ప్రజాస్వామ్యానికి పచ్చపార్టీ పాతర


() ప్రజాస్వామ్య విలువలు, నిబంధనలకు
గ్రహణం

() ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసం టీడీపీ
బరితెగింపు

() అడ్డ గోలుగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వం

హైదరాబాద్) శాసనసభ లో అరాచకం రాజ్యం
ఏలుతోంది. ప్రభుత్వం మంది బలంతో సంప్రదాయాలు, విలువలు, నిబంధనలకు పాతర వేస్తోంది.
నిన్నటి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో కానీ, నేడు స్పీకర్ పై అవిశ్వాస
తీర్మానం విషయంలో కానీ ఇదే రుజువు అయింది.

స్పీకర్ పై అవిశ్వాసం ఎలా అంటే..

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం గురించి శాసనసభ
నిబంధన 71 (2) సబ్ రూల్ (1) వివరిస్తుంది. దీని ప్రకారం నోటీసు ఇచ్చిన నుంచి 14 రోజుల తర్వాత ఏ రోజైనా దీన్ని చేపట్టాలి. 14 రోజుల తర్వాత ఆ నోటీసుపై సభలో 50 మంది
సభ్యుల మద్దతు ఉందా లేదా అన్నది పరిశీలించాలి. కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలితే... లీవ్ గ్రాంట్ అయినట్టు
ప్రకటిస్తారు. ఇకపోతే అసెంబ్లీ నిబంధన 72 (3) మేరకు లీవ్
గ్రాంట్ అయిన రోజు నుంచి 10 రోజుల్లోగా
అవిశ్వాస తీర్మానంపై చర్చకు చేపట్టాలి. నిబంధనల
ప్రకారం చూసుకొంటే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తమ సభ్యులందరినీ చర్చ రోజున విధిగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేస్తుంది. దాంతో
పాటే చర్చలో పాల్గొని ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కూడా
విప్ జారీ చేస్తుంది. ఈ విప్ ను ధిక్కరించిన సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. అంతే కాకుండడా71 (2) ప్రకారం 14 రోజుల తర్వాత, నిబంధన 72 (3) లీవ్ గ్రాంట్ అయిన 10 రోజుల్లోపు
చర్చ చేపట్టడానికి సమయం ఉంటుంది. కాబట్టి ఆయా పార్టీలు జారీ చేసిన విప్
సభ్యులందరికీ చేరడానికి వీలుంటుంది. విప్ అందిన తర్వాత ఇక సభ్యులు తప్పనిసరిగా
సభకు హాజరుకావలసి ఉంటుంది.

ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వ పక్షం

 ఇటీవలి
కాలంలో టీడీపీలోకి ఫిరాయించిన 8 మంది
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్ది
రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు స్పీకర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ వేదికగా కూడా వైఎస్సార్
కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ
ప్రతిపక్ష పార్టీ ఆయనపై మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.దీంతోఇక్కడే
టీడీపీ సర్కారు అడ్డదారులు వెతికింది. ఆ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే పార్టీ
ఫిరాయించి టీడీపీలో చేరిన 8 మంది
ఎమ్మెల్యేల పదవులకు గండి పడటం ఖాయం. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
నిర్వహించకతప్పదు. ఇటీవలి కాలంలో తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న
నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి భయపడిన టీడీపీ దీన్ని తప్పించుకోవడానికి గత
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఆ రూల్స్ నే తొలగించింది.అడ్డదారిలో అడ్డగోలు యత్నాలు

ఉపఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని
ఎదుర్కోవడం కష్టమని భావించిన టీడీపీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగానే
చకచకా పావులు కదిపింది.   నోటీసు ఇవ్వగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అసలు నిబంధనల్నే
మార్చేయాలని భావించారు. అనుకొన్నదే తడవుగా శాసనసభా
వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ నియమ నిబంధనల్లోని 71 (2), 72 (3), 73 లను తొలగిస్తూ ఒక తీర్మానం
ప్రతిపాదించారు. దానిపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం
చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలు ఉదాహరణలతో సహా వివరించారు. నియమ నిబంధనలు ఏం
చెబుతున్నారో వివరించారు.అయినప్పటికీ
సభలో సంఖ్యా బలం ఉందన్న ఉద్దేశంతో ఆ రూల్స్ ను తొలగిస్తున్నట్టుగా మంత్రి తీర్మానం
పెట్టడం, వాయిస్ ఓటుతో ఆ నిబంధనలు ఎత్తివేస్తున్నట్టు స్పీకర్
ప్రకటించడం క్షణాల్లో ముగించారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం
చేస్తున్నప్పటికీ మంత్రి లేచి మాట్లాడుతూ, ఆ నిబంధనలు
ఎత్తివేస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని కాబట్టి వెంటనే అవిశ్వాస తీర్మానం
చేపట్టాలని పట్టుబట్టారు. అంతే చర్చ మొదలైంది.

విలువలకు గ్రహణం

కేవలం ఫిరాయింపు దారుల్ని కాపాడాలన్న
ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఆడిన డ్రామా పండింది. స్పీకర్ మీద అప్పటికప్పుడు చర్చ
జరిపించి అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ 
జరిపించారు. విప్ కు విలువ లేని విధంగా ప్రవర్తించారు. దీంతో అవిశ్వాస
తీర్మానం తద్వారా ప్రజాస్వామ్య విలువలు ఓడిపోయాయి. 

Back to Top