భోగాపురం ఎయిర్ పోర్టు కి ఇన్నివేల ఎకరాలు ఎందుకు?

విజయనగరం: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కి దాదాపు 15 వేల ఎకరాల దాకా లాక్కోవాలని ప్రయత్నించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లోని విమానాశ్రయాలకు కూడా ఇంతటి స్థాయిలో భూములు లేకపోవటంతో దీనిపై వివాదం పెరుగుతోంది.

ప్రధాన నగరాల వివరాలు ఇవిగో..
అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలకు ఉన్న భూములు ఇలా ఉన్నాయి. సింగపూర్ .. 3,250 ఎకరాలు, మియామీ.. 3,350 ఎకరాలు,

చికాగో.. 6,525 ఎకరాలు,  లండన్.. 3,000 ఎకరాలు, న్యూయార్క్.. 3,812 ఎకరాలు ఉన్నాయి. కాగా మన దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాల్లో విమానాశ్రయాల భూములు ఇలా ఉన్నాయి. హైదరాబాద్.. 5,495 ఎకరాలు, ఢిల్లీ.. 5,220 ఎకరాలు, చెన్నై... 1,400 ఎకరాలు

గోవా... 1,424 ఎకరాలు, అహ్మదాబాద్... 929 ఎకరాలు ఉన్నాయి. ఇంతటి పెద్ద పెద్ద నగరాల్లో రోజూ వందలాది విమానాలు రాకపోకలు సాగించే చోట సరిపడా విస్తీర్ణంలో విమానాశ్రయాలు ఉన్నాయి. మరి భోగాపురం కు ఈ స్థాయిలో భూములు ఎందుకన్న మాట వినిపిస్తోంది.

భోగాపురం లో అన్ని వేల ఎకరాలు ఎందుకు
పెద్ద పెద్ద విమానాశ్రయాలతో పోలిస్తే విశాఖ కు వచ్చే విమానాల సంఖ్య తక్కువే అనుకోవాలి. ఉదయం, సాయంత్రం మాత్రమే కాస్తంత ట్రాఫిక్ కనిపిస్తుంది. అటువంటప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్న మాట వినిపిస్తోంది. విమానాశ్రయం పేరిట కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ భూముల దందా అని స్పష్టం అవుతోంది. రైతుల నోట్ల మట్టి కొట్టి ప్రైవేటు సంస్థలకు కట్టి పెడతారని అర్థం అవుతోంది. దీనికి తోడు ఈ చుట్టు పక్కల చంద్రబాబు, ఆయన బినామీలకు వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి అధిక ధరలు సమకూర్చేందుకే ఈ దందా సాగిస్తున్నారని అర్థం అవుతోంది. 

Back to Top