హిస్టరీ రిపీట్స్‌


– నిజమవుతున్న దివంగత నేత వైయస్‌ఆర్‌ మాటలు
– ప్రత్తిపాడు నియోజకవర్గంలో 
   నాడు చంద్రబాబును విమర్శించిన మహానేత 
– జనంపై వరాల మూటలు కురిపిస్తున్న చంద్రబాబు
– నాలుగేళ్లు నిర్లక్ష్యం వహించి.. ఇప్పుడు హడావుడి 
– పాదయాత్రలో బాబును నిలదీస్తున్న జననేత 


తండ్రీతనయుల పాదయాత్రలు ప్రభుత్వాన్ని ఆకాశం నుంచి భూమికి దించేశాయి. ఇన్నాళ్లూ మర్చిపోయిన ప్రజలపై చంద్రబాబు వరాల మూటలు కురిపిస్తున్నాడు. ఆనాడు ప్రత్తిపాడులో వైయస్‌ఆర్‌ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచే సి గమ్యానికి చేరువైతే.. నేడు ప్రజా సంకల్పయాత్రతో జననేత వైయస్‌ జగన్‌ జనం గుండెల్లో నిలిచిపోతున్నారు. తానూ త్వరలోనే ఇచ్ఛాపురానికి చేరువ కాబోతున్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటంతో జనం గుండెల్లో నిలిచిన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన అడుగు జాడల్లో వైయస్‌ జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు. తండ్రీ కొడుకులు వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌లిద్దరూ ప్రతిపక్ష నేతలుగా పాదయాత్రలో ఉండగా.. చంద్రబాబే సీఎంగా ఉన్నారు. ఇద్దరూ  తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలో పాదయాత్ర జరిపారు (జననేత ఇంకా ఈనియోజకవర్గంలోనే ఉన్నారు)
 ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు జరుగుతున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటి బాబు పాలనకు కూడా అక్షరాలా వర్తింపజేసుకోవచ్చు. నాలుగేళ్లు ప్రజా సమస్యలు మర్చిపోయిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ జనంపై వరాలు మూటలు కురిపిస్తున్నారంటూ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అన్నారు. అవే ఇప్పుడూ అక్షర సత్యాలవుతున్నాయి. నాలుగేళ్లు ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు.. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో  కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఎన్నికలకు ముందు  రెండు వేల నిరుద్యోగ భృతి అని చెప్పిన చంద్రబాబు.. అసలు నేను అనిందే లేదని ఒకసారి.. ఇస్తామని ఒకసారి ఇలా యూ టర్న్‌లు తీసుకుని చివరికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కోటీ 70 లక్షల మంది లబ్ధిదారులను కేవలం 12 లక్షల మందికి కుదించి మమ అనిపించడానికి సిద్ధమయ్యారు. 
ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులు, రైతు కూలీలు అధికంగా ఉన్నారు. టీడీపీ పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు జననేత వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రైతు రుణమాఫీ జరగలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటే ఓటేసి మోసపోయామని వైయస్‌ జగన్‌కు చెప్పుకుని మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లలను చదివించుకోవాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుద్దామంటే టీచర్లు లేరని.. ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీని తట్టుకోలేకపోతున్నాయని జననేతకు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉంటే మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. వీరందరి కష్టాలను విన్న వైయస్‌ జగన్‌ చలించిపోయారు. బాధిత రైతులకు, మహిళలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కౌలు రైతుల చట్టాన్ని ప్రక్షాళన చేసి న్యాయం చేస్తామని.. ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీని అరికడతామని.. మూసేసిన ప్రభుత్వ బడులను తెరిపించి డీఎస్సీ ద్వారా ఖాళీ అయిన టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top