ఫాక్షన్ ను ప్రోత్సహస్తున్న ప్రభుత్వం

ఫాక్షన్ రాజకీయాలను
పెంచి పోషిస్తున్నారు టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆయన కుటుంబం అంతా ఇందులో
ఇన్వాల్ అయి ఉన్నారన్న విషయం ఇటీవల జరిగిన సంఘటనలతో గట్టిగా రుజువైంది. మూడు రోజుల క్రితం జమ్మల
మడుగు నియోజక వర్గం పెద్దదండ్లూరులో జరిగిన గొడవలో మంత్రి ఆదినారాయణ రెడ్డి భార్య అరుణ, కొడుకు సుధీర్ రెడ్డిలపై
పోలీసులు కేసు నమోదు చేసారు.

ఆ గ్రామంలోని సంపత్
అనే యువకుడి వివాహ రిసెప్షన్ కు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అవినాష్
రెడ్డి, ఆయన అనుచరులపై మంత్రి వర్గీయులు దాడులు చేసారు. అదృష్టవసాత్తూ దాడిలో
ఎం.పి అవినాష్ కు ఏమీ కాలేదు. కానీ ఆయన మద్దతుదారులు
కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోకి ఎవ్వరు రావాలన్నా ముందు మంత్రి అనుమతి తీసుకోవాలనే
నిబంధన పెట్టడం చూస్తే, నియోజవక వర్గంలో నియంతల పాలన సాగుతున్నట్టు అర్థం అవుతుంది.

సొంత పార్టీలోనే రెండు
వర్గాలు

టిడిపిలో మంత్రిగా ఉన్నా
ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ తరఫున గెలిచి, టిడిపిలోకి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి పదవికి రాజీనామా
ఇచ్చి, ఎన్నికల్లో నిరూపించుకోకుండానే టిడిపిలో మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అప్పటికే టిడిపిలో ఉన్న
రామ సుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డి రాక కంట్లో నలుసైంది. వీరిద్దరి విబేధాలు
తారాస్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం
చేసినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి ఫాక్షన్ గొడవల్లో అమాయకులు ఎందరో బలౌతున్నారంటున్నారు
ఆ ప్రాంత ప్రజలు. పెద్దదండ్లూరులో జరిగిన దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులనే కాదు, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి
మద్దతుదారులపై కూడా మంత్రి అనుచరులు దాడులు చేసారు. వారిని తీవ్రంగా గాయపరిచారు.

మంత్రి భార్యదే ప్రత్యక్ష
పాత్ర

ఈ దాడికి సంబంధించి 136 మందిపై కేసులు పెట్టారు
పోలీసులు. ఇందులో మంత్రి ఆదినారాయణ రెడ్డి భార్య అరుణ, మంత్రి కొడుకు సుధీర్
ప్రధాన నిందితులు అని తెలుస్తోంది. వారే దగ్గరుండి ప్రత్యర్థి వర్గాలపై దాడులు చేస్తున్న
తమ అనుచరులను ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో పోలీసులు
తప్పనిసరై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. లేదంటే చాలా సంఘటనల్లో లాగే ఇదీ మరుగున పడిపోయి ఉండేది.

పోలీసుల పక్షపాతం

అధికారంలో ఉన్న పార్టీకి
అనుగుణంగా పనిచేస్తున్నాయి పోలీసు వర్గాలు. మంత్రి కొడుకు, ఆయన భార్య సోదరుల మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని
బాధితులు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. కులం పేరుతో బహిరంగంగా దూషించారని ఎంతగా చెప్పినా పోలీసులు
పట్టించుకోనైనాలేదు. కానీ మంత్రి అనుచరుల్లో కొందరిపై మాత్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
నమోదు చేసారు. అంటే దాడులకు మూల కారణమైన పెద్దలను కాపాడుకునేందుకు జరుగుతున్న కుట్ర ఇది
అని తేలిగ్గానే అర్థం అవుతుంది.

ఆదినారాయణ రెడ్డి హఠం

గతంలో మంత్రి ఆదినారాయాణ
రెడ్డి గిరిజనుల శుభ్రంగా ఉండరు, చదువుకోరంటూ కించపరిచేలా మాట్లాడాడు. ఇక రాబోయే అసెంబ్లీ
ఎన్నికల్లో సీటు నాదే అంటూ ప్రచారం చేసాడు. దాంతో రామసుబ్బారెడ్డి మంత్రులకు కేండేట్లను నిర్ణయించే
అధికారం లేదంటూ మండిపడ్డారు. నంద్యాల ఎన్నికల తర్వాత చంద్రబాబును ఒత్తిడి చేసి మరీ
కొడుకు సుధీర్ రెడ్డికి జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి ఛైర్మన్ పోస్టు ఇప్పించుకున్నాడు. కాంట్రాక్టుల వాటాలు
చెరిసగం అని కూడా పబ్లిక్ గా తన అవినీతిని బైట పెట్టాడు. ఇది ముఖ్యమంత్రిగారు
చేసిన పంచాయితీయేనంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపించే ఆదినారాయణ రెడ్డి
ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తూ కడప, జమ్మల మడుగు ప్రాంతాల్లో రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నాడు. 

Back to Top