అనంతలో యువనేతకు అపూర్వ స్వాగతం

అనంతలో యువనేతకు అపూర్వ స్వాగతం

ప్రజా సంకల్ప యాత్ర ఓ ప్రవాహంలా సాగుతోంది. ప్రజల మనోభావాలకు ప్రమాణంలా సాగుతోంది. పసిపిల్లను భుజాన వేసుకుని తల్లులు, చేతికర్ర ఊతంగా పట్టుకుని వృద్ధులు, యువనేతను చూడాలనే కొండంత ఆశతో దివ్యాంగులు అడుగడుగునా ఆ జన నేతకు అభిమాన హారతి పడుతున్నారు. తమ బిడ్డలకు రాజన్న బిడ్డ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు. ఆయన చేతుల్లోకి ఎత్తుకున్న తమ చిన్నారులను చూసి మురిసిపోతున్నారు. జన నేత నోటిమీదగా ఆ చిన్నారులకు పేర్లు పెట్టించుకుని ఆనంద పడుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబమే అని భావించే ఓ గొప్ప మనసున్న మనిషిని ఇచ్చినందుకు ఆ తల్లి విజయమ్మకు చేతులెత్తి మొక్కుతున్నారు. అన్నొస్తున్నాడు అని ఒకరికొకరు పిలుచుకుంటూ అక్కచెల్లెళ్లు పరుగు పరుగున వచ్చి ప్రియనేతను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఊళ్లలో మేడలు, మిద్దెలు, చెట్లు ఎక్కిమరి తమ ప్రియతమ నాయకుడిని పలకరిస్తున్నారు. రహదారులంతా జగన్ వెంట ప్రజలు ఓ సేనావాహినిలాగే కదులుతున్నారు. దారిలో ఎదురయ్యే బస్సులు లారీల్లో వెళ్లే ప్రయాణికులు సైతం, ఆగి మరీ జగన్ మోహన్ రెడ్డిని చూసి కేరింతలు కొడుతున్నారు. ఆయనను పలకరించేందుకు బస్సుల్లోంచి చేతులు బయటకు పెట్టి అన్నా అన్నా అంటూ కేకలు పెడుతున్నారు. గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా స్వాగతాలు. తోరణాలు, పూలబాటలతో తమ అశేష అభిమానాన్ని చాటుకుంటున్నారు.  

రాయలసీమలో మూడో జిల్లాకు చేరుకున్న ప్రజాసంకల్ప పాదయాత్ర

ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర వైయస్సార్ కడప జిల్లా, కర్ననూలు జిల్లాలు పూర్తి చేసుకుని అనంతపురంలోకి అడుగుపెట్టింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ, మదనంత పురం, బసినేపల్లి మీదుగా 7నియోజక వర్గాలను దాటుకుంటూ సాగింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకూ మొత్తం 18 రోజులు కర్నూలులో పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె బేతెంచర్ల, గోనెగుండ్ల, పత్తిపాడు జంక్షన్లలో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు పోటెత్తారు. గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లి గ్రామంలో అడుగుపెట్టడం ద్వారా ప్రతిపక్ష నేత పాదయాత్ర కర్నూలు నించి అనంతపురంలోకి అడుగుపెట్టింది. అనంతపురంలో గుత్తిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుతుండగా, విపక్ష నేత ప్రజలనుద్దేశించి ప్రసంగించేటప్పుడూ ప్రభుత్వం క్షక్షసాధింపు చర్యలకు పాల్పడింది. సభ ఆరంభం నుంచి ముగిసే వరకూ కరెంటు కోతపెట్టి, సభ పూర్తి అయిన తర్వాత పునరుద్ధరించింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అనంతపురంలో గుత్తి, తాడిపత్రి లోని గ్రామాలను దాటుకుని శింగనమల నియోజక వర్గంలో సాగుతున్నది.. ప్రజలే కాదు రాజకీయ వర్గాలు సైతం పాదయాత్రకు వచ్చి తమ మద్దతు తెల్పుతున్నాయి. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎందరో నేతలు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేతను కలసి తమ మద్దతు తెలిపారు. 

ప్రతిపక్ష నేతకు తమ గోడు చెప్పుకుంటున్న వివిధ వర్గాల ప్రజలు

పాదయాత్రలో భాగంగా ప్రజలు తమంతట తామే వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఆరాచకాలకు బలౌతున్న ఎన్నో వర్గాలు ఈ పాదయాత్రలో అడుగడుగునా తారసపడుతున్నాయి. వైయ్యస్ జగన్ ను కలిసిన డైట్ విద్యార్థులు సంవత్సరాలు గడుస్తున్నా పరీక్షలు జరగడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనాలు కూడా సవ్యంగా అందంటం లేదని, తామెలా బతకాలంటూ ఆశా వర్కర్ల తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలు, బిసిలు, రైతులు, క్వారీ కార్మికులు, కూలీలు యువనేతకు తమ సాధక బాధకాలు చెప్పుకున్నారు. మన ప్రభుత్వం రాగానే సమస్యలు తీరుతాయని నమ్ముతున్నామని, అందుకే ఎదురు చూసి మరీ మీకు మా కష్టాలు చెప్పుకుంటున్నామని అన్నారు. టిడిపి బిసిలను ఓటు బ్యాంకుగా చూస్తోందని అడుగడుగునా వాపోయారు బిసి సోదరులు. యాత్రలో భాగంగా వీలైన ప్రతిచోటా ప్రజలతో ముఖాముఖీ జరిపారు వైయస్ జగన్. రేషన్ షాపులను కార్పొరేట్ పరం చేసారని దుయ్యబట్టారు. 60శాతం తక్కువ ధరలకు చౌకడిపోలు పేదలకు సరుకులు ఇస్తాయని, చంద్రబాబు 20శాతం తక్కువకు సరుకులు రిలయన్స్ ఇస్తుందని చెప్పడం అన్యాయంగా ఉందన్నారు. పాదయాత్రలో గ్రామీణ చేతివృత్తుల వారు జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. కుమ్మరి, కమ్మరి, నేత పనివాళ్లకు పనులు లేక వలసలు పోతున్నామని చెప్పారు. 

బాధితులకు బాసటగా

ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత కేవలం ప్రజల కష్టాలను వింటూ పోవడమే కాదు, పరిష్కారాలనూ సూచిస్తూ సాగుతున్నారు. దివ్యాంగులకు పింఛను 3000 చేస్తున్నట్టు ప్రకటించారు వైయ్యస్ జగన్. కొందరు అసహాయులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అర్థంతరంగా చదువు ఆగిపోయిందన్న ఓ విద్యార్థిని గురించి కలెక్టర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చార్ ప్రతిపక్షనేత. భర్తపోయి పింఛనులేదని బాధపడే వితంతువుకు అధికారులతో మాట్లాడి ఫించను ఇప్పేంచేందుకు ప్రయత్నిస్తానని మాటిచ్చారు. ప్రస్తుతానికి అనంతపురంలో సాగుతున్న ప్రజా సంకల్పం అలుపూ లేకుండా అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది. అశేష ప్రజావాహినితో కలిసి నడుస్తున్న యువనేత అడుగులతో అధికార టిడిపి గుండెల్లో ఎన్నికల ఫిరంగి మోగుతోంది.  

తాజా ఫోటోలు

Back to Top