అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు సర్వస్వం సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ద పడుతున్నారు. అందుచేత ఆ సంస్థల ద్వారా జరుగుతున్న మోసాలకు చంద్రబాబుదే బాధ్యత అన్న మాట బలంగా వినిపిస్తోంది. మాస్టర్ డెవలపర్ గా నిలిచిన సింగపూర్ కంపెనీల గొంతెమ్మ కోరికలు వింటుంటే అమరావతిని పూర్తిగా ఆరగించేందుకు సిద్ద పడుతున్నారా అని పిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ను ఊహించుకోడానికే భయం వేస్తుంది. ఈ సంస్థల ముఖ్యమైన డిమాండ్లు ఇవి..1. సింగపూర్ కంపెనీలు సీడ్ క్యాపిటల్ లోని కీలకమైన 4 వేల ఎకరాల్ని తమకు కావాలని అంటున్నాయి. అంటే పవర్ ఆప్ అటార్నీ చేయమంటున్నాయి. అదే జరిగితే ఈ భూమిపై కీలక హక్కులు సింగపూర్ కు దఖలు పడతాయి.2. తర్వాత ఈ భూమిని తనఖా పెట్టి రుణం తెచ్చుకొంటాయి. అంటే ఆ రుణాన్ని ఎగ్గొడితే ఈ భూమి మొత్తం ఆ ఫైనాన్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోతుంది3. ఈ రకంగా తనఖాతో తెచ్చుకొన్న డబ్బుతో అభివ్రద్ది చేస్తామని చెబుతోంది. అంటే ఇక్కడ చేసే పనులకు అంతా ఇక్కడ డబ్బే వాడుకొంటారన్న మాట4. అసలు సింగపూర్ సంస్థల మూలధనం కేవలం రూ. 300కోట్లుమాత్రమే. లక్షల కోట్ల రూపాయిల ప్రాజెక్టు చేస్తూ చేతికి మట్టి అంటకుండా మొత్తం గేమ్ నడిపిస్తున్నారన్న మాట5. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ లో చేయబోయే కార్యకలాపాలన్నీ తాము సొంతంగా ఏర్పాటు చేయబోయే సంస్థ ద్వారానే చేస్తామంటోంది. అంటే ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమేయం ఉండదన్న మాట.6. పైగా సీడ్ క్యాపిటల్ లో సింగపూర్ సంస్థలు చేసిన పనులేవీ ఇతర సంస్థలు చేపట్టడానికి వీలు లేదు.7. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు అక్కడ ప్లాట్లు ఇవ్వకూడదు. సీడ్ క్యాపిటల్ కు బయటే ఇవ్వాలి.8. స్విస్ చాలెంజ్ విధానం కాబట్టి తమ చేతుల మీదుగానే అన్ని జరగాలని సింగపూర్ సంస్థలు చెబుతున్నాయి.9. ప్రైవేటు రంగంలో భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే అవేమీ లేకుండా సింగపూర్ సంస్థలు ప్రణాళికను వండి వడ్డిస్తున్నాయి.10. ఇదంతా ఒక ఎత్తయితే, ఎన్ని ప్రతిపాదనలు, డిమాండ్లు జరిగినా.. నచ్చినా, నచ్చకపోయినా అదే సింగపూర్ కంపెనీలతోనే చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతుండటం గమనించ దగిన విషయం.