త్వరలోనే మంచిరోజులు


వైఎస్సార్ జిల్లా) రాష్ట్ర ప్రజలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని,
కష్టాల కాలం ఎక్కువ రోజులు ఉండదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్
జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యల మీద
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ చేస్తున్న పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలని ఆయన
పిలుపు ఇచ్చారు.

మధ్యాహ్నం ఆయన నేరుగా పులివెందుల కు చేరుకొన్నారు. అక్కడ ఆయనకు
పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడకు వచ్చిన
స్థానికులతో ఆయన మమేకం అయ్యారు. పలువురు వృద్ధులు, మహిళలు వారి కష్టాలు విన్నవించుకోగా జగన్ ధైర్యాన్ని కల్పించారు. రైతు,
డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ
ఆందోళనలు చేస్తోందని  వివరించారు.

‘‘ఎన్నికల
ముందు చంద్రబాబు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి. రుణమాఫీ
నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం
చేసిన బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చివరకు అవ్వా తాతలను కూడా
పింఛన్ పెంపు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి వారి ఉసురు
తప్పక తగులుతుంది. ఎవరూ నిరాశ పడొద్దు.. మంచి రోజులు త్వరలోనే వస్తాయి. అందరం కలసి
ఆయన మోసాలను ఎండగడదాం’’ అని వైఎస్ జగన్‌  పేర్కొన్నారు.

 రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చేరుకొని అక్కడ దివంగత
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల
మరణించిన కొర్రపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణ రెడ్డి
ఇంటికి చేరుకొన్నారు. కుటుంబ సభ్యుల్ని పలకరించి ఓదార్చారు. అక్కడ ఉన్న చర్చిలో
ఆయన ప్రార్థనలు చేశారు.

తర్వాత ముద్దనూరు, తిమ్మాపురం, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి, పొద్దటూరు,
గోపవరం, తదితర గ్రామాల మీదుగా ఆయన పొద్దుటూరు చేరుకొన్నారు. గ్రామ గ్రామాన జన
నేతకు ఘనస్వాగతం లభించింది. అక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మ వారికి జగన్
పూజలుచేశారు. దసరాల్లోనే వైఎస్ జగన్ అక్కడకు రావాల్సి ఉన్నప్పటికీ రాలేకపోయారు.  

 

Back to Top