ఇక్కడ మోసం.. అక్కడ పోరాటం..!


()  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 20 శాతం కూడా పూర్తికాని రుణ‌మాఫీ
() తెలంగాణ‌లో పూర్త‌యిన రెండోవిడ‌త బ‌కాయి చెల్లింపులు
()  ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో రుణ‌మాఫీ చేయ‌కుండా తెలంగాణలో పోరాటం అంటున్న టీడీపీ

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లో రైతుల్ని గాలికి వదిలేసిన టీడీపీ తెలంగాణ లో మాత్రం ప్రేమ ఒలకపోస్తోంది. రుణమాఫీ అంటూ రైతుల్ని నిండా ముంచేసిన చంద్రబాబు గిమ్మిక్కుల్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు.

ఏపీ లో దొంగాట ఇలా
 రుణ‌మాఫీ విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు, ఎన్నో ష‌ర‌తులు, మ‌రెన్నో వ‌డ‌పోత‌ల‌తో కోత‌లు పెట్టిన చంద్ర‌న్న‌స‌ర్కారు, వాట‌న్నింటినీ దాటుకొని అర్హ‌త సాధించిన రైతుల‌కు సొమ్ము చెల్లించే విష‌యంలో ప‌లు మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మాల‌కు చేప‌ట్టింది. రెండ‌వ కిస్తీ చెల్లింపుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైళ్ల‌పై సంత‌కాలు చేయ‌డం, వివిధ శాఖ‌లు జీవోలు ఇవ్వ‌డం మిన‌హా నేటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుద‌ల చేయ‌లేదు. అర‌కొర‌గా విడుదలైన సొమ్మును సైతం బ్యాంకుల‌కు బ‌దిలీచేయ‌ట్లేదు. అదిగో మాఫీ, ఇదిగో జీవో అన‌డంతో రైతులు బ్యాంకులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణలో దొంగ ప్రేమ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రుణ‌మాఫీ ప‌రిస్థితి ఇలా ఉంటే చంద్ర‌బాబు తెలంగాణ లో రుణ‌మాఫీల‌పై పోరాటం చేస్తాన‌టం విడ్డూరం. తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్ష‌లోపు రుణాలు మాఫీ చేస్తాన‌ని తెలిపి వాటిలో రెండు ద‌శ‌ల‌లో ఇప్ప‌టికే 50 శాతం బ‌కాయిలు చెల్లించింది. మూడ‌వ ద‌శ కిస్తీ చెల్లిపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌టి విడ‌త కిస్తీ చెల్లింపు కూడా స‌క్ర‌మంగా చేయ‌లేదు. కానీ తెలంగాణ‌ రాష్ట్రంలో రుణ‌మాఫీ అమ‌లు చేయ‌డానికి, రైతుల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి చంద్ర‌బాబు పోరాటం చేస్తాన‌న‌డం హాస్యాస్ప‌దం. ఈ మేరకు టీ టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటిస్తున్నారు. 
త‌ల్లికి అన్నం పెట్ట‌లేని వాడు పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు కొనిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రుణ‌మాఫీ చేయ‌కుండా తెలంగాణలో రుణమాఫీ కోసం పోరాటం చేస్తారంట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల మేనిఫెస్టో ప్ర‌కారం అంద‌రికీ రుణ‌మాఫీ చేస్తాను. తాక‌ట్టు పెట్టిన మీ పుస్తెల తాడు మీ ఇంటికి వ‌స్తుంది. తాక‌ట్టు పెట్టిన మీ ద‌స్తావేజులు మీ ఇంటికి వ‌స్తాయి అని మాట‌లు ప‌లికిన బాబు వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. మొద‌టి విడ‌త రుణ‌మాఫీలో 20 శాతం కూడా మాఫీ జ‌ర‌గ‌లేదు. బ్యాంకుల నుంచి చాలా మంది రైతులకు ఇప్ప‌టికే బంగారు న‌గ‌ల వేలం నోటీసులు అందాయి. ఇదీ చంద్రబాబు నైజం. 
Back to Top