అయ్యా ఎస్..చంద్రబాబు పాలనలో ఐఏఎస్‌ల దుస్థితి

–జన్మభూమి కమిటీల కన్నా దారుణంగా ఐఏఎస్ ల పరిస్థితి
– ఉత్తుత్తి వీడియో కాన్ఫరెన్సులతో సమయం వృథా
– పబ్లిసిటీ  కోసమే బాబు ముస్సోరి పర్యటన

మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే డిస్కో అందంట.. చేతల్లో చూపించేది లేకపోయినా చంద్రబాబు మాటల్లో కోటలు దాటిస్తున్నాడు. నిన్ననే ముస్సోరిలో ఐఏఎస్‌లకు ఆయన కీలక ఉపన్యాసం చేసి డప్పు కొట్టేసి వచ్చారు. తానెప్పుడూ నిత్య విద్యార్థిని అని ఐఏఎస్‌ల ముందర వీరత్వం ప్రదర్శించి వచ్చేశారు. ఐటీని తానే అభివృద్ధి చేశానని.. బిల్‌గేట్స్‌ని ఇండియాకు తీసుకొచ్చానని ఎప్పుడో గతించిన చరిత్ర గురించి వారి చెవుల్లో ఊదేసి వచ్చారు. ఏపీ జీఎస్‌డీపీని కేంద్ర జీడీపీ కంటే పెంచానంటూ అబద్ధాలను అలవోకగా చెబుతున్న చంద్రబాబు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఎందుకు వెనుకబడిందో మాత్రం చెప్పలేకపోయారు. 

అసలు చంద్రబాబుకు అర్హత ఉందా...
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ట్రైనీ ఐఏఎస్‌లకు చంద్రబాబు చెప్పిన మాటలు వింటే ఏపీ ప్రజలెవరైనా నవ్వకుండా ఉండరు. వ్యవసాయం దండగ, వ్యవసాయంలో లాభాలు రావు డబ్బులు వేస్ట్‌ అన్న నోటితోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏపీని అగ్రికల్చర్‌ హబ్‌గా చేస్తానని ఢంకా భజాయించి వచ్చేశారు. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు తీరుతో ఐఏఎస్‌లు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఆయనకు కనిపించవు. వారానికోసారి గంటలకు గంటలు వీడియో కాన్ఫరెన్సులు పెట్టి వారి టైం మొత్తాన్ని తినేసి నెల తిరిగేసరికి మీరేం చేస్తున్నారని చెప్పడం బాబుకే చెల్లింది. బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనతోపాటు ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేరు. సీఎంవో కార్యాలయాన్ని  టీడీపీ పార్టీ కార్యాలయంగా మార్చేశారని ఆయన చెప్పిన మాటలు దేనికి నిదర్శనం. జన్మభూమి కమిటీలకున్న ప్రాధాన్యత చంద్రబాబు పాలనలో ఐఏఎస్‌లకు లేదంటే ఏవిధంగా అర్థం చేసుకోవాలి. 

దటీజ్ వైయస్ఆర్
వైయస్‌ఆర్‌ సీఎంగా చేసింది కొద్ది కాలమే అయినా చరిత్రను మలుపుతిప్పే పథకాలతో.. మరెవరూ తీసేయలేని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో అభిమాన సముద్రాన్ని సృష్టించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించి ఎనిమిదేళ్లయినా ఆ పథకాలను తీసేసే సాహసం ఏ సీఎం చేయలేకపోతున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. అవి ఎంతగా ప్రజల్లో హృదయాల్లో గుర్తుండిపోయాయో. దశాబ్ధాలుగా పడి ఉన్న సమస్యలను పరిష్కరించి ఐదున్నరేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. జలయజ్ఞం, పక్కా గృహాల నిర్మాణం, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, డ్వాక్రా రుణాలు.. ఇలా ప్రతి వర్గానికీ ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. 

చంద్రబాబు చేసిందేంటి..
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికే అమల్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి నిరసన వ్యక్తం చేసిన రైతుల మీద లాఠీ  చార్జీలు చేయించారు. బషీర్‌బాగ్‌లో పోలీసులను పురమాయించి రైతుల  ప్రాణాలను బలిగొన్నారు. కరెంటు బిల్లులు కట్టలేదని పొలాల్లో రైతుల మోటార్లు, కెపాసిటర్లు ఊడపీకించిన కఠిన హృదయం బాబుది. అలాంటి చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలతో 2014లోనూ జిమ్మిక్కులతో ప్రుజలను నమ్మించి మళ్లీ అధికారంలోకి వచ్చాడు. ఇంకేముంది షరా మామూలే. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో దాదాపు 4లక్షల కోట్లు దోచుకోవడం తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజా సమస్యలను గాలికొదిలి అవినీతిలో దూసుకుపోతున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం  చెప్పేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. 
Back to Top