రగిలిన ప్రత్యేక ఉద్యమం

–ప్రత్యేక హోదా సాధనకు పట్టువదలని వైయస్‌ఆర్‌సీపీ
–ప్రత్యక్ష ఆందోళనకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు
–ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ
– రిపబ్లిక్‌ డే సాయంత్రాన క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొననున్న ప్రతిపక్ష నేత 
–శాంతియుత ప్రదర్శనపై ఆంక్షలు విధించడంపై ఆంధ్ర యువత ఆగ్రహం 
 
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు.  ఇప్పటి వరకు దశలవారీగా ఉద్యమించిన ప్రతిపక్ష నేత..మరోమారు హోదా గళం వినిపించేందుకు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన వైయస్‌ జగన్‌..ఆయనే స్వయంగా విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించడంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. ఎలాగైనా ఈ నిరసన ప్రదర్శనను నిలుపుదల చేయాలని సర్కార్‌ కుట్రలు చేస్తోంది. జనవరి 26.. అందరికీ తెలిసింది రిపబ్లిక్‌ డే. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా.. దేశమంతా గణతంత్ర వేడుకల్లో ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల ప్రసంగాల కోసం దేశం ఎదురూ చూస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అందరూ సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటే ఆంధ్ర ప్రజలు సూర్యాస్తమయం కోసం కళ్లు కాయులు కాసేలా ఎదురు చూస్తున్నారు. యువత పిడికిలి బిగించి కొవ్వొత్తుల వెలుతురులో రేపటి కోసం.. మన భవిష్యత్తు కోసం.. ప్రత్యేక హోదా కోసం అంటూ నినదించడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులను మోహరించి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించి ప్రత్యేక హోదాను అణచి వేసేందుకు అధికార టీడీపీ, బీజేపీలు కుయుక్తులు పన్నుతున్నాయి.

యువత రగిలిపోతోంది...
రాష్ట్రం  నివురుగప్పిన నిప్పులా తయారైంది. ప్రత్యేక హోదా కోసం ’ఆంధ్రప్రదేశ్‌ యువత’ గళం విప్పుతోంది. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. పార్లమెంట్‌ సాక్షిగా మనకు దక్కాల్సిన హక్కు. దేశం మొత్తం చూస్తుండగా మనకు ప్రధాని ఇచ్చిన హామీ. ఎన్నికలకు ముందు చంద్రబాబు, నరేంద్రమోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్ర ప్రజలకు మాటిచ్చారు. చంద్రబాబు, వెంకయ్య, పవన్‌ కళ్యాణ్, నరేంద్రమోడీ దుష్ట చతుష్టయం చేతులు కలిపి రాష్ట్రానికి అండగా ఉంటామని ఓటేయించుకొని,  గెలిచాక నిలువునా మోసం చేశారు. ప్రధానిగా ఉన్న మోడీ ఆ మాటే మరిచిపోయాడు.. వెంకయ్య ఆవేశంలో అన్నాను అన్నాడు.. చంద్రబాబు ప్యాకేజీతోనే మేలన్నాడు.. పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తానని ప్రశ్నార్థకమైపోయాడు. అందరూ ఏరు దాటాక తెప్ప తగలేశారు. 

శాంతియుత ఆందోళనపై ఆంక్షలా...
దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్‌ని అని చెప్పుకునే చంద్రబాబుకు ఆందోళనలు కొత్త కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చేశాడు. అయితే ఆ మహానుబావుడికి మాత్రం ప్రత్యేక హోదా కోసం యువత రోడ్డెక్కుతుంటే మాత్రం అదేదో తప్పులా కనిపిస్తుంది. 144 సెక్షన్లు, అరెస్టులు పేర్లు చెప్పి యువతను బయటకు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతుండటం బాధాకరం. ఏ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చిందని ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు చంద్రబాబు ఆందోళనలు చేశారు.? నిరాహార దీక్షలు చేశారు.? పాదయాత్రలు నిర్వహించారు.? ఇప్పుడెందుకు యువత విశాఖ వేదికగా చేపడ్తున్న శాంతియుత నిరసనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డు తగులులుతుందని ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 




 

తాజా వీడియోలు

Back to Top