రాజధాని ప్రాంతం చుట్టూ పోస్టింగ్ ల గోల

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎప్పుడైతే ప్రకటించారో
అప్పటినుంచి గుంటూరు జిల్లాకు ప్రాధాన్యం పెరిగిపోయింది.  దీంతో ఏ అధికారిని పూర్తిగా పనిచేయకుండా
తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు. పచ్చ చొక్కాల తాకిడి తట్టుకోలేక అధికారులు
చేతులెత్తేస్తున్నారు.

ఒక్క ఏడాది కాలంలో గుంటూరు నగరానికి ఐదుగురు కమిషనర్లు బదిలీ
కావడం పచ్చచొక్కాల పాలిటిక్స్ కు అద్దం పడుతోంది. గుంటూరు నగరంలో మొదట్నుంచీ
రాజకీయాలు ఎక్కువ. అందుకే నగరం ఆశించనివిధంగా అభివృద్ధి చెందలేదనే భావన
స్థానికుల్లో ఉంది. ఇటీవల వచ్చిన కన్నబాబు, అనూరాధ వంటి కమిషనర్లను తొమ్మిది నెలల వ్యవధిలో
బదిలీ చేయించారు.

తాజాగా జరిగిన
బదిలీ వెనుక టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొన్నటి దాకా
కమిషనర్
గా పనిచేసిన అనురాధ బదలీ వెనుక రియల్ ఎస్టే ట్ , పారిశ్రామిక నిర్ణయాల్లో
కీలకంగా
వ్యవహరించే తెలుగుదేశం నాయకుడి హస్తం ఉందని చెబుతున్నారు.   ఇక్కడి రియల్
ఎస్టే ట్ వ్యవహారాల్లో సదరు టీడీపీ నాయకుడి మాట వినకపోవటమే బదలీ కి కారణం
అని తెలుస్తోంది. మరో్ వైపు టీడీపీలో రెండు, మూడు గ్రూపులు ఉండటం ..  వాటి
మధ్య ఉండే గొడవల కొద్దీ అధికారుల మీద  ఒత్తిడి మరింత పెరుగుతోంది. 

ముఖ్యంగా ఇక్కడ
రియల్ఎస్టేట్ వ్యవహారాల మీద కన్ను వేసిన కొందరు పారిశ్రామిక వేత్తలు తమకు అనుకూలంగా
నిర్ణయాలు చేయాలని కమిషనర్లను బెదిరిస్తున్నారు. కాదంటే బదలీ చేయిస్తామని ఒత్తిడి
చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూపులను తట్టుకోలేక కమిషనర్లు పారిపోతున్నారంటే
అతిశయోక్తి కాదు. 

తాజా ఫోటోలు

Back to Top