సమన్యాయం కోసం యువనేత

సామాజిక న్యాయం గురించి ఎందరో మాట్లాడతారు. కానీ ఆచరణలో చేసి చూపించే వారు అరుదుగా ఉంటారు. అన్ని సామాజిక వర్గాలకూ ఆర్థిక ప్రగతి, రాజకీయ ప్రాతినిధ్యం దొరకడమే సామాజిక న్యాయం అని ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల మనోభావాలను గుర్తెరిగి, వారి ఆలోచనా స్రవంతికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులభమేం కాదు. కానీ ప్రజల మాటే మేనిఫెస్టో అని ప్రకటించిన నేతకు, ప్రజల మనసే ఓ నిర్ణయం కాకుండా ఉంటుందా? చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ పదవులిచ్చి న్యాయం చేస్తామని  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రకటించినప్పుడు నిజమైన సామాజిక న్యాయం ఈ రాష్ట్రానికి ఆ యువనేత రూపంలో దొరికిందనిపించింది. ఆయా వర్గాల ప్రతినిధులు చట్టసభల్లో ఉన్నప్పుడే వారి సమస్యలపై మాట్లాడే అవకాశం, వారి కష్టాలు తీరే అవకాశం ఉంటుందని ఆ యువ నాయకుడు భావించడం వల్లే అలాంటి మహత్తర నిర్ణయం వెలువడింది. అది ఆ ప్రజానేత దార్శనికత. 
అసెంబ్లీలో ఇతర చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాల వారు తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకే వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. చట్టసభల్లో ప్రతి కులానికీ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల తో పాటు,  దేవాలయ పాలకమండళ్లలో వారికి కూడా  పదువులను కట్టబెడతామని కూడా తెలియజెప్పారు. 

చంద్రబాబు కుల రాజకీయాలు

మ్యానిఫెస్టోలో కులానికో పేజీ పెట్టారు చంద్రబాబు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఆ పేజీలు నింపారు. తీరా ఎన్నికలయ్యాక, గెలిచి సిఎమ్ అయ్యాక ఆ హామీలు మరిచారు, ఆ మ్యానిఫెస్టోనే మాయం చేసారు. చివరకు కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తున్న బాబు పరిపాలనలో బిసి కులాలన్నీ వివక్షకు గురౌతున్నాయి. పాదయాత్ర ముగిసిన తర్వాత బిసి గర్జన నిర్వహించి, బిసిల డిక్లరేషన్ కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రతిపక్ష నేత ప్రస్తుత పాలకుల కుల విధానాలను ఎండగట్టారు. బోయిలను ఎస్టీల్లో చేర్చుతున్నామని అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపామన్నారు, ఇప్పటికి ఇది మూడు సార్లు జరిగింది. కాపులను బిసిల్లోకి చేర్చాలనే అంశంపై జస్టిస్ మంజునాథ కమీషన్ నివేదికపై స్పష్టత లేదు. రాష్ట్రంలో రిజవర్వేషన్ కోటా 50 శాతం మించిపోయింది అయినా సరే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలలకు బీసీ(ఎఫ్) కేటగిరీ కింద 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఎపి కేబినెట్ బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకుని, కేంద్రానికి పంపారు. 50శాతం మించిన రిజర్వేషన్లకు కేంద్రం అనుమతించదని తెలిసి కంటితుడుపుగా చేసిన ఈ రిజర్వేషన్ బిల్లును ఆ వర్గాలే వ్యతిరేకించాయి. 

బాబు సుద్దులకు లేవు బుద్ధులు

ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని వివక్షాపూరితంగా మాట్లాడే చంద్రబాబు, కులాల మధ్య కుంపట్లు పెట్టి తన రాజకీయ అవసరాలను నెరవేర్చుకుంటున్నాడు. అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారుంటారు, వారికీ చేయూత కావాలి, కనుక ప్రతి కులానికీ ఓ కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటాం అన్నారు విపక్షనేత వైఎస్ జగన్. కులవిధానం లో ఈ ఇద్దరికీ మధ్య ఎంత తేడా? కులాలను నిర్మూలించాలనే మాటలు కాదు, ఏ కులం వారైనా అభివృద్ధి చెందాలనే ధ్యేయం గొప్పది కదా...!!! ఆ దిశగా అడుగులు వేస్తున్న యువనేత వైఎస్ జగన్ ప్రజలకు ప్రియతమ నాయకుడు కాకుండా ఎలా ఉంటాడు..?? ప్రజాభిమానంలో ఎల్లలు తాకకుండా ఎలా ఉంటాడు? 

Back to Top