జగన్‌ చెప్పిందేగా మంత్రి యనమల చెప్పింది..?

– జగన్‌ వ్యాఖ్యలపై రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా 
– అదే విషయం యనమల చెబితే కరెక్టే
– వైయస్‌ఆర్‌సీపీపై కాపు వ్యతిరేక ముద్ర వేసే కుట్ర
– కాపు రిజర్వేషన్లపై మంత్రులు సోమిరెడ్డి, యనమల పరస్పర భిన్న అభిప్రాయాలు 


కాపుల రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. బీసీలకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటే మేం మద్దతు ప్రకటిస్తాం. కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్లపై నేను హామీ ఇవ్వలేను. నా చేతిలో లేదని నిజాయితీగా చెబుతున్నా. కాపులకు చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఇస్తానని చెప్పి రూ. 1340 కోట్లు ఖర్చు పెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కాపులకు పది వేల కోట్లు కేటాయిస్తానని హామీ ఇస్తున్నా. నా మాటలను దారుణంగా వక్రీకరించారు. జగన్‌పై కాపు వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎల్లో మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అసలు కాపులకు అన్యాయం చేసిందెవరు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు. అధికారంలోకి రాగానేS ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్‌ ఇస్తానని చంద్రబాబు చెప్పలేదా. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయింది. రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. తీరా ఇప్పుడు ఎన్నికలు రావడం చూసి జగన్‌ను దోషిగా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. 
తూర్పుగోదావరిలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో కాపుల రిజర్వేషన్లపై వైయస్‌ జగన్‌ సూటిగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. మోసపూరిత హామీలతో కాలయాపన చేయడం తనకిష్టం లేదని జగన్‌ చెప్పారు. కానీ ఎల్లో మీడియా మాత్రం కాపులకు వ్యతిరేకి అని ప్రచారం మొదలు పెట్టింది. జగన్‌ వార్తలకు కనీసం డీసీ స్పేస్‌ కూడా కేటాయించలేని పచ్చ పత్రికలు ఈ విషయాన్ని మాత్రం మొదటి పేజీ బ్యానర్‌గా ప్రచురించి వైయస్‌ఆర్‌సీపీకి కాపులను దూరం చేయాలని భారీ ఆలోచనకు రూపకల్పన చేశారు. 
సరిగ్గా ఇదే విధంగా నిన్న మంత్రి యనమల రామకృష్ణుడు కూడా కాపుల రిజర్వేషన్లపై మాట్లాడారు. కాపుల రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉంటాయని.. 50 శాతం దాటిన రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు అంగీకరించదని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితిలో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. దాంతోపాటు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు, మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తానికి కాపుల రిజర్వేషన్లు అనేది సాధ్యం కాదనేది ఆయన తేల్చేశారు. ఇది నిన్నటి మాట. 
ఇదే కాపుల రిజర్వేషన్లపై మొన్న మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని నానా మాటలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని సోమిరెడ్డి ముక్తాయించారు. కాపుల రిజర్వేషన్ల కోసం బీజేపీ మీద ఒత్తిడి తెస్తామనీ చెప్పారు. జగన్‌ను తిట్టడానికి హడావుడిగా ప్రెస్‌ మీట్‌ పెట్టిన సోమిరెడ్డి ఇక్కడో కీలక విషయాన్ని మరిచిపోయారు. నాలుగేళ్లు బీజేపీతో ఎన్‌డీఏలో కలిసినప్పుడే పోరాడి సాధించలేదని ఇప్పుడు.. బయటకొచ్చాక రిజర్వేషన్లకు పోరాడతామని చెప్పడం కాపులను మోసగించడమే. 
ఇదే కాపుల రిజర్వేషన్‌ అంశంపై చంద్రబాబు మాటలు చూడాలి. తమిళనాడు తరహా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండీ.., బీజేపీతో నాలుగేళ్లు పొత్తు కొనసాగించినంత కాలం వారి మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించలేని చంద్రబాబు ఇప్పుడొచ్చి బీసీలను మధ్యలోకి లాక్కొSచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టి తాను బయట పడాలని చూస్తున్నారు. 
గత ఎన్నికలకు ముందు కాపులు అడక్కపోయినా వారి ఓట్ల కోసం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఘోరంగా మోసగించింది చంద్రబాబు. కాపులు ఉద్యమాలు చేస్తే పోలీసులతో అణచి వేయించింది చంద్రబాబు.. తుని ఘటనను బూచిగా చూపించి కాపుల్లో భయాందోⶠనకు గురి చేసింది చంద్రబాబు. కాపు నాయకుడు ముద్రగడ కుటుంబ సభ్యులను లాఠీలతో కొట్టి బండ బూతులు తిట్టించింది చంద్రబాబు. ఉద్యమం తీవ్రంకావడంతో రిజర్వేషన్లు ఇచ్చేసినట్టు మంత్రి వర్గంలో హడావుyì  తీర్మాణం చేసి స్వీట్లు పంచింది చంద్రబాబు. రిజర్వేషన్లు ఎక్కడ అని కాపు సోదరులు అడిగితే అదే చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీని బద్నాం చేసేలా జగన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. జగన్‌ నిజం మాట్లాడినా తప్పే.. టీడీపీ నాయకులు జగన్‌ను ఏమన్నా రైటే అన్నట్టుగా తయారైంది ఎల్లో మీడియా వ్యవహారం. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా.. ఇస్తే ఎలా ఇవ్వాలని అనే అంశాన్ని పక్కన పెట్టి జగన్‌ను కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఎలా ఇరుకున పెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు ప్రమోటెడ్‌ ఎల్లో మీడియా పనిచేస్తుండటం బాధాకరం.
Back to Top