హైదరాబాద్‌ టు అమరావతి...ఓ అవివేకి పయనం

  • బాబు హడావుడిగా అమరావతి ఎందుకు వెళ్లారు?
  • సౌకర్యాలు లేవని తెలిసి ఉద్యోగులను ఎందుకు రమన్నారు?
  • అవమానం జరిగింది ప్రజలకా? బాబుకా?
  • బాబు చెప్పే మాటల్లో నిజమెంత?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చెప్పిందే నిజమైందా?
తాను మేధావినని తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటాడు.  తనను మించిన మేధావి ఈ భూభాగంపై లేరనుకుంటాడు. ప్రపంచంలో ఎవరు ఏం సాధించినా అది తన ఘనతే అని డబ్బా కొట్టుకుంటాడు.  వాళ్లను అలా తయారు చేయింది కూడా తానేనని నిసిగ్గుగా చెప్పుకుంటాడు. అంతేకాదు తాను నిప్పునని, అవినీతి మరక అంటని స్వచ్ఛమైన చంద్రుడినని కితాబు ఇచ్చుకుంటుంటాడు. అంత గొప్ప వ్యక్తి ఎవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రపంచమే గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయాన్ని సరిగా కట్టలేక బొక్క బోర్లా పడ్డాడు. కట్టిన దాన్నే నాలుగైదు సార్లు కూల్చి మల్లీ కట్టాడు. పైగా  నిందలు మాత్రం ప్రజలపై నెడుడుతున్నాడు. తెలంగాణలో ఆంధ్రులకు అవమానం జరిగిందని, అందుకే హైదరాబాద్‌లో 10 ఏళ్లు ఉండే అవకాశం ఉన్నా వెంటనే అమరావతికి వచ్చేశామని చెబుతున్న బాబు మాటల్లో నిజమెంత? తాజాగా చంద్రబాబు తాత్కాలిక  సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రత్యేక కథనం. 

‘‘హైదరాబాద్‌ను వదిలేసి ఒక్క నిమిషం కూడా ముందు వెళ్లం. 10 ఏళ్లు ఇక్కడే ఉండి పాలిస్తాం’’ అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి హైదరాబాద్‌ నుంచి అమరావతికి షిప్ట్‌ అయ్యారు. ఆయనతో పాటు అధికారులను రావాలని హుకుం జారీ చేశాడు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని, తాము రాలేమని చెప్పినా బాబు వినలేదు. అయితే దీనికి బాబు చాలా కారణాలే చెబుతున్నారు. 

బాబు అమరావతి ఎందుకు వెళ్లారు?
చంద్రబాబు అమరావతి నుంచి పాలన అందించడం మంచిదే. దాన్ని ఎవరూ కాదనరు. కానీ బాబు ఏపీకి పాలన అందించడానికే వెళ్లారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని ఆలోచిస్తే చాలానే వెలుగులోకి వచ్చాయి. హైదరబాద్ నుంచే పదేళ్లు ఏపీని ఏలుతానని చెప్పిన ఈపెద్దమనిషి ఉన్నట్లుండి రాత్రికి రాత్రి మకాం మార్చాడు. అంత హడావుడిగా అమరావతికి  ఎందుకు వెళ్లారో జగమెరిగిన సత్యం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యేను రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు కొనబోతూ బాబు ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అంతే, ఇక్కడుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి వెంటనే హైదరాబాద్‌ నుంచి అమరావతికి మకాం మార్చారు. ఇది జగమెరిగిన సత్యం. బాబు వెళ్లిపోవడానికి  ప్రధాన కారణం కూడా ఇదే. 

అవమానం ఆంధ్రులకా..?
ఓటుకు కోట్లు కేసునుంచి బయటపడేందుకు హైదరాబాద్ నుంచి పారిపోయిన చంద్రబాబు....దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతికాడు.  హైదరాబాద్‌లో ఆంధ్రులకు అవమానం జరిగినందునే అమరావతికి వచ్చానంటూ చెప్పుకుంటూ తన దొంగపనులను ...అందరికీ చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే హక్కు ఉన్నప్పటికీ దాన్ని వదులకుని వెళ్లిపోవడం బాబుకు అవమానంగా అనిపించలేదా..? అని ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 

సీఎంకు ఆ మాత్రం తెలియదా?
ఏపీలో సచివాలయం ఏర్పాటు చేసుకుంటూనే హైదరాబాద్‌లో ఉంటూ పాలన  కొనసాగించి ఉండవచ్చు. అలా కాదని  హడావుడిగా బాబు వందల కోట్లు ప్రజాధనం వెచ్చించి తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అది కూడా తాత్కాలికమే అంటున్నారు. అంతేకాదు కోట్లాది రూపాయలు  అద్దెలకు ఖర్చు చేస్తూ శాఖల ఆఫీసులు తరలించారు. ఇదంతా వృథా ఖర్చు కాదా? ఈ మాత్రం చంద్రబాబుకు తెలియదా? పైగా మద్రాసు నుంచి కర్నూలు వచ్చినప్పుడు అప్పులు లేవని చంద్రబాబు కొత్త విషయం చెబుతున్నారు. ఇప్పుడు అప్పులు ఉన్నాయని అంటున్నారు. నిజంగానే సరైన వసతులు లేకపోయినా కష్టపడేందుకు సిద్ధమై ఆనాటి నేతలు త్యాగాలకు సిద్ధమై కర్నూలుకు తరలివచ్చారు. కానీ నేడు బాబు మాత్రం వేల కోట్లు వృథా ఖర్చు చేస్తున్నారు. భోగాలతో పాలన సాగిస్తున్నారు. అప్పటి పాలనను నేటి పాలనతో పోల్చుకోవడం ఎంతమాత్రం సరైంది కాదు. 

వరదలు వస్తాయని తెలిసి కూడా.. 
అమరావతి ప్రాంతాన్ని తన మూడ నమ్మకం కోసం ఎంపిక చేసుకుని అక్కడ వచ్చే వరదలను సైతం చంద్రబాబు సమర్థించుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అంతేకాదు  చెన్నైలో వరదలు రాలేదా? హైదరాబాద్‌లో వరదలు రాలేదా? అని బాబు ప్రశ్నిస్తున్నారు. బాబుకు తెలియని విషయమేమిటంటే హైదరాబాద్‌లోని కానీ.. చెన్నైలో కానీ సచివాలయ ప్రాంతాలు ఎప్పుడూ వరదలకు గురికాలేదు. అయినా తెలిసి తెలిసి బురదలో దిగాలని ఎవరైనా కోరుకుంటారా? వరద వచ్చే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారా?  పైగా ఆ ప్రాంతాల్లో వరదలు రాకుండా చేసేందుకు వందల కోట్లు ఖర్చు పెడతామని చెబుతుంటే బాబుకు మతిస్థిమితం సరిగా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గట్టి నేలలు.. పంటలు పెద్దగా పండని భూములు సమీపంలో అందుబాటులో ఉన్నా... వాటిని కాదని మూడు పంటలు పండే భూములను ఎన్నుకుని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ మాదిరి మార్చడాన్ని చంద్రబాబు సమర్థించుకుంటున్న తీరు విచిత్రంగానే ఉంది. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చెప్పిందే నిజమైంది..
చంద్రబాబు బాగోతాలను వైయస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది. ఓటుకు నోటు కేసులో దొరికి పోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారని చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి. ఆ కేసులో దొరకనంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడి పాలనను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయాక అసలు కేసీఆర్‌ను విమర్శించడమే లేదు. పైగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ సర్కార్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని, ఏపీ రాష్ట్రం ఎడారి అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును నిలదీసినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారు.  ఓటుకు నోటు కేసు అనంతరం జరిగిన పరిణామాలను చూస్తే మేధావి అని చెప్పుకునే చంద్రబాబు  ఒక అవివేకిగా హైదరాబాద్‌ నుంచి అమరావతి పారిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Back to Top