ప‌చ్చ మీడియా రాత‌ల మీద ఉద్యోగుల మండిపాటు


హైద‌రాబాద్‌) ఓటుకి కోట్లు కేసులో నేరస్తుడైన చంద్ర‌బాబు చేసుకొన్న చీక‌టి ఒప్పందానికి ప్ర‌భుత్వ ఉద్యోగులు బ‌లిప‌శువులు అవుతున్నారు. ఉన్న ప‌ళంగా అమ‌రావ‌తికి రావాలంటూ బాబు ఆదేశించ‌టంతో ఆందోళ‌న చెందుతున్నారు. దీని మీద ఆవేద‌న వ్య‌క్తం చేసిన పాపానికి ప‌చ్చ మీడియాలో ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయించ‌టం మీద మండిప‌డుతున్నారు. 
 సచివాలయంలోని హెచ్ బ్లాక్‌లో సచివాలయ ఉద్యోగ సంఘం వేశమైంది. సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, సంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, బాబూరావు సాహెబ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు మాట్లాడారు. ఏపీకి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని,  రోడ్ మ్యాప్ ఇవ్వకుండా ఈ నెల 27న అందరూ వెళ్లిపోవాలంటే ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నించా రు. ముందుగా రోడ్ మ్యాప్ ప్రకటించి ఉద్యోగులను విడతలుగా తరలించాలని డిమాండ్ చేశారు. తరలింపుపై సోమవారంలోగా స్పష్టత ఇవ్వని ప‌క్షంలో మంగళవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
ముఖ్యంగా చంద్ర‌బాబు చీక‌టి ఒప్పందం గురించి ఉద్యోగులు చ‌ర్చించుకొంటున్నారు. ఓటుకి కోట్లుకేసు  లో నేర‌స్తుడు కాబ‌ట్టి విజ‌య‌వాడ‌లో దాక్కొన్నాడ‌ని, అందుకోసం త‌మ‌ను వేధించ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆవేద‌న చెందుతున్నారు. 
Back to Top