పంట మొదలెట్టాలంటే రైతుల గుండెల్లో గుబులు


హైదరాబాద్) చంద్రబాబునాయుడు
పరిపాలనలో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ముఖ్యంగా రుణమాఫీ పేరుతో
చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ధాటికి అల్లాడిపోతున్నారు. తాజాగా ఖరీఫ్ సీజన్ పనులు
దగ్గర పడుతున్నప్పటికీ రైతులు చురుగ్గా ముందడుగు వేయలేకపోతున్నారు.

సాగు విధానం ఇదీ..

కొన్ని సంవత్సరాలుగా రైతాంగం
వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకింగ్ సేవల్ని బాగా వినియోగించుకొంటున్నారు.
ముఖ్యంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కాలంలో రైతుల్ని చైతన్య
పరిచేందుకు అనేక చర్యలు తీసుకొన్నారు. బ్యాంకర్లను గ్రామీణ శాఖలు ఎక్కువగా ఏర్పాటు
చేసేందుకు ప్రోత్సహించారు. ఫలితంగా ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని
వ్యవసాయం చేసుకొనేవారు. లక్ష దాకా వడ్డీ లేకుండా, లక్ష నుంచి మూడు లక్షల దాకా
పావలా వడ్డీకే రుణాలు లభించేవి. సీజన్ పూర్తయ్యాక ఏడాదిలోగా పంటను అమ్మేసి ఆ రుణం
తీర్చేసి తిరిగి అప్పులు తీసుకొనేవారు. ఏ ఏటికాయేడాది బ్యాంకుల నుంచి అప్పు
తీసుకొనే రైతుల సంఖ్య పెరిగేది. అంతేగాకుండా రుణపరపతి పెరిగేది. దీంతో ప్రతీ ఏడాది
రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల లక్ష్యం పెరుగుతూ వచ్చేది.

చంద్రబాబు వెన్నుపోటు ఫలితం

రుణమాఫీ చేస్తానని చెప్పటంతో
రైతులు అప్పులు కట్టడం మానేశారు. దీంతో రైతుల మీద అపరాధ రుసుములు, చక్రవడ్డీలు
పడిపోయాయి. 14 నుంచి 18శాతం వడ్డీ కట్టాల్సి రావటంతో రైతులు బ్యాంకుల దగ్గరకు
రావటం మానేశారు. గత ఏడాది 56వేల కోట్ల రూపాయిల మేర రైతులకు రుణాలు
ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొంటే నికరంగా రైతుల దరికి చేరినది కేవలం 7వేల కోట్లు
అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాత బకాయిలు కడితే తప్ప రైతులకు కొత్త అప్పులు
ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల్ని
ఆశ్రయిస్తున్నారు

సెక్సు రాకెట్ బాగోతంతో వడ్డీ
వ్యాపారులు కరవు

తెలుగుదేశం నాయకులు విజయవాడ
కేంద్రంగా సాగించిన కాల్ మనీ సెక్సు రాకెట్ బాగోతం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు
కొత్త డ్రామాకు తెరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు
చేయించారు. చిన్న చితక అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేసేవారి మీద పోలీసు కేసులు
బనాయించారు. దీంతో గత ఏడాది చివరి నుంచి వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలు బంద్
అయిపోయాయి. కేవలం తెలుగుదేశం నాయకులకు చెందిన పెద్ద పెద్ద వడ్డీ వ్యాపార సంస్థలు
మాత్రం మనుగడలో నిలిచాయి. అక్కడకు పోతే అధిక వడ్డీ విధిస్తున్నారు.

సాగుమీద అనాసక్తి

మొత్తం మీద రైతులకు పెట్టుబడులకు
డబ్బులు కరవు అవుతుండటంతో ఖరీఫ్ పనులు మొదలెట్టేందుకు రైతులు ఆసక్తి చూపించటం
లేదు. తర్వాత కాలంలో పెట్టుబడులకు తగినట్లుగా ఇన్ పుట్ సబ్సీడీ వంటి తోడ్పాటు
అంతకన్నా లేదు. దీంతో సేద్యం చేసేందుకు రైతులు వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.

 

Back to Top