దేవాలయాల పరిరక్షణలో ఎంత లో ఎంత తేడా

హైదరాబాద్) విజయవాడ
నడిబొడ్డున 30 కు పైగా దేవాలయాలు పగలగొట్టి చంద్రబాబు విదేశీ పాలకుల్ని
మించిపోయాడు. ఇటువంటి పోకడల్ని బట్టి చంద్రబాబు పూర్తిగా దేవాలయ వ్యవస్థలు,
అర్చకుల పాలిట వ్యతిరేకిగా అంతా అభివర్ణిస్తున్నారు. అలనాడు దివంగత మహానేత వైయస్
రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో దేవాలయ వ్యవస్థలు విరాజిల్లిన రోజుల్ని అంతా గుర్తు
చేసుకొంటున్నారు.

మహానేత పాలనలో

దేవాలయాల వ్యవస్థ ప్రగతికి
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వేచ్చ ఇచ్చారు. ఆలయాల్లో వ్యాపారీకరణ ను
తగ్గించి ఆధ్యాత్మిక విలువల్ని పెంచేందుకు పాటు పడ్డారు. ముఖ్యంగా ఆర్ జే సీ పాలిత
దేవాలయాల్లో భక్తులు తేలిగ్గా దర్శనాలు చేసుకోవటానికి పటిష్టమైన చర్యలు
తీసుకొన్నారు. దీంతో పాటు పాత కాలపు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం స్కీమ్ ప్రవేశ
పెట్టారు. దీని కింద మారు మూల గ్రామాల్లోని చిన్న దేవాలయాలకు ప్రతీ నెల పెద్ద
దేవాలయాల గుడ్ ఫండ్ నుంచి నిధులు అందించేట్లుగా చర్యలు చేపట్టారు. దీంతో రాష్ట్రం
నలుమూలలా వేల దేవాలయాల్లో పూజలు నిరాటంకంగా సాగేందుకు అవకాశం కలిగింది. పెద్ద
ఆలయాల్లో అర్చకులకు ఉద్యోగులతో సమానంగా స్కేళ్లు ఇవ్వటంతో పాటు, పింఛన్ వంటి సౌకర్యాలకు
చొరవ తీసుకొన్నారు. చిన్న ఆలయాల్లో అర్చకులకు గౌరవ వేతనం ప్రవేశ పెట్టడంతో పాటు
నేరుగా బ్యాంక్ అకౌంట్ కు జమ చేసే విధానాన్ని అమలు చేశారు. దీంతో దేవాలయ వ్యవస్థలో
అంతా వైయస్సార్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకొన్నారు.

చంద్రబాబు పాలనలో అంతా
నాశనం

అంతకు ముందు పరిపాలనలో
దేవాలయాల్ని నేరుగా కూల్చేవేసే విధంగా విధానాలు రూపొందించిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు
అధికారంలోకి వచ్చాక కూడా అదే విధానాల్ని కొనసాగిస్తున్నారు. అంతే కాదు, జీర్ణ
దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం స్కీమ్ ను తొక్కి పెట్టారు. దీంతో వేల కొద్దీ
ఆలయాలకు నిధులు ఇవ్వటం ఆగిపోయింది. ఇటు, అర్చకుల సంక్షేమ పథకాల్లో కోత పడింది.
ఇదంతా ఒక ఎత్తయితే విజయవాడ నడిబొడ్డున ఆలయాల కూల్చివేత మరింత దారుణం అయినది. ఒకటి
రెండు కాదు ఏకంగా 30 గుడులను కూల్చివేసి చంద్రబాబు తన పంతం నెరవేర్చుకొన్నారు. ప్రగతి
పేరుతో ఎడా పెడా ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకుల ఇళ్లను
కానీ, ఆస్తుల్ని కానీ అధికారులు పట్టించుకోవటం లేదు. ఆయా కమర్షియల్ వ్యాపార
కేంద్రాల విస్తరణకు వీలుగా దేవాలయాల్ని నాశనం చేస్తున్నారు. విగ్రహాల్ని గునపాలతో
పెకిలించి బయట పడవేస్తున్నారు. అంతిమంగా తనుఏమిటో చంద్రబాబు బయట పెట్టుకొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన

చంద్రబాబు వైఖరి మీద
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా
విదేశీ పాలన కోసం పరుగులు తీస్తున్న విధానాల్ని అంతా అసహ్యించుకొంటున్నారు.
ముఖ్యంగా క్రిష్ణా పుష్కరాల ముంగిట దేవాలయాల్ని నాశనం చేస్తున్న తీరు ప్రజల్లో
అసంత్రప్తి కలిగిస్తోంది.

 

Back to Top