బాబు రూటే స‌ప‌రేటు

ఇప్ప‌టిదాకా న‌డుస్తున్న‌ది ఒక‌తీరు. ఇక‌రేప‌టి నుంచి స‌రికొత్త తీరుకు బాబుగారు శ్రీ‌కారం చుట్టారు. సాక్షాత్తు రాష్ట్రా డీజీపీ నియామ‌కం ప‌ద్ధ‌తిని త‌న‌దైన తీరులోకి మార్చుకున్నారు. మామూలుగా యూపీపీఎస్సీ కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి స‌భ్యులుగా ఉండే క‌మిటీ ఏం చేసేదంటే సీనియారిటీ, ట్రాక్ రికార్డు, నిజాయితీ ఆధారంగా ముగ్గురు అధికారుల జాబితాను రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంపుతుంది. అందులో ఒక‌రిని మాత్ర‌మే నియ‌మించే అధికారం ముఖ్య‌మంత్రికి ఉంటుంది. గ‌తంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ డీజీపీ నియామ‌కం కేసులో సుప్రీం కోర్టు త‌న తీర్పులో ఇదే అంశాన్ని స్ప‌ష్టం చేసింది కూడా. అయితే ఏపీ ప్ర‌భుత్వం డీజీపీ ఎంపిక‌లో కేంద్రంతో సంబంధం లేకుండా తామే నియ‌మించుకునేలా చ‌ట్టాన్ని స‌వ‌రించామ‌ని ప్ర‌క‌టించింది. ఇది సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, న్యాయ‌నిపుణులు అంటున్నారు. 
Back to Top