దోచుకో తమ్ముడా..దాచుకో దండిగా

ఖరీదైన భూములు కారుచౌకగా ధారాదత్తం..!
గల్లా కుటుంబానికి చంద్రబాబు నజరానా..!

హైదరాబాద్:
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తోందంటే. దోచుకో
తమ్ముడా..దాచుకో దండిగా అన్నట్లు పాలన సాగిస్తోంది. తెలుగుతమ్ముళ్లు,
అనుచరులకు ఖరీదైన భూములను కారుచౌకగా కట్టబెడుతూ ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తనయుడు టీడీపీ ఎంపీ గల్లా
జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత
విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని చౌకగా ధారాదత్తం చేసింది.

అప్పనంగా కట్టబెట్టేశారు..!
కడప-తిరుపతి
రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని ...రూ.4.88
కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టింది. తిరుపపతి నగరంలో కలిసిపోయిన
కరకంబాడి బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కనిష్ఠంగానైనా ఇక్కడ బహిరంగ
మార్కెట్‌లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని
అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా
రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం.

ఇచ్చిపుచ్చుకున్నారు..!
మొన్నటి
 సార్వత్రిక ఎన్నికల్లో గల్లా కుటుంబానికి టికెట్ ఖరారు
చేసినందుకు.....‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు టీడీపీకి భారీగా సొమ్ము
ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇందులో భాగంగానే  మంగల్
ఇండస్ట్రీస్‌కు ఆగమేఘాలమీద చంద్రబాబు భూములు కట్టబెట్టారని టీడీపీ
నేతలంటున్నారు. భూకేటాయింపుల కోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో
ఉండిపోతుంటాయి. అలాంటిది 
కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల
ప్రక్రియ పూర్తిచేశారని రెవెన్యూ అధికారులు అంటున్నారంటే ఫైలు ఎంత శరవేగంగా
కదిలిందో అర్థమవుతోంది.
Back to Top