అతనే ఓ ధైర్యం

  • 28 నుంచి వైయస్‌ జగన్‌ ‘రైతు భరోసా యాత్ర’
  • బాబు మాటలు నమ్మి మోసపోయిన రైతులు
  • అప్పుల బాధలు ఎక్కువై ఆత్మహత్యలు
  • పట్టించుకోని సర్కార్‌
  • నేనున్నానంటూ రైతుల్లో ధైర్యం నింపుతున్న ప్రతిపక్ష నేత 
భూమిలో సిరులు పండించాల్సిన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సమాజానికి పట్టెడన్నం పెట్టే అన్నదాత ఉరితాడు బిగించుకుంటున్నాడు. రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం మోసం చేయడంతో రైతులు అప్పులు తీర్చలేక.. కొత్త అప్పులు పుట్టక తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుల్లో ధైర్యం నింపుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా’ యాత్ర చేపట్టనున్నారు. 

భూమిని నమ్ముకుని లక్షల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న  రైతులకు అప్పులే మిగులుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో ఆదుకోవాల్సిన సర్కార్‌ చేతులెత్తేస్తోంది. ఫలితంగా రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.

రైతులను మోసం చేసిన బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారు.  బాబు  రుణమాఫీ చేయని కారణంగా అసలుకు తోడు.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, పంటల బీమా, ఇన్‌పుట్‌సబ్సీడీ వంటి సౌకర్యాలు పోయి రైతులపై 14 శాతం మేర అపరాధ వడ్డీ పడుతోంది. రైతుల రుణాలను ప్రభుత్వం పూర్తిగా తీరిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి రుణం పుట్టేది. అయితే చంద్రబాబు నిర్వాకం కారణంగా  బ్యాంకుల నుంచి రుణం పుట్టే అవకాశమే లేకుండా పోయింది. అంతేకాదు బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు బలవన్మరాలకు పాల్పడుతున్నారు. 

ఆ ఒక్క జిల్లాల్లోనే 150 మందికి పైగా ఆత్మహత్యలు
అనంతపురం జిల్లాలో నిత్యం కరువు తాండవిస్తుంటుంది. అలాంటి జిల్లాలను చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు. వేసిన పంటలు చేతిక రాక.. కనీసం పెట్టుబడికి సరిపడ దిగుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. అనంతపురం ఒక్క జిల్లాలలోనే రైతు, చేనేత కుటుంబాలకు చెందిన వారు అప్పుల పాలై 150 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. 

వైయస్‌ పాలనలో రైతే రాజు..
దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో  రైతే రాజుగా వెలిగాడు. కాలరెగరేసుకుని తిరిగాడు. ఉచిత విద్యుత్‌ ద్వారా పంటలు బాగా పండడంతో పాటు గిట్టుబాటు ధర ఉండడంతో  రైతు సుఖ సంతోషాలతో గడిపాడు. అందుకే ఆ మహానేత వైయస్‌ నేటికీ  రైతు బాంధవుడిగా మిగిలిపోయాడు. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుల బాధలు వేధించాయి. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడంతో  ఇక చావే దిక్కు  అనుకుంటున్న రైతులు వారి పొలాలకు కొట్టాల్సిన పురుగు మందులను వారే తాగుతూ ప్రాణాలు తీసుకుంటుండడం కలవరపరుస్తోంది.

నేనున్నానంటూ...
రాష్ట్రవ్యాప్తంగా అప్పుల బాధతలతో ఆత్మహత్యలు  చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యుల్లో  ధైర్యం నింపేందుకు నేనున్నానంటూ కదులుతున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ‘రైతు భరోసా యాత్ర’ పేరుతో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇటీవల అనంతపురంజిల్లాలో రైతు భరోసా యాత్రను ముగించుకున్న వైయస్‌ జగన్, ఈ నెల 28వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రను  చేపట్టనున్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top