హైదరాబాద్: అలులేదు సూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది టీడీపీ సర్కార్ పనితీరు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నిధులకు తోడు ఇంకొన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులపై భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. సాధారణంగా బడ్జెట్‌కు - బడ్జెట్‌కు మధ్య పదిశాతం అదనంగా పెంచే అవకాశముంటుంది. అది కూడా కేంద్రం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి గతేడాది రూ. 17.722 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సర ఆర్థిక బడ్జెట్ రూ. 9వేల కోట్లు వస్తాయనుకోవడం అత్యాశే మరి. ఆ ఆశతోనే రాష్ట్రానికి రూ. 26.849 కోట్ల బడ్జెట్‌లో ప్రతిపాదించారు. గతేడాది సైతం కేంద్రం రూ. 28 కోట్లు వస్తాయని ఆశపడ్డ రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ నిధులు కేటాయించడంతో నిరాశకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే భారీ కోతలను విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇచ్చే అవకాశం కూడా తక్కువే అని చెప్పనక్కర్లేదు. <br/><strong>అసలు కేటాయించిన నిధుల లెక్కలు ఎక్కడా..?</strong>రాజధాని, పోలవరం కోసం తాము ఇవ్వాల్సిన నిధులు గురించి పక్కన పెట్టి ముందు గతేడాది రాజధాని కోసం కేటాయించిన నిధుల లెక్కలు ఎక్కడా..? అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాము కేటాయించిన నిధులను చంద్రబాబు సర్కార్ సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడుతుందని కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనికి తోడు ఈ మధ్య వెలుగు చూసిన అక్రమ భూదందా అగ్నికి మరింత అజ్యం పోసినట్లయింది. దీంతో ఈ సారి బడ్జెట్‌లో కేవలం వందకోట్లు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకొందనే చెప్పవచ్చు. <strong>కేంద్రం ఇచ్చిన నిధులు మాయం... </strong>రాజధాని కోసం రూ. 1500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 3600 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం కోసం ఖర్చు చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా లెక్కలు చూపిస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు ఇప్పటి వరకు ఖర్చు చేయలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం సడలిన కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఆర్థిక శాఖ అధికారుల వద్ద కేంద్రం పోలవరం, రాజధాని కోసం ఖర్చుపెట్టిన నిధుల వివరాలు ఇస్తేనే అదనపు నిధుల గురించి ఆలోచిస్తామని చెప్పడం గమనార్హం.ఈ పరిస్తితుల్లో బడాయిగా సమర్పించిన బడ్జెట్ ఎంత మేరకు వాస్తవ ప్రయోజనం కలిగిస్తుందన్న మాట వినిపిస్తోంది.