ఆత్మలు ఘోషిస్తున్నాయి


గోదావరి పుష్కారాల తొక్కిసలాటకు మూడేళ్లు

అక్కడ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వారి కుటుంబాలు కన్నీరు గోదావరిలా పొంగుతోంది. ఈవాల్టి రోజును తలుచుకుని కన్నీరు పెట్టని తెలుగువాడు లేడు. కానీ ఆ గోడు పట్టించుకునేదెవరు. పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో మరణించిన ఆ 25 మందికి న్యాయం జరిగేదెన్నడు. బాధ్యులకు శిక్షపడేదెప్పుడు. ఇది కలి కాలం కాదు బాబు కాలం అనాలి. ఈ కాలంలో అన్యాయానికి ఆయుష్షు, అమాయకులకు అన్యాయం దక్కుతున్నాయి. 
బాబు ప్రచారం తెచ్చిన ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద ఉదయం జరిగిన తొక్కిసలాటలో 29మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే. పుణ్యానికి పోతే ప్రాణాలే పోయాయి. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటమే ఆ  అమాయకుల ప్రాణాలను బలిగొంది. విఐపిలకోసం ఏర్పాటు చేసిన ఘాట్ ను వదిలి, సాధారణ ప్రజలు స్నానం చేసే ఘాట్ లో స్నానానికి వచ్చారు చంద్రబాబు, ఇంకా నాయకుల బృందం. అక్కడ పెద్ద ఎత్తున జన సందోహం ఉంది. పుష్కరాల ప్రచారచిత్రం కోసం దర్శకుడు బోయపాటి శ్రీను చేస్తున్నచిత్రీకరణ కోసం, ప్రజలు భారీ ఎత్తున కనిపించాలనే ఉద్దేశ్యంతో జనాలను గుంపుగా ఉంచి గేట్లు మూసేసారు. రెండున్నర గంటలపాటు సాగిన షూటింగ్ కోసం ప్రజలను బలవంతంగా ఆపి ఉంచారు. వృద్ధులు, అనారోగ్యం ఉన్నవారు, చిన్నారులు, మహిళలు అన్నిగంటలు నిలబడి నిరీక్షించారు. ఆ సమయంలో ఒక్కసారిగా గేట్లు తీయండంతో తోసుకు వచ్చిన జనంతో తొక్కిసలాట జరిగింది. ఆ తోపులాటలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.  ఊపిరాడక ప్రాణాలు వదిలారు. బాబుగారి ప్రచారార్భాటం వారందరి ప్రాణాలకు సంకటమైంది. 
విచారణ కమిటీ ఏం చేసింది?
విపరీతమైన వ్యతిరేకత రావడం, చంద్రబాబు తీరుపై ప్రజలు విరుచుకుపడటంతో ఈ తొక్కిసలాటపై  రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. 19 నెలల సుదీర్ఘ విచారణ జరిపి, పలువురి వాదనలు రికార్డు చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆధారాలు సేకరించారు. కానీ వీడియో పుటేజ్ లేదని ప్రభుత్వాధికారులు చెప్పారు. చంద్రబాబు సర్కార్ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, కేసులో సాక్ష్యాధారాలు మాయం చేసారని బాధితుల తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి విచారణను వాయిదా వేసారు. విచారణ తర్వాత రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి యనమల ప్రకటించి ఏడాది దాటింది. కానీ నేటికీ ఆ దర్యాప్తు నివేదిక రాలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. మృతుల కుటుంబాలకు పదిలక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం బాధ్యులను బయటపెట్టకుండా, బాధితులకు న్యాయం చేయకుండా రెండేళ్లు గడిపేసింది. 

బాబు పాలనలో ఎవ్వరికీ న్యాయం జరగదని ఈ సంఘటనే రుజువు చేస్తోంది. అవినీతి కేసుల్లోనే విచారణకు దొరక్కుండా స్టేలతో తప్పించుకుంటున్న చంద్రబాబు, గోదావరి ఘటనకు బాధ్యుడైనా ఇంత వరకూ విచారణ ఎదుర్కొనకుండా అధికారాన్ని వినియోగించుకుంటున్నాడు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరౌతున్నాయి. తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నాయి. 

 
Back to Top