మంగళవారమే బ్రీఫ్ డ్ దినమా..!

() తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
కలిగించిన బ్రీఫ్ రాజకీయం

() ఓటుకి కోట్లు చెల్లిస్తూ
అడ్డగోలుగా దొరికిపోయిన రోజు

() దేశ వ్యాప్తంగా తెలుగువారి
ప్రతిష్టను మంటకలిపిన చంద్రబాబు

() ఇప్పటికీ నిప్పు అంటూ
పచ్చమీడియాలో డప్పు

హైదరాబాద్)
తెలుగు రాష్ట్రాల్లో మే 31వ తేదీ చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఓటు కోసం కోట్ల
రూపాయిలు చెల్లిస్తూ తెలుగుదేశం నాయకులు బహిరంగంగా దొరికిపోయిన రోజు. అవినీతి
సొమ్ముతో ఏమైనా చేయవచ్చన్న తెంపరితనం బట్టబయలు అయిన రోజు అది. మొదటగా టీడీపీ
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియో టేపు తో సహా దొరికిపోగా, సదరు సమయంలో ఎమ్మెల్సీ
స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడి చంద్రబాబు ఆడియో టేపు తో బయట పడ్డారు. మనవాళ్లూ
బ్రీఫ్ డ్ మీ అంటూ చంద్రబాబు చేసిన పలకరింపు చెరగని ముద్రగా మిగిలిపోయింది.

సరిగ్గా ఏడాది
క్రితం ఏం జరిగిందంటే..
!

          తెలంగాణ లో ఎమ్మెల్సీ పదవికి తగినంత బలం
లేకపోయినా టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. అడ్డదారిలో అయినా ఎమ్మెల్సీ పదవి
దక్కించుకోవాలని చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్
లో అవినీతి పనులు చేసి సంపాదించిన కోట్ల రూపాయిల్ని తీసుకొచ్చి కుమ్మరించారు.
‘బాస్’ ఆదేశాలకు అనుగుణంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే
స్టీఫెన్ సన్ కు వల వేశారు. ఆయనకు కోట్ల రూపాయిలు చెల్లించేందుకు ప్రయత్నించారు.
ఇందులో భాగంగా రూ. 50 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డు
అయింది. కొద్ది సేపటికే ఈ వీడియో టీవీ చానెళ్లలో ప్రసారం కావటం, కొద్ది సేపటికే
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కావటం జరిగిపోయాయి. చంద్రబాబు అవినీతి దందా
ఒక్కసారిగా వెలుగు చూసింది.

కొద్ది
రోజులకే బ్రీఫ్ వేడు

          ఇది జరిగిన కొద్ది రోజులకే చంద్రబాబు
మాట్లాడిన ఆడియో టేపు వెలుగు చూసింది. మన వాళ్లూ బ్రీఫ్ డీ మీ అంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే
స్టీఫెన్ సన్ తో చంద్రబాబు సాగించిన బేరసారాలు అప్పట్లో సంచలన కలిగించాయి. (
చంద్రబాబు పూర్తి బ్రీప్ డ్ సంభాషణ గురించి చూడండి http://www.ysrcongress.com/news/more_news/briefed-language-of-chandrababu.html ) పట్ట పగలు
ఒక ముఖ్యమంత్రి సాగించిన బేరసారాలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. జాతీయ మీడియాలో
సైతం పెద్ద ఎత్తున ఈ సంభాషణలుప్రసారం అయ్యాయి.

అవినీతి వరదలై
పారెన్

          కొన్ని దశాబ్దాలు గా చంద్రబాబు
చేస్తున్న నీచ రాజకీయాలు ఒక్కసారిగా వెలుగు చూశాయి. పొద్దున లేచినప్పటి నుంచీ తాను
నిప్పు అని, తుప్పు అని చెప్పుకొనే చంద్రబాబు అసలు స్వరూపం ఆడియో వీడియో టేపుల
సాక్షిగా బట్ట బయలైంది. అప్పట్లో దీని మీద మాటల యుద్దం చేసిన చంద్రబాబు , తర్వాత
కాలంలో ఎప్పటిలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కాళ్లు పట్టుకొని మ్యాటర్ ను
సెటిల్ చేయించుకొన్నారు. దీంతో ఈ కేసు ఎప్పటిలాగే అటక ఎక్కేసింది.

 

Back to Top