హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షలు

ఒకప్పుడు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు  పొట్టి శ్రీరాములు. నేడు దగాపడ్డ ఆంధ్రరాష్ట్రపు ఆత్మగౌరవ నినాదమై పోరాడుతున్నాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. హోదా కోసం నిరంతరం పోరాడుతున్న యోధుడు  జగన్. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేతిలో తోలుబొమ్మలా మారినప్పుడు, హోదా మా హక్కు అంటూ గర్జించి, ప్యాకేజీ రాజకీయాలకు చెక్ పెట్టిన ఒకే ఒక్కడు 

ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపిరిగా నిలిచి, రాష్ట్ర ప్రజలందరినీ హోదా కోసం ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు ప్రతిపక్ష నేత . హోదా కోసం జరిగే ఏ అంశాన్నైనా వితండవాదాలతో, వెక్కిరింపులతో నీరుగార్చే ప్రయత్నం చేసిన పసుపు ముఠా దొంగలు నేడు తమ రాజకీయ ఉనికి కోసం హోదా జపం చేస్తున్నారు. అఖిలపక్షం పేరుతో రాష్ట్రాన్ని హోదా ఉద్యమాన్ని నడిపేది మేమే అని భుజాలు చరుచుకుందామనుకుంటున్నారు. మొక్కుబడిగా చేసేవి ఉద్యమాలు కాదు. మనసా వాచా నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి, దాని కోసం ఎందాకైనా తెగించే బలం, మనో ధైర్యం ఉన్నవారికే చివరికి లక్ష్యం సిద్ధిస్తుంది. అందుకే  హోదా కోసం ఎందాకైనా అనే తన మాటకు కట్టుబడే ఉన్నారు  జగన్. ఎమ్.పి ల రాజీనామాలకు కేంద్రం దిగిరాకపోవచ్చు. కానీ అంతమాత్రాన హోదా కోసం జరిపే పోరు ఆగకూడదు. రాష్ట్రానికి హోదా రాదనే నిరాశ కారు మబ్బులా కమ్మ కూడదు. కనుకనే తన ఎమ్.పిలు ఐదుగురూ రాజీనామాలు ఇచ్చిన తక్షణమే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు జననేత. అది కూడా ఢిల్లీలో కేంద్రం కనుల ముందే ఆమరణ దీక్షతో తమ నిరసన వ్యక్తం చేయనున్నట్టు ప్రకటించారు. 

నవ్విన నోళ్లకు మూత

కేంద్రంలో అవిశ్వాసం పెట్టి, హోదా పై దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ హోదా కు అడ్డుపడే కొన్ని శక్తులు, నయవంచనతో మోసం చేసే కుయుక్తులకు లోటేం ఉంది. అవిశ్వాసం వల్ల ఒరిగేదేం ఉంది అంటూ స్వయంగా ముఖ్యమంత్రే ఎగతాళి చేసాడు. మళ్లీ అదే ముఖ్యమంత్రి అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తామన్నాడు. మర్నాటికే మాట మార్చి స్వంతంగా అవిశ్వాసం అని చెప్పాడు. పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎన్నో ఆటంకాలు ఎదురౌతున్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని వైయస్ఆర్  కాంగ్రెస్ చిత్త శుద్ధిని, హోదా పై  జగన్ దృక్పధాన్నీ తక్కువ చేసి మాట్లాడే కొందరు పచ్చకామెర్ల రోగులకు కనువిప్పు కలిగే రోజు వచ్చింది. అవిశ్వాసం వీగిపోతుందని, హోదా కోసం ప్రతిపక్ష నేత చేసే ఉద్యమంలో నిబద్ధత లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్.పిల రాజీనామాల విషయంలో నోరు మెదపలేకుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్.పిల తో పాటు అధికారపార్టీ ఎమ్.పిలను కూడా రాజీనామాలు చేయించమని కోరితే మన్ను తిన్న పాములా మిన్నకుండిపోయింది. దీనిబట్టే హోదాపై చిత్త శుద్ధి ఉన్నదెవరికో, లేనిదెవరికో తెలుగు ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. 

ఆమరణ దీక్షలకు  సిద్ధం

కార్యాచరణ విషయంలో జగన్ స్ట్రాటజీకి తిరుగు లేదు. హోదా మా హక్కంటూ ఢిల్లీలో పొలికేక పెట్టినా, పార్లమెంట్ లో మోదీని ఢీకొట్టినా, పంతం వీడక 10  సార్ల అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చినా, ఎమ్.పిలతో నిరసనలే కాదు, రాజీనామాలు, వెనువెంటనే ఆమరణ దీక్షలు అని ప్రకటించినా అది అతడికే చెల్లింది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉరకలు పెట్టించడం ఆయనకే చెల్లింది. గతంలోనూ ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు పూనుకున్నారు జగన్. ప్రభుత్వం నిరంకుశంగా ఆ దీక్షను భగ్నం చేసింది. కానీ ప్రజల గుండెల్లో ప్రతిపక్ష నేత రగిలించిన హోదా స్ఫూర్తిని మరుగు పర్చలేకపోయింది.  ఎమ్.పిలతో రాజీనామాలు, ఆమరణ దీక్ష ప్రకటన చేయగలిగారంటే మడమతిప్పని రాజకీయ వారసత్వం, ప్రజల కోసం ప్రాణత్యాగాలకు వెనుదీయని నాయకుడి వ్యక్తిత్వం అందుకు కారణం. 
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, పార్టీకి వెన్నుపోటు పొడిచే ఫిరాయింపు గుంటనక్కలున్నట్టే, ప్రజల కోసం పని చేస్తూ, నాయకుడి మాటను శిలాశాసనంగా భావించే నాయకులూ ఉంటారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు నేడు తమ అధినేత చూపిన బాటలో ముందుకు దూకేందుకు సయ్యంటున్నారు. ఆరోగ్యం, వయసు, రాజకీయ జీవితం ఇవేవీ రాష్ట్రం కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువ కాదని వారంటున్నారు. ఒక్క మాటతో యువ నాయకుడు నిర్దేశించిన దిశగా తమ పోరాటపుఅడుగులు కదుపుతున్నారు.


Back to Top