ఇదే తెలుగుదేశం సంస్క్రతి

సొంత పార్టీ వ్యవహారం కాదు 
ఇంట్లో ఫంక్షన్ కానే కాదు
మరి, పెద్దల్ని పిలిచి అవమానిస్తారా

విజయవాడ :
అమరావతి పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన పనులు
అన్నీ ఇన్నీ కావు. శంకుస్థాపన పేరుతో 400 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి
అయినవాళ్లకు ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెట్టి సాగనంపారు.

రాజధాని
నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన అంటూ చంద్రబాబు ప్రభుత్వం హైప్
క్రియేట్ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రుల్ని
 పిలుస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల
పెద్దల్ని పిలుస్తామని హడావుడి చేసింది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి
వేదిక అయిన క్రతువు కు తాను రాలేనంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందుగానే
స్పష్టం చేసి తప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శంకుస్థాపనకు
దూరం పాటించారు.

శంకుస్థాపనకు హాజరైన వామపక్ష
నాయకుల్ని తెలుగుదేశం పెద్దలు ఉద్దేశ పూర్వకంగా అవమానించారు. రెండు పార్టీల
రాష్ట్ర కార్యదర్శులు హాజరు అయ్యారు. అయినప్పటికీ వారికి తగినంత మర్యాద
చేయకుండా చిన్నబుచ్చారు. దీంతో శంకుస్థాపన ప్రాంగణం దగ్గర వేచి చూసిన సీపీఐ
అగ్ర నేతలు నారాయణ, రామక్రష్ణ, సీపీఎం కార్యదర్శి మధు కొద్ది సేపటి తర్వాత
బయలుదేరి వెళ్లిపోయారు. 

మిత్రపక్షం బీజేపీ ని
ఎంత వరకు తగ్గించి చూపాలో అంత వరకు తగ్గించి ఉంచారు. ప్రధానమంత్రి
నరేంద్రమోదీ చేస్తున్న శంకుస్థాపన కావటంతో ఆపార్టీ నాయకులకు అధికారుల నుంచి
ఆదరణ దొరికింది. తెలుగుదేశం శ్రేణులు మాత్రం వారిని చుట్టుముట్టి ఉంచారు.
అటు, బీజేపీ నాయకత్వం తమ పార్టీ నాయకులకు జారీ చేసిన పాస్ లు చెల్లనేలేదు.
దీంతో ద్వితీయశ్రేణి నాయకులు చిన్నబుచ్చుకొన్నారు.
Back to Top