అదనపు బాదుడే లక్ష్యంగా..!

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోకులకు ఉన్నతాధికారులు
హడలిపోతున్నారు. ఈ దర్జాల కోసం ప్రజల్ని పన్నులు, ఛార్జీల తో పీడించాలని ప్రభుత్వం
భావిస్తుంటే, అది తగని పని అని ఉన్నతాధికారులు చెప్పాల్సి వస్తోంది. దీన్ని బట్టి
చంద్రబాబు సర్కారు తీరు అందరికీ అర్థం అవుతోంది.

        చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
రెండేళ్లుగా సాగిస్తున్న పనుల్లో ప్రజలకు పనికి వచ్చే పనులు తక్కువగా ఉంటున్నాయి.
క్రమం తప్పకుండా చంద్రబాబు చేసే విదేశీ పర్యటనలకు ఖజానా కరిగిపోతోంది. వందల మందిని
తీసుకొని పోతుండటంతో డబ్బులు కరిగిపోతున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో ఎక్కడకు
వెళ్లినా ప్రత్యేక విమానాల మీద తప్ప నేల మీద కాలు పెట్టడం లేదు. దీంతో ఖర్చు
మోతెక్కుతోంది.

        చంద్రబాబు ఖర్చుల కోసం ఖజానా
రాబడి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది 4వేల కోట్ల రూపాయిలు మేర అదనంగా
వసూళ్లు చేయాలని నిర్దేశించుకొని ఆ దారిలో జనాల్ని బాదేశారు. దీంతో రెట్టించిన
ఉత్సాహంతో ఈ ఏడాది 11వేల కోట్ల రూపాయిల మేర అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం
నిర్దేశించింది. ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్నుడు ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలకు
వర్తమానం పంపారు.

        ప్రభుత్వం పడుతున్న ఆరాటం
ఆఖరికి ఉన్నతాధికారులకు కూడా చిరాకు తెప్పించింది. చంద్రబాబు వ్యక్తిగత సోకుల కోసం
ప్రజల్ని బాదటం సరి కాదని హితవు పలికారు. ఇప్పటికిప్పుడు తమ తమ ప్రభుత్వ శాఖ ల
నుంచి ప్రజలకు వాతలు పెట్టలేమని రిజిస్టేషన్, వాణిజ్య పన్నుల  తదితర శాఖల కార్యదర్శులు స్పష్టం చేశారు. దీంతో
ఎప్పటిలాగే మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేసి డబ్బు ఆర్జించుకోవాలని ప్రభుత్వం
భావిస్తోంది. ఈ పోకడల్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 

Back to Top