తెలుగువారి గుండె చప్పుడు

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి భౌతికంగా దూరం అయినా తెలుగువారి గుండెల్లో ఆయ‌న సుస్థిరంగా నిలిచి ఉన్నారు. ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర ద్వారా పేద‌ల గుండె చ‌ప్పుడు విన్నారు. అధికారం లోకి వ‌చ్చాక పేద‌ల కోసం  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.. ప్రతి గడపకు చేరేందుకు శ్రమిం చా రు.. గిరిపుత్రులకు పోడు భూములపై హక్కు పత్రాలు.. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతు న్న రైతన్నకు నేనున్నా అని భరోసా ఇచ్చారు.. రైతుల‌కు పెద్ద ఎత్తున  రుణమాఫీ చేశారు.. గూడు లేనోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు.. చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించారు.. అనారోగ్యంతో కునారిల్లుతున్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆయుష్షు పోశారు.. పింఛన్లు, ఉచిత విద్యుత్.. ఇలా పలు సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతిఒక్కరు స్మరించుకుంటున్నారు.

() వ్య‌వ‌సాయం అంటే దండ‌గ కాదు, పండ‌గ అనే భావ‌న క‌ల్పించిన ఘ‌న‌త వైయ‌స్సార్ ది. ఆయ‌న  పాలనలో జిల్లాలో కోటి మందికి పైగా రైతులకు పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి, పంటల సాగుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి.. ఆ దిశగా 2008లో ఒకేసారి రుణమాఫీ చేసి.. మళ్లీ రైతులకు రుణాలిచ్చారు. అంతేకాక రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ.. బ్యాంకుల్లో బకాయిలు లేని రైతులకు కూడా ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో రూ.5వేల చొప్పున ప్రోత్సాహకాలను బ్యాంకుల ద్వారా అందించారు. 
() వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకుండా ఉన్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని హామీ ఇచ్చిన మ‌హానేత అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆ ఫైల్ మీదే సంత‌కం చేశారు. అన్న మాట నెర‌వేర్చుకొని మ‌హ‌నీయుడు అయ్యారు. 

()  ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల గూడుగా మారింది. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత మూడు విడతల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయం పెంచి.. అడిగిన వారికల్లా ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు త్వరితగతిన కట్టుకోవడానికి బిల్లులు సైతం చెల్లించారు. త‌ద్వారా పేద‌ల‌కు గూడు క‌ల్పించిన మ‌హ‌నీయుడు అయ్యాడు. 
() మ‌హానేత‌ అధికారంలోకి రాకముందు పింఛన్ కేవలం నెలకు రూ.75 మాత్రమే ఉండేది. అవి కూడా గ్రామాల్లో అతికొద్ది మందికి మాత్రమే వచ్చేవి. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా రూ.200లకు పెంచారు. వృద్ధులైన భార్యాభర్తలు, వికలాంగులు, వితంతువులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించారు. ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది అర్హులున్నా ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు.

()  ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా  నిరుపేద, బ‌డుగు, బ‌ల‌హీన‌, గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి, కొలువుల్లో స్థిర‌ప‌డ్డారు. 
() వైయ‌స్సార్ హ‌యంలో అద్భుత ప‌థ‌కం ఆరోగ్య శ్రీ.  2008, జూలై 17 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. నిరుపేద‌ల‌కు కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో వైద్యం అందించిన ఘ‌న‌త మ‌హానేత‌కు ద‌క్కుతుంది. వైఎస్ చలవతోనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక మంది రోగులు లబ్ధిపొందారు.

()  ‘ఏళ్ల తర బడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు దొంగల్లా కాకుండా.. ఇకనుంచి దొరల్లా బతకండి’ అని 2009, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో గిరిజనులకు హక్కు పత్రాలను పంపిణీ చేసినప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అన్న మాటలివి. ఆ మహానేత చేతులమీదుగా నాడు హక్కు పత్రాలు పొందిన గిరిజనులు పోడు భూముల్లో మాగాణి పంటలు పండించుకుంటూ.. ఆనందోత్సాహాలతో జీవనం సాగిస్తున్నారు. ఏజ‌న్సీ ప్రాంతంలో ఆయ‌న చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ఆయ‌న్ని దేవుడిగా మార్చేసింది.
() మ‌హానేత అందించిన మ‌రో వ‌రం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాలు. ఆయ‌న చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ద్వారా అక్క చెల్లెమ్మ‌లు ల‌క్షాధికారులుగా మారారు. మ‌హిళా సాధికార‌త సాకారం అయిన ఘ‌ట్టం అది. 
Back to Top