నిరుపేదలకు నిలువునా మోసం

హైదరాబాద్: నిరుపేదల్ని నిలువునా మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ద పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వ చ్చిన ఒక సూచనను ఆధారం చేసుకొని, పేదల్ని ముంచే  కార్యక్రమానికి నిశ్శబ్దంగా శ్రీకారం చుట్టింది. తె ల్ల రేషన్ కార్డుల్ని దశల వారీగా తొలగించేందుకు పథకం పన్నుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకొని ఏరివేతను పూర్తి చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి.
 
అసలు పథకం లక్ష్యం..!
ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ గులాబీ మరియు తెలుపు రంగు కార్డుల్ని జారీ చేస్తుంది. దారిద్య్ర రేఖ కు దిగువున జీవిస్తున్న నిరుపేదలకు కనీస అవసరాలైన బియ్యం, గోధుమలు, వంటనూనె, పంచదార వంటివి సబ్సిడీ ధరకు అందించటం ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో  లక్షల మందికి ఈ నిత్యావసర వస్తువుల్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. దీంట్లో భాగంగా లబ్ది దారుల వేలి ముద్రలు సేకరించి, వారికి ఈ నిత్యావసర వస్తువుల్ని అందించాలని నిర్దేశించారు. ఇక్కడ నిరక్షరాస్యుల్ని పిలిపించి వాళ్ల వేలిముద్రలతో పచ్చ చొక్కాలు అనేక చోట్ల నిత్యావసర వస్తువుల్ని తీసేసుకొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
జన్మభూమి కమిటీలకు ఊతం
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ చోట జన్మభూమి కమిటీల పేరుతో కొన్ని కమిటీలను వేశారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలను పూర్తిగా తెలుగుదేశం సభ్యులతో నింపేశారు. ప్రతీ పనికి పచ్చ చొక్కాలు హంగామా ఎక్కువైంది. రేషన్ డిపో ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీలో కూడా ఈ హంగామా చోటు చేసుకొంది. ఈ కమిటీల ద్వారా ప్రతీ చోట తె ల్ల కార్డుదారులు, గులాబీ కార్డు దారులు వాళ్ల పూర్వాపరాల్ని సేకరించి పెట్టుకొన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కి సానుభూతి దారులుగా ఉన్నవారిలో తెల్లకార్డులు ఎంతమందికి ఉన్నాయి అనే దానిపై ఆరా తీశారు. దీని ఆధారంగా కొత్త కుట్రకు తెర దీశారు.
 
కేంద్ర నిబంధనల సాకుగా..!
జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఇటీవల కొన్ని సవరణలు చేశారు. ఎంత శాతం మందికి ఆహార భద్రతను అమలు పరచాలి అనే దానిపై మార్గ దర్శకాలు విడుదల చేశారు. తెలుగుదేశం పెద్దలకు ఈ సూచనలు బాగా కలిసి వచ్చాయి. వెంటనే ఆయా జన్మభూమి కమిటీలకు వర్తమానం అందించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఉండే తెలుపురంగు రేషన్ కార్డుల వివరాల్ని తెప్పించుకొంటున్నారు. వాటిని దశల వారీగా తొలగించేందుకు కుట్రను అమలు చేస్తున్నారు. ఒకేసారి గంపగుత్తగా కార్డుల్ని తీసేస్తే విమర్శలు ఎదురవుతాయి కాబట్టి దశల వారీగా కార్డుల్ని ఏరివేత మొదలు పెడుతున్నారు. పనిలో పనిగా అనుకొన్న లక్ష్యం కన్నా ఎక్కువగా కార్డుల్ని తీసి వేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. వీటిని తొలగించినట్లయితే కొత్తగా తెలుగుదేశం శ్రేణులకు తెలుపు రంగు రేషన్ కార్డులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. మొత్తం మీద నిరుపేదల్ని ముంచేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మరో ఆయుధం దొరికినట్లయింది.
Back to Top