ప్రజాస్వామ్యంలో విలువలున్నాయి..!

() ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంలో కొత్త మార్గాలు

() నయానా భయానా లొంగదీసుకొనేందుకు యత్నాలు

() పార్టీ మారకపోతే దొంగ కేసులు పెడతామంటూ బెదిరింపులు

హైదరాబాద్) ప్రతిపక్ష వైయస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రక రకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. ఎంతటి
నీచానికైనా సిద్ధపడుతున్నారు.

        టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి
నుంచి వైయస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు.
ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలకు రూ. 20..30 కోట్లు ఇచ్చి కొనేశారు. వీరిలో
కొందరికీ పదవులు ఆఫర్ చేశారు. మరికొందరికి ప్రభుత్వ పనులు ఇప్పిస్తామని, అప్పనంగా
అవినీతి చేసుకొని పంచుకొని తినేద్దామని ప్రతిపాదించారు. మరికొందరికి అయితే రాజధాని
ప్రాంతంలో భూములు ఇస్తామని ప్రలోభ పెట్టారు

        ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేల మీద
అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాపారాల్లో
ఉన్న ఎమ్మెల్యేలను ఎంచుకొని ఈ విధమైన బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. అక్రమ
కేసుల్లో ఇరికించి వ్యాపారాల్ని నాశనం చేస్తామని, జైలుకి పంపిస్తామని
బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

        కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి
ప్రతాప్ కుమార్ రెడ్డిని ఈ విధంగా బెదిరించేందుకు పచ్చ చొక్కాలు తెగబడ్డాయి.
ఇందుకోసం మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగటం గమనార్హం. పార్టీ మారకపోతే అక్రమ
కేసులు బనాయిస్తామని బెదిరించినప్పుడు, అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు కావలి
ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. అవసరమైతే జైలుకి వెళ్లేందుకు కూడా సిద్ధమేనని,
కానీ వైయస్ జగన్ ను విడిచేది లేదని ఆయన చెప్పేసి వచ్చారు. ప్రజాస్వామ్యంలో విలువలు
బతికే ఉన్నాయని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలదా..!

Back to Top