గోదావరి జిల్లాల నాయకులు నిద్ర పోతున్నారా

గోదావరి జిల్లాల నాయకులు తమ ప్రాంత అవసరాలు మరిచిపోయి నిద్ర పోతున్నారా..లేక నిద్ర నటిస్తున్నారా..అన్న అనుమానాలు కలగక మానదు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసం తో గోదావరి డెల్టా త్వరలోనే ఎండిపోనుంది. అక్కడ పంట పొలాలకు నీరు దక్కని పరిస్థితి ఎదురు కానుంది.

గోదావరి కి ధవళేశ్వరం బ్యారేజీ దిగువున అంటే మొత్తం పదిన్నర లక్షల ఎకరాల దాకా సాగు అవుతుంది. ఇందులో తూర్పు గోదావరి కాల్వ భాగం 3 లక్షల ఎకరాలు, సెంట్రల్ భాగం అంటే కోనసీమ ప్రాంతం 2 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరి లంకల భాగం రెండున్నర లక్షల ఎకరాలు, ప.గో. జిల్లాలో కాల్వల భాగం 3 లక్షల ఎకరాలు ఉంటుంది. ఇందులో రెండు పంటల వరి, మూడో పంటగా అపరాలు సాగు అవుతాయి. ఇప్పుడు ఈ భూమికి నీరు ఇవ్వటం కష్టం కానుంది. ప్రతీ ఏటా పంట కు ముందే బ్యారేజ్ అధికారులు నీటి లభ్యతను అంచనా వేసి వ్యవసాయ శాఖ కు తెలియ చెప్పటం ఆనవాయితీ.

ఈ సారి సీజన్ లో 6 లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వటం సాధ్యం కాదని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. దీంతో రైతుల గుండెలు బద్దలవుతున్నాయి. అంటే దాదాపు సగం మేర పొలాల్లో రెండో పంట ఉండదన్న మాట. మిగిలిన సగంలో పంట వేసుకొన్నాక వచ్చే సమస్యలు దేవుడెరుగు. సగానికి సగం పంట పొలాల్లో పంటను నిలిపివేయటం అంటే ఎంతటి ఆత్మహత్యా సాద్రశ్యం గమనించాలి. దీనికి అధికారులు చెబుతున్న కుంటి సాకులు ఏమిటంటే.. పుష్కరాల సమయంలో అన్ని ఘాట్లకు నీరు వదిలాం..సీలేరు నుంచి రావాల్సిన నీరు రావటం లేదు అని.

వాస్తవానికి ఇక్కడే చంద్రబాబు చేయిస్తున్న కుట్ర దాగి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో రూ. 300 కోట్ల మేర కమీషన్లు కొట్టేసిన చంద్రబాబు..దాన్ని విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నారు. కానీ గోదావరిలో అక్టోబర్ దాటితే వరద నీరు ఉండదు. అంటే బొటాబొటీ నీళ్లే పారతాయి. ఈ నీళ్లు  కాస్తా గోదావరి  జిల్లాల్లో రబీ పంట సాగుకి సరిపోతాయి. అయితే వీటిని లాక్కెళ్లేందుకు కుట్ర చేస్తున్నారు. పట్టిసం గ్రామం నుంచి అంటే ఎక్కడ అయితే ఎత్తిపోతల పథకం మొదలు అవుతుందో అక్కడ మెయిన్ ఛానెల్ కు పెద్ద గొయ్యి ఏర్పరుస్తున్నారు. అంటే అక్కడ విశాల భాగం ఏర్పడి గోదావరి నుంచి దిగువకు రావాల్సిన నీళ్లు కాస్త పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పక్కకు మళ్లుతాయి.

గోదావరి జిల్లాల్లో సగానికి సగం పంట భూముల్ని ఎండబెట్టి పట్టిసీమ పథకాన్ని విజయవంతం చేసినట్లు రికార్డుల్లో రాసుకోబోతున్నారు. ఈ విషయాలు తెలిసినా గోదావరి జిల్లాల తెలుగుదేశం నాయకులు గాఢ నిద్రను నటిస్తున్నారు. 

Back to Top