చారిత్రక ఆనవాలు భవిష్యత్ చేవ్రాలు

సంకల్పం
ధృడమైనదైతే సమయమే తల వంచుతుంది.
వైఎస్ జగన్ మోహన్
రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పం ఓ వజ్ర సంకల్పం. అందుకే ఆ అడుగు తడబడదు. ఆతడి లక్ష్యం ఉన్నతం కనుకనే అతడిని కష్టాలు
బాధించవు. ప్రజా సంకల్పం…ప్రజల కోసం, ప్రజలల్లో ఒక్కడై, ప్రజలే తానై సాగిస్తున్న యాత్ర ప్రజాసంకల్ప
పాదయాత్ర. ఆ అడుగులు అలుపు లేకుండా 2000 కిలోమీటర్ల మైలు రాయికి చేరనున్నాయి. ముళ్లబాటనైనా చిరునవ్వుతో నడిచే సత్తువ
ఓ యువ నాయకుడికి ఎలా వచ్చింది.
తండ్రి ఆశయాలు ఊపిరిగా, ప్రజా సంక్షేమం పరమావధిగా ఉన్న నాయకుడికి, బ్రహ్మరధం పడుతున్న అశేష ప్రజాభిమానమే
అతడి బలం.

2000KM@ ఏలూరు

నాలుగు రాయలసీమ జిల్లాలు, నాలుగు కోస్తా
జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్ర మే నెల 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని
ఏలూరుకు చేరుకుంటోంది. జిల్లాల వారీగా చూస్తే ప్రజా సంకల్పం తొమ్మిదొవ జిల్లాలో అడుగు
పెట్టనుంది. ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పం ప్రారంభం కానుంది.

అపురూపం ఈ ఘట్టం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మే
నెలలో ఏలూరు చేరడంలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి- నాడు మహానేత వైఎస్ రాజశేఖర్
రెడ్డి ప్రజాప్రస్థానంలో భాగంగా ఇదే నెలలో ఏలూరులో ఉన్నారు. దివంగతనేత వైఎస్
రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం 2013 మే నెలలోనే  ఏలూరులో అడుగు పెట్టింది. అదే విధంగా వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర కూడా అదే రోజు ఏలూరులో అడుగు పెట్టడం ఓ చారిత్రాత్మక ఘట్టం.

 రెండు
- జగనన్న వదిలిన బాణాన్ని అంటూ మరో ప్రజాప్రస్థానం సాగించిన షర్మిల గారి 2000 కిలోమీటర్ల
మైలు రాయి సైతం ఇదే ఏలూరులో సాగడం. ఇప్పుడు అదే బాటలో యువనేత ఎపి ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మహావజ్ర సంకల్పం 2000కిలోమీటర్లను
ఇదే ఏలూరులో అధిగమిస్తోంది. ఆ మహానేత ఆశీస్సులు, సోదరి షర్మిల అభినందనలు, అఖడం
తెలుగు ప్రజల ఆశీర్వాదాలు యువనేతకు అండగా ఉన్నాయనటానికి ఏలూరులో వైఎస్ జగన్
ఆవిష్కరించనున్న పైలాన్ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఏలూరు గుండెలో

ప్రజా
సంకల్ప పాదయాత్ర ఏలూరులో అడుగు పెడుతున్నవేళ ప్రజలు నాడు వైఎస్సార్, ఆయన బిడ్డ షర్మిల పాదయాత్రల గుర్తు చేసుకుంటున్నారు. యువనేత వైఎస్ జగన్ ఏలూరులో నిర్వహించిన
యువభేరీ నాదాలను తలుచుకుంటున్నారు. పోరాటానికి
పుట్టినిల్లులాంటి వైఎస్ కుటుంబాన్ని ఏలూరు ప్రజానీకం తమ గుండెల్లో నిలుపుకున్నారు. నాడు ప్రజా సమస్యలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి
గడప గడపకూ వచ్చి అడిగి మరీ తెలుసుకోవడాన్ని తలుచుకుంటున్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని కోరుతూ
సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిలను గుర్తు చేసుకుంటున్నారు. మెన్న, నిన్న, నేడూ రాజశేఖర రెడ్డి ఆయన వారసులు ప్రజాక్షేత్రంలో
నిలిచారు. ప్రజల పక్షాన నిలిచారు.

గుర్తుకురాని
బాబు యాత్రలు

2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం
పేరుతో అర్థపాదయాత్రను చేసారు.
కొంత దూరం నడిచి
తర్వాత బస్సు ఎక్కి ప్రయాణం చేసి,
ఆపసోపాలు పడుతూ యాత్రను
పూర్తి చేసారు.
ప్రజలతో మాట్లాడేటప్పుడు, మీ కోసమే ఈ వయసులో ఇంత కష్టపడుతున్న అంటూ
తన కష్టాలు ఏకరువు పెట్టేవారు.
అందుకేనేమో రాష్ట్ర
ప్రజలెప్పుడూ ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతున్నా చంద్రబాబు యాత్రతో కనీసం పోల్చి చూడటం
లేదు. అసలు బాబు పాదయాత్ర చేసాడన్న విషయాన్నే
ప్రజలు తమ దృష్టిలోంచి తీసేసారు.
నిబద్ధతలేని, నిజాయితీ లేని బాబు యాత్రకు విశ్వాసమే
ఊపిరిగా, నమ్మకమే నడకగా సాగే వైఎస్ జగన్
ప్రజా సంకల్పానికి పోలికేమిటి అంటున్నారు రాష్ట్ర ప్రజానీకం. 

Back to Top