కేఈ గ‌య్ గ‌య్

కారం తిన్న కాకిలా గ‌య్ గ‌య్ మంటున్నాడు డిప్యూటీ సిఎమ్ కృష్ణమూర్తి. కాంగ్రెస్ తో పొత్తు ప్ర‌సక్తే లేదు అని ఖండించేసాడు. ఓ ప‌క్క త‌మ పార్టీ అధినేత కాంగ్రెస్ తో చెట్టాప‌ట్టాల్..పెళ్లి తిరునాళ్ అని చెబుతుంటే...ఈయ‌న మాత్రం కాంగ్రెస్ ఓ ద‌రిద్రం అది మా కొద్దు అంటూ ఈస‌డించుకుంటున్నాడు. స్వ‌యంగా త‌మ నాయ‌కుడే చేతులూపుతూ హ‌స్త రేఖ‌లు మారుతున్నాయ‌ని చెబుతుంటే కాంగ్రెస్ మాకు బ‌ద్ధ శతృవు అంటున్నాడు. అయితే కె.ఈ ఓ విష‌యం పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్టున్నాడు. చంద్ర‌బాబు కూడా ఆ గూటి ప‌క్షే అని. ఒక‌ప్పుడు ఇదే బాబు అదే కాంగ్రెస్ లో మంత్రి అని. కాంగ్రెస్ కు బాబు పాత‌కాపే. అందుకే ఎన్నో సంద‌ర్భాల్లో ఒక‌రికొక‌రు సాయం చేసుకున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉంటూ కూడా కాంగ్రెస్ కు సాయం చేసిన చ‌రిత్ర బాబుదైతే, సొంత పార్టీ నాయ‌కుణ్ణి ఓడించ‌డానికి చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేసిన చ‌రిత్ర కాంగ్రెస్ ది. 
ఆ ఇద్ద‌రి బంధం అవ‌స‌రం-అవ‌కాశం లాంటి సంబంధం. ఒక‌ప్పుడు రాష్ట్ర విభ‌జ‌న కోసం చంద్ర‌బాబు లేఖ‌లు రాసింది కాంగ్రెస్ కే. బాబు లేఖ‌లు ప‌ట్టుకుని రాష్ట్రాన్ని ముక్క‌లు చేసింది కాంగ్రెస్సే. ఇది వారి ప‌ర‌స్ప‌ర మైత్రీ సంబంధం. 
ఇప్పుడు మ‌ళ్లీ అది కొన‌సాగుతోంది. ఈ సారి ఎపికి హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ చెబితే, బాబు క‌మ్మ‌గా ఆ మాట మ‌న చెవిన వేస్తున వేస్తున్నాడు. టిడిపి అధినేత చంద్ర‌బాబు, జాతీయ పార్టీల మైత్రీ బంధం ఇంత తీయ‌గా సాగుతుంటే మ‌ధ్య‌లో కె.ఈ కొచ్చిన బాధేమిటి అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.ఎవ‌రితో పొత్తైతే ఏంటి? ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ప్ర‌ధానం గానీ అని కోప‌గించుకుంటున్నారు. అయినా బాబు మాత్రం ఆ కాంగ్రెస్ *కొమ్మే* క‌దా...ఈ మాత్రం దానికి కెఈ ఇంత ఇదైపోవ‌డం దేనికి అని జాలిప‌డుతున్నారు.
బాబు కోసం కాంగ్రెస్ త్యాగం
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడూ చంద్ర‌బాబు కాంగ్రెస్ ల బంధం ధృఢంగానే ఉంది. అటు కాంగ్రెస్ ఇటు బాబు ఇద్ద‌రూ త‌మ ఉమ్మ‌డి శ‌తృవుగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయ‌డం కోసం ఇద్ద‌రూ క‌లిసే కుట్ర‌లు ప‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ పై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైలుకు పంప‌డంలో కాంగ్రెస్ టిడిపి క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసాయి. దానిత‌ర్వాత‌ 2014 ఎన్నిక‌ల్లో బాబు ప్ర‌చారం అంతా కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్యాయంగా విడ‌దీసింద‌నే. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను ఆధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని శాప‌నార్థాలు కూడా పెట్టాడు చంద్ర‌బాబు. ఇంత జ‌రుగుతున్నా కాంగ్రెస్ మాత్రం బాబు విభ‌జ‌న కోరుకున్నాడంటూ ఒక్క మాట కూడా అన‌లేదు. తెలంగాణాలో విభ‌జ‌న చారిత్ర‌క అవ‌స‌రం అన్న‌ప్పుడు, ఎపి లో విభ‌జ‌న ఆశాస్త్రీయం అన్న‌ప్పుడు కూడా కాంగ్రెస్ బాబు బండారాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని ప్ర‌జ‌ల‌ముందు ఉంచ‌లేదు. అందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మూల్యం చెల్లించుకున్నా బాబుపై ప్రేమ‌ను వ‌దులుకోలేదు కాంగ్రెస్. కాంగ్రెస్ ను తిడుతూ, బిజెపిని పొగుడుతూ బాబు అధికారాన్ని అందుకున్నాడు. 

కాంగ్రెస్ త్యాగానికి బాబు ఇచ్చిన ప్ర‌తిఫ‌లం
ఇన్నాళ్లుగా చంద్ర‌బాబు కూడా కాంగ్రెస్ రుణం తీర్చుకునే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం రావ‌డం, కాంగ్రెస్ తో క‌లిసి ఇచ్చి పుచ్చుకోవ‌డాల ద్వారా గ‌త ఎన్నిక‌ల్లోనూ, అంత‌కు ముందు కూడా కాంగ్రెస్ చేసిన సాయానికి రుణం తీర్చుకోనున్నాడు చంద్ర‌బాబు. అటు తెంలంగాణా, ఇటు ఎపిల్లో కాంగ్రెస్ తో క‌లిసే సీట్లు పంచుకోవాల‌నుకుంటున్నాడు. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కోసం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను అక్క‌డ‌కు పంపి మ‌రీ ప్ర‌చారం చేయించాడు బాబు. క‌ర్నాట‌క సిఎమ్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లి త‌న అభిమానాన్ని చెయ్యెత్తి మ‌రీ చాటుకున్నాడు. 

మ‌రి కాంగ్రెస్ బాబుల ప్రేమానుబంధ‌సంబంధం ఇంత ప‌టిష్టంగా, గివ్ అండ్ టేక్ పాల‌సీగా ఉన్న‌ప్పుడు కె.ఈ ఇలా గ‌య్ గ‌య్ మ‌న‌డంలో అర్థం ఉందంటారా???

తాజా వీడియోలు

Back to Top