పట్టిసీమ తో ఘొల్లుమంటున్న గోదావరి

ఏలూరు: ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు కమీషన్ల పిచ్చి గోదావరి జిల్లా రైతాంగానికి శాపంగా మారింది. పంతం
పట్టి పట్టిసీమ పథకాన్ని తీసుకొచ్చి గోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టి కొట్టారు.
రబీ  (ధాళ్వా) సీజన్ లో దాదాపు 3 లక్షల
ఎకరాల్లో రెండో పంట వేసుకొనే పరిస్థితి లేకుండా పోయింది.

గోదావరి నుంచి
నీటిని తీసుకెళ్లి క్రిష్ణానదిలో కలుపుతామంటూ ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల
పథకం దాదాపు రూ. 5వందల కోట్ల రూపాయిల కమీషన్లను చంద్రబాబుకి మిగిల్చింది. దీంతో
పంతం పట్టి మరీ ఈ పనుల్ని పూర్తి చేయించారు. ఈ పట్టిసీమ ద్వారా నీళ్లు అందటం లేదని
చెప్పినందుకు పట్టిసం గ్రామం దగ్గర గోదావరి లోపల గొయ్యి తవ్వించి అక్కడ పంపులు
దింపి నీటిని తోడేశారు. ఆ పంతాన్ని చంద్రబాబు నెరవేర్చుకొన్నారు.

ఇప్పుడు అక్కడ
నుంచి దిగువ ప్రాంతాలకు నీటి రాక తగ్గిపోయింది. ప్రతీ ఏటా ఉభయ గోదావరి జిల్లాల్లో
సుమారు 10 లక్షల ఎకరాల్లో రబీ (ధాళ్వా) సీజన్ లో వరి పంటను పండించేవారు. ఇందుకు
అనుగుణంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సారి 4 లక్షల 80వేల ఎకరాల్లో పంట పండించాలని
సాక్షాత్తూ వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకొంది. కానీ ఈలోగా పట్టిసీమ పేరుతో
నీటిని ఎడా పెడా తోడేస్తుండటంతో దిగువకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం
4,600 క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు ప్రవహిస్తోంది.

ఇప్పుడు రెండో పంట
వేసుకోవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 80వేల ఎకరాల్లో
నాట్లు పూర్తికాగా ఈ నెలాఖరు నాటికి మరో లక్ష ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. జనవరి
ఒకటి తర్వాత నాట్లు వేసుకొనే పొలాలకు నీళ్లు ఇవ్వలేమని పశ్చిమగోదావరి జిల్లా
కలెక్టర్ ప్రకటించారు. అంటే దాదాపు 3 లక్షల ఎకరాల్లో రెండో పంట నిలిచిపోనుంది.
పట్టిసీమ పేరుతో నీళ్లను సింగపూర్ కంపెనీలకు చూపించుకొనేందుకు ప్రకాశం బ్యారేజ్ కు
తరలించేయటంతో ఈ దుస్థితి నెలకొందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. 

Back to Top