జగన్‌ జన సంద్రం....



ఒకే ఒక్కడు...వేలు లక్షలుగా అడుగులు...బంగాళాఖాతం చెంత, జనసంద్రం హోరెత్తింది. నిన్నటి దాకా పల్లెపట్టులు అక్కున చేర్చుకున్న రాజన్న బిడ్డను, గ్రేటర్‌ విశాఖ నింగీనేలా హోరెత్తాలా జయజయధ్వానాలతో స్వాగతించింది. మహాకవులను కదనోత్సాహంతో
ఉరకలెత్తించిన, ఉక్కు సంకల్పంతో ఢిల్లీ వీధుల్ని హోరెత్తించిన విశాఖ జగన్‌జనమయింది. 
ఒక అడుగు..వేలు లక్షల అడుగులయి జైత్రయాత్రను తలపించింది. విశాఖ బంగాళాఖాతం  చెంత జనసునామీ చుట్టేసింది. వేలులక్షల గుండెగొంతుకలు ఒక్కటే...జగన్‌ రావాలి...జగన్ కావాలి అని నినదించాయి. అక్కడ తుఫాను హోరు... సునామీ జోరు....నింగికెగిసన కెరుటాలు... యారాడ కొండల్ని కనిపించనివ్వని అలల జోరు.. ఇవేవీ సముద్రం ఆనవాళ్లు కాదు... జగన్‌ వెంట నడిచిన జనసంద్రం తీరుతెన్నులు...విశాఖ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో...కొత్త చరిత్ర మిరుమిట్లు గొలిపింది. కంచరపాలెం మెట్టు దగ్గర జగన్‌ మాటలు జనం గుండెల్ని తాకాయి. 
రాజన్న తలపించాయి. రాజన్న బిడ్డపై అంతులేని అభిమానం చూపాయి.
విశాఖ జనవీచికలు...కొత్తగాలులకు పచ్చ జెండా వూపాయి.
జనసంద్రంలోంచి జగనోదయం....
ఆకాశ భాస్కరుడి ఉషోదయానికి పట్టిన చిత్రిక అయింది.
మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని కవితలు ఉరకలెత్తే ఉత్తుంగతరంగాలు
జగన్‌ వెంట కదిలొచ్చిన జనపదాలు...జ్ఞానపదాలు మహానేతను మెచ్చి...
జగన్‌ కోసం ఉరకలెత్తిన జవనాశ్వాలు...... 
 
 
Back to Top