గుంటూరు గుండెగోస

గుంటూరు జిల్లాలో సాగుతోంది యువనేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర. బాపట్ల, పొన్నూరు ప్రజలు ఆ మహానేత తనయుడిని తమ గుండెల్లో నింపుకున్నారు. యువకులు, విద్యార్థులు, మహిళలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో వెన్నంటి నడిచారు. హోదా ఉద్యమంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేసారు. వ్యవస్థను బాగు చేయడానికి, రాజకీయాల్లో కొత్త విలువలు తేవడానికి వైఎస్ జగన్ చేస్తున్నకృషిని అడుగడుగునా అభినందించారు గుంటూరు ప్రజలు.  

యువతలో జగన్ పట్ల పెరుగుతున్న నమ్మకం

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లడం చూస్తున్న యువతరానికి వైఎస్ జగన్ పై గురి పెరుగుతోంది. హోదాను తేగలిగే ఒకే ఒక్కడు వైఎస్ అనే విశ్వాసం మాకు కలుగుతోందన్నారు గుంటూరు విద్యార్థులు. ఈ ఉద్యమానికి ఆయనతో కలిసి అడుగేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని వారు ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.   హోదా పోరాటాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడం, ప్రజా మద్దతు కూడగట్టి వైఎస్ జగన్ వెంట నడిచేలా చూసే బాధ్యత నిర్వహిస్తున్నామని పొన్నూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సగర్వంగా చెప్పారు విద్యార్థినీ విద్యార్థులు.

ఆమరణ నిరాహారదీక్షతో రాజకీయ ప్రకంపనలు

ప్రజా సంకల్పయాత్ర నుంచే వైఎస్ జగన్ తన ఎమ్.పిలకు ఆమరణనిరాహారదీక్ష కు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న ఎమ్.పిలు  పదవులకు రాజీనామాలు ఇచ్చి, ఢిల్లీలోని ఎపి భవన్ ముంగిట ఆమరణ నిరాహారదీక్షకు ఉపక్రమించారు. మాటతప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం వైఎఎస్ జగన్ సొంతం. అది ఆ మహానేత వారసత్వం. అందుకే పార్లమెంట్ లో హోదా పై చర్చ జరగనందుకు నిరసనగా, కేంద్రంపై వత్తిడి తెచ్చే దిశగా, దేశవ్యాప్తంగా ఎపి విభజన హామీలు, హోదా గురించి చర్చ జరిగేలా వైఎస్ జగన్ తన సైన్యాన్ని నడిపిస్తున్నారు. విచారణ భయంతో టిడిపి ఎమ్.పిలు రాజీనామాలకు వెనుకంజ వేసారు. పంచపాండవుల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపిలు  దీక్షకు కూర్చున్నారు. యువనేత ప్రజా సంకల్ప పాదయాత్ర తెనాలి చేరేసరికి రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు పణంగాపెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు మనఃస్ఫూర్తిగా మద్దతు పలికింది. 

పేరుంది కానీ, రాజధాని ఏదీ...?

యువనేత పాదయాత్రలో వెంట వెల్లువలా ప్రజలు నడుస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రభంజనమై తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రతి బహిరంగ సభా జనసందోహామే. ప్రతీ సభా టిడిపి గొంతుకలో గుంటూరు మిర్చి అంత ఘాటుగా అదిరింది. ప్రపంచ నగరాల్లో ఒకటిగా అమరావతి అంటూ చంద్రబాబు చెప్పిన మాటలను రాష్ట్రంలో అందరూ నమ్మి మోసపోయారు. అందరికంటే చాలా ఎక్కువగా మధనపడుతున్నది గుంటూరు, కృష్ణాజిల్లా వాసులే. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో ఏర్పాటైన అమరావతి నేటికీ ఓ శాశ్వత కట్టడానికి కూడా నోచుకోలేకపోయింది. పచ్చని పంట పొలాలకు, అన్నపూర్ణ వంటి నేలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు బీడై, మోడై పోవడం చూసి ఆ ప్రాంత వాసులు కుంగిపోతున్నారు. మా జిల్లాలో రాజధాని పేరు మాత్రమే ఉంది...రాజధాని లేదన్నా అంటూ ఎంతోమంది యువత ప్రతిపక్షనేత వద్ద కన్నీరు పెట్టుకున్నారు. 

బహిరంగ సభల్లో హోదా గర్జన

తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలకు చంద్రబాబు మోసపూరిత విధానాల గురించి మరోసారి వివరించారు. అన్యాయం మోసం చేయడమే బాబు 40ఏళ్ల అనుభవం అని మండిపడ్డారు. హోదా ఉద్యమానికి టిడిపి అధినేత చేసిన ద్రోహం తన ఎమ్.పిలతో రాజీనామా చేయించకపోవడం అని వైఎస్ జగన్ అనగానే బహిరంగసభలోని అశేష జనం అవును నిజమే అంటూ ప్రతిస్పందించారు. 

చేనేతలకు భరోసా

పొందూరు, మంగళగిరి, వెంటగిరి, ధర్మవరం, ఎమ్మిగనూరు..ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా చేనేతల బతుకులు దీనంగా ఉన్నాయి. వాళ్ల సమస్యల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడినప్పుడల్లా చంద్రబాబు హేళన చేయడం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. చేనేతలకు ఇచ్చే సబ్బిడీని పెంచామని చెప్పి, తర్వాత పాత సబ్సిడీని కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న దగా కోరు చంద్రబాబు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ మంగళగిరిలో చేనేతలతో జరిపిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. చేనేతల ఆత్మహత్యలే లేవని బహిరంగంగా అబద్ధం ఆడే చంద్రబాబు, నేతన్నల దుర్భరజీవితాలను బాగు చేసేందుకు ఏమీ చేయలేదన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతినెలా 2000 సబ్సిడీతోపాటు, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

అవినీతి రాజధాని

గుంటూరు జిల్లా ప్రాంతంలో రాజధాని ఉందని గర్వపడాలో అవినీతికి అది కేంద్రం గా మారిందని బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నామంటున్నారు గుంటూరు ప్రజలు. ఇసుక దందాల విషయంలో కృష్ణా గుంటూరు జిల్లాలు రౌడీల రాజ్యాలైపోయాయని, ఎదురు తిరిగిన వారి ప్రాణాలకు గ్యారెంటీ లేదని ప్రతిపక్షనేతకు తమ దారుణమైన పరిస్థితులను వివరించారు ఆప్రాంత వాసులు. విజయవాడ, మంగళగిరి స్మార్ట్ సిటీ అని చెప్పే చంద్రబాబు మంగళగిరికి సరైన తాగునీరు కూడా అందించలేకపోతున్నారని మండిపడ్డారు. కృష్ణాతీరాన ఉంటూ నీటికి కరువు, ఇసుకకు కరువు, పంటభూములకు కరువైన జిల్లాగా మారిపోయిందని రైతులు వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేసారు. 
Back to Top