చంద్ర‌బాబు భూదాహానికి ఉత్త‌ర్వులు సిద్ధం

రాష్ట్రంలోని భూముల‌న్నీ మింగేయ‌టానికి చంద్ర‌బాబు, ఆయ‌న అనుచ‌రులు ముందుకు అడుగులు వేస్తున్నారు. మొన్న రాజ‌ధాని ప్రాంతంలోని భూముల్నిమింగేసిన భూముల మాఫియా, ఇప్పుడు బంద‌రుపోర్టు దిశగా సాగుతోంది. 

పోర్టు, పారిశ్రామిక అభివృధ్ధి పేరుతో కృష్ణా జిల్లాలో మచిలీప‌ట్నంతో పాటు 28 గ్రామాల్లో భారీ భూ స‌మీక‌ర‌ణ(ల్యాండ్ పూలింగ్‌)కు ప్ర‌భుత్వం తెర‌లేపింది. రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌హాలో భూ స‌మీక‌ర‌ణకు మ‌చిలీప‌ట్నం ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌(మ‌డా)కు అనుమతిస్తూ పుర‌పాల‌క శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. భూ స‌మీక‌ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో మొత్తం 16 పేజీల జీవో జారీ చేసిన ప్ర‌భుత్వం ఎన్ని ఎక‌రాల‌ను స‌మీక‌రిస్తార‌నే అంశాన్ని స్ప‌ష్టంగా ప్రస్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏపీ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ అండ్ అర్భ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీల చ‌ట్టం - 2016 ప్ర‌కారం భూ స‌మీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. మ‌చిలీప‌ట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, ప్లాట్ల ఏర్పాటు ల‌క్ష్యంగా ఈ స‌మీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించాయి. బంద‌రు మున్సిపాలిటీతో పాటు మచిలీప‌ట్నం మండ‌ల ప‌రిధిలో 27 గ్రామాలు, పెడ‌న మండ‌ల ప‌రిధిలో ఒక గ్రామంలో భూమిని స‌మీక‌రించ‌నున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి  తెలిపారు. 

 మాఫియా దోపిడీ కి ఉత్త‌ర్వులు
భూ స‌మీక‌ర‌ణపై అభ్యంత‌రాలు, సూచ‌న‌లు కోరుతూ మొద‌ట మ‌డా నోటిఫికేష‌న్ (ఫారం-1) జారీ చేస్తుంది. 15 రోజుల్లోగా దీనిపై భూ యాజ‌మానులు సూచ‌న‌లు, అభ్యంత‌రాలు (ఫారం - 2) తెలియ‌చేయ‌వ‌చ్చు. య‌జ‌మానుల నుంచి భూ స‌మీక‌ర‌ణ అంగీకార‌ప‌త్రాలు కోరుతూ మ‌డా ఫారం - 3 జారీ చేస్తుంది. ఏ ప్రాంతంలో ఏమే స‌ర్వే నంబ‌ర్ల‌లో ఎవ‌రెవ‌రి భూముల‌ను స‌మీక‌రించనున్నారో నోటిఫై చేస్తుంది. య‌జ‌మానుల నుంచి వ‌చ్చే అభ్యంత‌రాలు, సూచ‌న‌ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత త‌గు మార్పుల‌తో 15 రోజుల్లో ఫారం - 4ను జారీ చేస్తుంది. త‌దుప‌రి 15 రోజుల్లో తుది నోటిఫికేష‌న్ (ఫారం - 5)ను ప్ర‌క‌టిస్తుంది. భూ స‌మీక‌ర‌ణ‌ణ ముసాయిదాను 180 రోజుల్లోగా రూపొందించి భూ యజ‌మానుల‌కు నోటీసులు జారీ చేస్తారు. తుది భూ స‌మీక‌ర‌ణ నోటిఫికేష‌న్ జారీ చేసిన త‌ర్వాత 30 రోజుల్లోగా భూముల‌ను య‌జ‌మానుల నుంచి స‌మీక‌రిస్తారు. భూములిచ్చిన వారికి మ‌డా నివాస‌, వాణిజ్య ప్రాంతాల్లో ఇచ్చే ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌కు ప్ర‌భుత్వం ఫీజును మిన‌హాయిస్తుంది. 
Back to Top