మ‌హానుభావుడి అడుగు జాడ‌లు

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలుగువారి గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయారు. మ‌హానేత జీవిత ప్ర‌స్థానాన్ని గ‌మ‌నిస్తే ఎన్నెన్నో ముఖ్య ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. 

పూర్తిపేరు:యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి
తల్లిదండ్రులు:రాజారెడ్డి, జయమ్మ
జన్మస్థలం:కడప జిల్లా సింహాద్రిపురం మండలం, బలపనూరు
పుట్టిన తేదీ:8 జూలై 1949
వివాహం:9 ఫిబ్రవరి 1972
సతీమణి:విజయలక్ష్మి
పిల్లలు:కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డి, కుమారై షర్మిల
విద్యాభ్యాసం:పులివెందులలో వెంకటప్ప ప్రాథమిక పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు. బళ్లారిలో మిషన్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం. విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ మెడిసిన్‌కు వయసు 
 చాలకపోవడంతో బళ్లారిలో ఏడాది బీఎస్సీ. గుల్బర్గా ఎమ్మార్‌ 
 మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌. ఎస్వీ మెడికల్‌ కాలేజీలో 
   హౌస్‌సర్జన్‌
రాజకీయాలు:గుల్బర్గా వైద్య కళాశాలలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు. 
   ఎస్వీ వైద్యకళాశాలలో హౌస్ స‌ర్జ‌న్ ల సంఘం  నాయకుడు.
1975లో యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా రాజకీయరంగ 
ప్రవేశం.
 1978లో తొలిసారిగా పులివెందుల నుంచి రెడ్డి 
   కాంగ్రెస్‌ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నిక. 
తర్వాత ఇందిరా 
 కాంగ్రెస్‌లో చేరిక. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు 
ఎంపీగా ఎన్నిక.
 1983–1985, 1998–2000ల మధ్య 
రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడు. 1999–2004 మధ్య 
 శాసనభలో ప్రతిపక్ష నేత
రాష్ట్రమంత్రిగా:మూడు సార్లు. 1980–82లో గ్రామీణాభివృద్ధి. 
  1982లో ఎక్సైజ్‌ మంత్రి. 1982–83 విద్యామంత్రి

ప్రత్యేకతలు: పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో గెలుపు, 33 ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడు
ముఖ్యమంత్రిగా:రెండుసార్లు 14.05.2004, 20.05.2009
కీలక ఘట్టాలు:పాదయాత్ర. 2003లో చేవెళ్ల– ఇచ్ఛాపురం. 1476 కిల్లోమీటర్లు.
జైత్రయాత్ర:2004 ఏప్రిల్‌ 5 నుంచి 25 వరకూ 5500 కిలోమీటర్లు.
Back to Top