ఉరికొయ్యన అన్నదాత

-రైతన్న ఊపిరి తీస్తున్న బాబు రుణమోసం
-అన్నపూర్ణాంధ్రను ఆత్మహత్యాంధ్రగా మార్చిన బాబు
– రాష్ట్రంలో 516 మంది రైతుల ఆత్మహత్య
– 2014 నాటికి రైతుల ఆత్మహత్యల సంఖ్య 160
– 300 శాతం పెరిగిన మరణాలు.. దేశంలో ఆరో స్థానం
– ఎ¯ŒSసీఆర్‌బీ–2015 నివేదికలో వెలుగుచూసిన నిజాలు

అన్నదాత పాలిట శాపంగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. వ్యవసాయం అంటేనే అంటువ్యాధిలా భావించే చంద్రబాబుకు రైతులు కుష్టురోగుల్లా కనిపిస్తున్నారు. వారి ఆర్తనాదాలు, కష్టాలు ఆయనకు జోరీగల్లా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకేనేమో రోజుకొక శంకుస్థాపన పేరుతో పోలవరానికి సాంబ్రాణి పొగేస్తున్నాడు. కాలువల కోసం తీసిన బంక మట్టిని వారి నోళ్లలో కుక్కి సులువుగా జీవన తీరాలకు సాగనంపుతున్నాడు. కన్నీటి సేద్యం చేయలేక.. కరువుతో నెర్రెలు బారిన పొలాల్లో.. ఎండిన మోడులకు ఊపిరిని బలిస్తున్నారు.


                  రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళనకర స్థాయికి చేరాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎ¯ŒSసిఆర్‌బి) 2015 తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రానికి సంబంధించి ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి. రైతు రుణమాఫీ చేస్తానంటూ ఊరించి ఓట్లేయించుకున్న చంద్రబాబు గెలిచాక పట్టించుకోవడం మానేశారు. బాబు పాపాల పుట్టలా పేరుకుపోయిన అప్పులు చూసి రైతులకు ముద్ద దిగడం లేదు. రుణమాఫీ అయోమయంతో బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందకపోవడంతో పాటు పాత బాకీలు తీర్చాలన్న బ్యాంకర్ల ఒత్తిడి అన్నదాతల బలవన్మరణాలకు దారి తీసింది. బ్యాంకుల సహకారం లేకపోవడంతో వడ్డీ వ్యాపారుల వలలో చిక్కిన రైతులూ చావే శరణ్యమని భావించారు. 

300 శాతం పెరిగిన ఆత్మహత్యలు
పంట నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత రైతు పక్షపాతిగా ఉంటానంటూ చేసిన బాసలు అక్కరకు రాలేదు. 2014లో 160గా ఉన్న రైతు ఆత్మహత్యలు, సంవత్సరంలో సుమారు 300 శాతానికిపైగా పెరిగి 2015లో 516కు చేరాయి. వీరితో పాటు వ్యవసాయ కూలీలు మరో 400 మంది దిక్కుతోచని స్థితిలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరక్క రోజు గడవడమే కష్టంగా మారడం కూలీల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సగటు వర్షపాతం తక్కువగా ఉన్నా దండగ లేకుండా వ్యవసాయాన్ని పండగ చేస్తానంటూ చెప్పిన సీఎం చంద్రబాబు మాటలూ నెరవేరలేదు. పంట సంజీవని రైతన్నను కాపాడలేక పోయింది. రెయి¯ŒS గన్లూ ఆదుకోలేక పోయాయి. వ్యవసాయ అభివృద్ధి కోసమంటూ అట్టహాసంగా ప్రవేశపెట్టిన మిషన్లు, గ్రిడ్లూ అక్కరకు రాలేదు. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాంకేతిక మాయాజాలం కొరగాకుండా పోయింది. ఫలితంగా అన్నదాత ఆయువు అనంతవాయువుల్లో కలసిపోయింది.

ఆత్మహత్యల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానం
             రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 916 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎ¯ŒSసీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది. రైతు ఆత్మహత్యల్లో దేశవ్యాప్తంగా ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. అన్నపూర్ణాంధ్రప్రదేశ్ గా పేరొందిన ఏపీని చంద్రబాబు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు.  బీహార్, జార్ఘండ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బంగ, హిమాచల్‌ ప్రదేశ్, గోవా, జమ్ము అండ్‌ కశ్మీర్, నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ రైతు ఆత్మహత్యలు లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు బాగా వెనకబడిన రాష్ట్రంగా ఉన్న బీహార్‌ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం నేడు అన్నదాతల ఆత్మహత్యలతో కన్నీరు పెడుతోంది. దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్న డొక్క వెన్నుకంటుకుపోయి ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించిన పాపం మాత్రం ముమ్మాటికీ చంద్రబాబు నాయుడిదే. 

నకిలీ విత్తనాల కుంభకోణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు
మూడేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే రైతన్నకు ఈ దుస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేకపోయినా, ప్రభుత్వ సాయం అందకున్నా కష్ట నష్టాలకోర్చి వ్యవసాయం చేస్తున్న రైతన్నను నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు నిండా ముంచుతున్నాయి. సుమారు మూడు నెలల క్రితం రాజధాని ప్రాంతంలో వెలుగు చూసిన నకిలీ మిర్చి విత్తనాల కుంభకోణం సంచలనం సృష్టించింది. మిర్చి పంటకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలతో వందలాది మంది రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ కుంభకోణంలో సాక్షాత్తూ ఓ అమాత్యుని సతీమణితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు బాధిత రైతులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతోపాటు రైతు సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు కూడా పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఫలితంగా కష్టాల కడలిలో నిండా మునుగుతున్న అన్నదాతలు బయట పడే మార్గం కనిపించక ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను, కరువు మండలాలను గుర్తించి విదర్భ తరహా ప్యాకేజీ కల్పించి ఉంటే కొంత ఉపశమనం ఉండేది. కేంద్రాన్ని శాసిస్తానని చెప్పుకుంటున్న చంద్రబాబు కరవు మండలాలకు సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాయమని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నా ముఖ్యమంత్రి ఉలకడూ పలకని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే బాబుకు చల్లబడుతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్న ఊపిరి తీస్తున్న తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.  

Back to Top