాడాడు. జగన్ పై దాడిని ఖండించిన అన్ని పార్టీల వారిపైనా దుమ్మెత్తిపోసాడు. 
శాంతిభద్రతల సమస్య సృష్టిద్దామనుకున్నారు
జగన్ పై దాడిని కారణంగా చూపుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పాడు చేయాలనుకున్నారు అన్నాడు చంద్రబాబు. బాబు నీచమైన ఆలోచనలకు ఇది ఉదాహరణ. అలాంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే గాయాన్ని కూడా లెక్క చేయకుండా జగన్ హైదరాబాద్ ప్రయాణం అయి వెళ్లారు. తన ట్రీమ్ మెంట్ జరిగే సమయంలో కూడా అంతాబాగానే ఉందని అభిమానులకు భరోసా ఇచ్చి, రాష్ట్రంలో అల్లర్లు జరక్కుండా ఉండేలా జాగ్రత్తపడ్డారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని పదే పదే చెప్పడం ద్వారా ఈ ఘటన వెనకున్న కుట్రను దాచే ప్రయత్నం జరుగుతోందని బాబు మాటల్లో స్పష్టంగా అర్థం అవుతోంది. 
బూమరగాంగ్ అయ్యింది
చంద్రబాబు చెప్పిన బూమరాంగ్ నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ కో, జగన్ కో కాదు ముఖ్యమంత్రికే అయ్యింది. ఫ్లెక్సీ అంటూ చూపిన ఫొటోలోని గరుడ బొమ్మ ఫొటోషాప్ లో అప్పటికప్పుడు చేయించిందని అసలు ఫ్లెక్సీ చూసినవాళ్లంతా అంటున్నారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు ఆయన శిష్య పరమాణువులు రచించిన కథకు ఊతమిచ్చేలా ఈ దాడి జరగడం చూస్తే ఖచ్చితంగా ఇది టిడిపి ఆడుతున్న నాటకమే అని ప్రజలకు కూడా అనుమానం కలిగింది. 
నన్నేం చేయలేరు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటి సోదాలు, తెలుగు దేశం నాయకుల ఇళ్లలో జరుగుతున్న సోదాల విషయంలో చంద్రబాబు మాట తీరు మరో రూపంలోకి మారింది. నిన్నటిదాకా ఐటి దాడులు కక్ష సాధింపులు అంటూ కల్లబొల్లి శోకాలు పెట్టిన తెలుగుదేశం అధినేత ఐటిదాడులతో మమ్మల్ని ఏం చేయలేరు అంటూ ఎంతో నిబ్బరంగా వాఖ్యానించారు. మరి ఐటి దాడులు వారినేం చేయలేనప్పుడు గత వారం రోజులగా దీనిపై ఇంత హడావిడి ఎందుకు జరిగినట్టు? ఐటి అధికారులు విప్పిన గుట్లన్ని రహస్యంగా ఉండిపోతాయని, టిడిపి ప్రభుత్వానికి ఏ ప్రమాదం లేదని ఏ హైకమాండ్ వీరికి అభయ ’హస్తం’ ఇచ్చింది అనేది ఆలోచించాల్సిన విషయమే. అందుకే బాబు ఎవరూ నన్నేం చేయలేరు, సిబిఐ వచ్చినా ఐటి వచ్చినా కాఫీ తాగి వెళ్లిపొమ్మంటాం అంటూ అవహేళనగా మాట్లాడారంటున్నారు రాజకీయవేత్తలు. 
జగన్ విశాఖలో నవ్వుతూ వెళ్లారు హాస్పటల్లో పాథటిక్ గా ఉన్నారు
చంద్రబాబు నీచాతినీచమైన బుద్ధికి ఈ మాటలు పరాకాష్ట అనుకోవాలి. ఎందుకంటే గాయాన్ని, బాధను ఓర్చుకుని చిరునవ్వుతో సహనం చూపిన వ్యక్తిని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రికి మానవత్వం అంటే ఏమిటో తెలియదని అర్థం అవుతోంది. హైదరాబాద్ ఆసుపత్రికి వచ్చేసరికి పాథోస్ గా కనిపించాడు చూసారా అంటూ చంద్రబాబు వెకిలిగా అడగడం చూసి అక్కడున్న విలేకరులే కాదు వింటున్న ప్రజలు కూడా ఛీదరించుకున్నారు. కొన్ని గంటలపాటు గాయాన్ని, దాని తాలూకు నొప్పిని పంటి బిగువున భరించిన వ్యక్తి, హాస్పటల్ లో బాధతో ఉన్న సమయాన్ని చూసి వికృతంగా నవ్వడం అంటే చంద్రబాబుది మృగ ప్రవృత్తి అని, సైకో మనసత్తత్వం అనీ అర్థం చేసుకోవాలి. 
ఇది సాకుగా చూపి జగన్ కోర్టు హాజరీ నించి మినహాయింపు తీసుకుంటారు
చంద్రబాబులోని ఆపలేని ఆక్రోశం, తట్టుకోలేని ఉక్రోషాలకు కారణం తేటతెల్లం అయిపోయింది. జగన్ పై జరిగిన దాడిని హైకోర్టు సీరియస్ గా పరిగణిస్తే, ఆయనకు వారం వారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే తాము బురద జల్లే కార్యక్రమానికి అడ్డు అవుతుందన్నదే చంద్రబాబు బాధ. చివరకు దాన్ని కూడా బైటపెట్టాడు చంద్రబాబు. ఈ దాడి అవకాశంగా కోర్టు నుంచి మినహాయింపు కోరతారంటూ చవకబారు వాఖ్యలు చేసిన బాబు 40ఏళ్ల అనుభవం కాదు కదా కనీస పరిణితి కూడాలేని మనిషి అనిపించుకున్నాడు. 
ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన క్షణం నుంచీ పోలీసులు, టిడిపి మంత్రులతో ఈ హత్యాయత్నాన్ని చాలా చిన్నపాటి దాడిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేసారు. జగన్ అభిమాని చేసిన పిచ్చి చర్యగా జనాలను నమ్మించడానికి ప్లాన్డ్ స్కెచ్ తో పనిచేసింది టిడిపి ప్రభుత్వం.  గంటలో కేసు తేల్చేస్తామంటూ పోలీసు ఉన్నతాధికారి చెప్పడం వెనుక ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఏ మలుపులు తిరుగుతుందో అధికార పార్టీ ఇచ్చే ఆదేశాలు ఉన్నాయని అర్థం అవుతూనే ఉంది. నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, ఆదినారాయణ వంటి నాయకుల నోటికి హద్దులేనట్టే తయారైంది. స్వయంగా చంద్రబాబు ప్రెస్ మీట్ జగన్ ప్రాణాలకు హాని కలిగినా కనీసం స్పందించని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ కు లభిస్తున్న ఆదరణను అడ్డుకోలేక, జగన్ ప్రభంజనాన్ని ఆపలేక, ప్రతిపక్షమో, ప్రతిపక్ష నాయకుడో అడ్డు తొలగిపోతే బాగుండనే చంద్రబాబు కోరిక ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాటల్లో బాగా కనిపించింది. బాబు హావభావాలు కూడా జగనపై జరిగిన దారుణాన్ని ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తున్న తీరులో ఉన్నాయి. రాక్షసానందం అంటే నిన్న బాబు అనుభవించిందే అంటున్నారు నిన్నటి బాబు మాటలు విన్న తెలుగు ప్రజలు. జగన్ పై చంద్రబాబు కక్షకు ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి అంటున్నారు వైఎస్ జగన్ అభిమానులు. 
 
Back to Top