ఐరెన్ లెగ్ బాబు

 చంద్రబాబు ఎక్కడ అడుగు
పెడితే అక్కడ దుంప నాశనం. సర్వం అరిష్టం. ఈ విషయం ఆయన గారి గత పాలనా అనుభవాలతో కాదు 2014 నుండీ ఆయన దివ్యపాద
మహిమను చూసే చెప్పాల్సి వస్తోంది. ఏమంటూ చంద్రబాబు తన ప్రమాణ స్వీకారంలో తుఫాన్లు వస్తున్నాయి
అన్నాడో గానీ ఆయన గారు అధికారం చేపట్టిన వెంటనే విశాఖను హుద్ హుద్ తుఫాను వణికించింది. కోటాను కోట్ల నష్టంలోంచి
విశాఖ ఇంకా తేరుకోనేలేదు. బాబు అడుగుపెడితే వడగళ్లవానలు, వాతావరణం తారు మారు. మొన్నటికి మొన్న ఒంటిమిట్ట
కళ్యాణంలో చంద్రబాబు ప్రయాణం మొదలైందో లేదో ఇలా తుఫాను తరుముకొచ్చింది. బాబు అడుగుపెట్టగానే
గుళ్లోనే హోరుగాలులు, దీపాలు ఆరిపోయి, ప్రాణాలు కొండెక్కి పోయాయి. అంటే బాబు లెగ్గు దెబ్బ
దేవుళ్లకు కూడా తగిలిందన్నమాట.

పొత్తులేనిదే బాబు లేడు

బాబు లెగ్గు వల్లప్రకృతి పని, దేవుడిపనే అలా వుంటే
ఇక బాబు పొత్తు పెట్టుకున్న పార్టీల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా? మాంచి స్వింగ్ లో ఉండి, దేశమంతా హవా నడుస్తున్న
పార్టీలను ఎంచుకుని మరీ పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబు. తీరా తన అవినీతి, బంధుప్రీతి, అరాచకాల బురదను ఆ పార్టీలకు
అంటించేసి, అవసరం తీరగానే దులుపుకుని వెళ్లిపోతాడు.  అసలు చంద్రబాబు అంటేనే
పొత్తులు జిత్తులు కదా. ఆయన రాజకీయ జీవితం ఆరంభం నుంచీ వాడుకుని వదిలేసే పొత్తుల
తోనే గడిచింది. 1995 లో మామగారికి వెన్నుపోటు పొడిచి టీడీపీని కబ్జా చేసిన
చంద్రబాబు మొదటి నుండీ కూటమి రాజకీయాలకు ఆసక్తి చూపేవాడు. ఎన్నికలు ఒంటరిగా ఎదుక్కునే
ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. 95లో ఎన్నికలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు. ఆ సందర్భంలోనే వామపక్షాల
మద్దతు తీసుకున్నాడు.

జాతీయ పార్టీలను ముంచిన
బాబు లెగ్గు

1999 లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరిగాయి. అప్పడు కార్గిల్ సెంటిమెంట్
బాగా పనిచేస్తోందని తెలిసే బీజేపీతో ముందస్తు పొత్తు చేసుకుని గెలిచాడు చంద్రబాబు. బాబుతో పొత్తు దెబ్బ
తర్వాతి ఎలక్షన్లలో బాగా కనిపించింది. 20004లో అటు బీజేపీ ఇటు టిడిపి రెండూ ఓడాయి. దాంతో నెమ్మదిగా సోనియాతో
లాలూచీ పడి, పాత సంబంధాలన్నీ మెరుగు పరుచుకున్నారు. ఆ సంబంధాలతోనే కాంగ్రెస్ తో కుమ్మక్కయి ఆ తర్వాత వైఎస్
జగన్ పై కేసులు పెట్టాడు.  2009 చంద్రబాబు టీఆర్ ఎస్
వామపక్షాలతో కలిసి మహాకూటమి అని మొదలు పెట్టాడు. బాబు తో కలిసినందుకు మహాకూటమికి మహాపరాభవం జరిగింది. 2014 మళ్లీ బీజేపీ పంచన చేరాడు
చంద్రబాబు. మోదీ హవాను విచ్చలవిడిగా వాడుకున్నాడు. మళ్లీ ఎన్నికల కాలం సమీపించే నాటికి బాబుతో కలిసి నడిచినందుకు, మోదీ ప్రభుత్వానికి
ఎపిలో పుట్టగతులు లేకుండా పోయాయి. బాబు తో పొత్తా మజాకా అని తలలు పట్టుకుంటున్నారు కమలం
నేతలు. చంద్రబాబు లెగ్గు అటు ప్రజలనే కాదు ఇటు పార్టీలనూ తలకిందులు చేస్తోందని విశ్లేషకుల
మాట. 

Back to Top