దారి మళ్లుతున్న ‘ఉపాధి’ నిధులు

– కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న టీడీపీ 
– సమయానికి కూలీలు అందక అలమటిస్తున్న కార్మికులు
– వైయస్‌ఆర్‌ హయాంలో వారం వారం చెల్లింపులు 
– పోస్టాఫీసుల ద్వారా జాబ్‌ కార్డులకు నగదు బదిలీ 

ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడోకానీ.. ఆరోజు నుంచే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలేమో. తాను ఎలాగూ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకపోగా.. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ లబ్ధిదారుల ఆశలకు గండికొడుతున్నారు. విదేశీ పర్యటనలతో నిధుల వరద పారుతోందని డబ్బా కొట్టుకోవడమే తప్ప పైసా తెచ్చిన పాపాన పోవడం లేదు. పైగా ఆయన విదేశీ పర్యటనలకు పెట్టిన ఖర్చు ప్రభుత్వ ఖజానాకు అదనపు భారంగా మారింది. దేశంలోనే తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా అనంతపురంలో ప్రారంభమైంది.  కూలీ కోసం వలస బాట పట్టిన ఎంతోమంది తిరిగి ఆంధ్రాకు తరలివచ్చేలా చేసిన పథకం. ఆయన హయాంలో ఆ పథకం అంత గొప్పగా పేరు తెచ్చుకుంది. వారం వారం ఠంచన్‌గా కూలీలు చెల్లిస్తూ దేశంలోనే అమలుతీరులో మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి మార్గం కోసం పక్క రాష్ట్రాల వైపు చూసే దుర్వ్యవస్థ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు వైయస్‌ఆర్‌. 

అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్‌ లో అపహాస్యం అవుతోంది.  గ్రామాలలో ప్రజలకు పని కల్పించి తద్వారా వాళ్లకు జీవన భతి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం లో గ్రామీణ ప్రజలకు 100రోజుల పని కచ్చితంగా కల్పించడం, దీనికి కూలి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయాలి. ఈ పథకం ద్వారా పనులకు యంత్రాలు వాడకూడదు, వర్క్‌ ఆర్డర్‌ వచ్చిన తర్వాత మస్టర్‌ బుక్‌ లలో పని వివరాలు రోజువారీ నమోదు చేసి ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు వారానికోసారి బిల్లులు చెల్లిస్తారు .టీడీపీ సర్కార్ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోంది. కేంద్రం నుండి వచ్చే నిధులను పక్కదారి పట్టించి వాటిని తమ బాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు.

ఈ నిధులను మన రాష్ట్రం సిమెంట్‌ రోడ్‌ లకు, రాష్ట్ర ప్రభుత్వ పథకం అయిన పంట సంజీవిని, స్వచ్ఛ భరత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి, అంగన్వాడీ భవనాలకు, చెక్‌ డ్యాంమ్‌లకు, పంచాయతీ ఆఫీస్‌ భవనాలు ఇంకా ఎన్నో నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇది పథక ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమాలకు విరుద్ధం. పైపెచ్చు కేంద్రం ఒక పథకం అమలు కోసం ఇచ్చిన నిధులు పక్కదోవ పట్టించి తెలుగుదేశం నాయకుల జేబులు నింపుతున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో కనీసం ఒక్క గ్రామం లో కూడా పని కల్పించడం లేదు అంటే ఆలోచించండి. ప్రతి పనికి యంత్రాలు వాడుతూ తెలుగుదేశం కాంట్రాక్టర్‌ లు జేబులు నింపుకుంటున్నారు. అయితే ప్రభుత్వ వెబ్సైటు లో మాత్రం ఒక్కో ఇంటికి 54రోజులు  పని కల్పించాం అని ప్రచారం చేసుకుంటున్నారు. గతం లో ఈ పనులకు సామజిక ఆడిట్‌ లు ఉండేవి ఎక్కడైనా అక్రమాలు జరిగితే వాటిని గుర్తించి రికవర్‌ చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం లో అటువంటి ఆడిట్‌ లు జరిగిన దాఖలాలు లేవు.  దీనిపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు కూడా చేశారు. పథకం అమలు తీరుపై పరిశీలన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిని టీడీపీ నాయ‌కులు వ‌క్రీక‌రించి చూపుతున్నారు. ఉపాధి ప‌నుల్లో చోటుచేసుకుంటున్న అక్ర‌మాల‌ను వెలికితీయ‌డంతో త‌ట్టుకోలేని టీడీపీ నాయకులు అనుకూల మీడియా ద్వారా వైయస్‌ ఆర్‌సీపీపై బుర‌ద జల్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైయ‌స్ార్‌సీపీ ఫిర్యాదుల కార‌ణంగానే నిధులు ఆగిపోయాయ‌ని విష ప్ర‌చారం ఊపందుకుంది. అయితే అక్ర‌మాలు జ‌రిగిన చోట మాత్ర‌మే నిధులు నిలిపివేసిన విష‌యాన్ని కేంద్రం కూడా ప్ర‌క‌టించింది.



Back to Top