జ‌నం కోసం జ‌న నేత దీక్ష‌లు


హైద‌రాబాద్‌) జ‌నం కోసం పార్టీ ని ఏర్పాటు చేసిన జ‌న నేత వై ఎస్ జ‌గ‌న్‌.. ఆ జ‌నం కోసం ఎన్నెన్నో ఉద్య‌మాలు, పోరాటాలు, దీక్ష‌లు చేశారు. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన దీక్ష‌ల వివ‌రాలు చూద్దాం.
ల‌క్ష్య దీక్ష‌:( డిసెంబ‌ర్ 21,2010)
అన్నదాత అష్టకష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గాను జగన్మోహన్‌రెడ్డి విజయవాడలో లక్ష మందితో ‘లక్ష్యదీక్ష’ నిర్వహించారు. పగలంతా మండుటెండలు, రాత్రి ఎముకలు కొరికే చలి... అయినా జగన్, ఆయనతో పాటు రైతులు దీక్షగా తమ నిరసనను ప్రభుత్వానికి చాటి చెప్పారు. 2010 డిసెంబర్ 21, 22, 23 తేదీలలో కృష్ణానది తీరాన ఏర్పాటు చేసిన ‘వైయస్ దీక్షా ప్రాంగణం’లో మెతుకు ముట్టకుండా జగన్మోహన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్దకు రైతులు పోటెత్తారు. రెండు రోజుల పాటు కృష్ణా తీరం జన సంద్రాన్ని తలపించింది. పార్టీలకు అతీతంగా నాయకులు దీక్షా శిబిరానికి తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. 
జ‌ల‌దీక్ష‌:(జ‌న‌వ‌రి 11,2011)
ఎన్నో ఏళ్లుగా మూడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక- మహారాష్ట్ర) మధ్య జరుగుతున్న మూడుముక్కలాటలో మధ్యవర్తిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తోంది. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి తెలియజెప్పడానికి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హస్తినలో 'జలదీక్ష' నిర్వహించారు.

జ‌న‌దీక్ష‌:(జ‌న‌వ‌రి 22,2011)
రాష్ర్టంలో నిత్యావసరాల ధరలకు అదుపు లేదు. ఉప్పు, పప్పులు, నూనెలు మండుతుంటే పేదవాడు కడుపు మాడ్చుకునే పరిస్థితి దాపురించింది. దీనికి తోడు కేద్రం ఆరు నెలల వ్యవధిలో ఏడుసార్లు పెట్రోలు ధర పెంచి, సామాన్యుడి నడ్డి విరిచింది. అడ్డూ అదుపూ లేని ధరలు ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాకేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై వైయస్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘తూర్పుతీరం’లో ఓ పక్క సాగరం మరో పక్క జనసాగరం వెంట వుండగా 2011, జనవరి 22న విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్‌లో లక్షలాది అభిమానుల సమక్షంలో ‘జనదీక్ష’ నిర్వహించారు. పెట్రో ధరలను కంపెనీలు విపరీతంగా పెంచుతున్నా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుండడాన్ని జగన్ ఎండగట్టారు. లాభాల్లో ఉన్న చమురు కంపెనీలకు నష్టాలు ఎక్కడ వస్తున్నాయంటూ ఆయా చమురు కంపెనీల ఆదాయాలను ప్రజలకు వివరించారు.
హ‌రిత యాత్ర‌:( ఫిబ్ర‌వ‌రి 08, 2011)
ప్రజానాయకుడు రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ఇది.. గోదావరి ప్రజల డెబ్బై ఏళ్ల స్వప్నం. వైయస్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా నడిచాయి. కేటాయింపులు దండిగా ఉండేవి. కాల్వలు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మరో ప్రస్థానం సాగించారు. అదే ‘హరితయాత్ర’.. పల్లెపల్లెనూ తట్టి లేపుతూ.. కదం తొక్కుతూ కదిలిన మహాయాత్ర.
ఫిబ్రవరి 7, 2011న తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో మొదలైన పాదయాత్ర పదవ తేదీ వరకు 88 కిలోమీటర్లు సాగింది. వాగులు, వంకలు దాటుతూ.. మట్టి రోడ్లు, మిట్ట పొలాలు, సెలయేటి గట్లపై జననేత జగన్ వెంట జనవాహిని సాగింది. హరితయాత్ర ప్రారంభంలో రావులపాలెం సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ చేసిన ఉద్వేగ ప్రసంగం జనాన్ని చైతన్యపరచింది. పోలవరం పూర్తికాకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఎడారిగా మారుతుందో ఆయన విడమరిచి చెప్పారు.

చివరి రోజు పోలవరంలోని ప్రాజెక్టు నిర్మించే ప్రాంతమైన ‘రామయ్యపేట’ వద్ద యాత్ర ముగింపు సభ జరిగింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ముప్పై రెండు మంది ఎంపీలు ఉన్నా, కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది వారే అయినా ప్రాజెక్టులు ఎందుకు సాధించలేకపోతున్నారని జగన్ సూటిగా ప్రశ్నించారు. 1946లో ప్రాజెక్టు పూర్తిచేసి వుంటే రూ.125 కోట్లతో పూర్తయ్యేదని, ముఖ్యమంత్రిగా అంజయ్య 1982-83లో శంకుస్థాపన చేసిప్పుడు కట్టి వుంటే రూ.750 కోట్లతో పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం ఎంతగా పెరుగుతుందో జగన్ వివరించారు.
ఫీజు పోరు:(ఫ‌బ్ర‌వ‌రి 18,2011)
ఉన్నత చదువులను పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. తన పాలనలో ప్రతి పేదవాడికి కోరిన చదువు ఉచితంగా సొంతం అవ్వాలని వైయస్ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం ప్రవేశపెట్టారు. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. చదువుకు దూరమైన ఎందరో పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వరంలా మారింది. ఉన్నత చదువులకు బాటలు పరిచింది.అయితే, ఆయన మరణానంతరం రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమేణా కనుమరుగు చేసేందుకు ఎత్తులు వేసింది. కేటాయింపులు తగ్గించేసింది.
ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించిన ఫీజు పోరుకు విద్యార్థి లోకం యావత్తూ మద్దతు పలికింది. హైదరాబాద్ నడిబొడ్డున ధర్నాచౌక్‌లో 2011 ఫిబ్రవరి 18న లక్షల మంది విద్యార్థుల సాక్షిగా జగన్ ‘ఫీజుపోరు’ను ప్రారంభించి వారం రోజుల పాటు నిరాహార దీక్షకు నిర్వహించారు.

రైతు దీక్ష‌:( మే 15,2012)
2010 డిసెంబరు మొదటి వారంలో వచ్చిన తుఫాను 16 జిల్లాల్లో 27 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. 23.19 లక్షల మంది రైతులు రూ.3000 కోట్ల మేర నష్టపోయారు. పండిన పంటకు కనీస మద్దతు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోయిన గుంటూరు రైతులు తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేతికి అందిన పంటను నడిరోడ్డుపై వేసి తగలబెట్టారు. తనను పట్టించుకునే నాయకుడు లేడని విలవిల్లాడుతున్న అన్నదాతకు వైయస్ జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. రాష్ట్రంలో రైతు పడుతున్న వేదనను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు గుంటూరు వేదికగా 2011, మే 15,16 తేదీల్లో జగన్ మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష నిర్వహించారు.
ప్ర‌త్యేక హోదా..ఆంధ్రుల హ‌క్కు..
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని తీర్మానించారు. ఇందుకు అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌, నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇచ్చారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఈ రెండు పార్టీలు ఆంధ్ర‌కు ప్రత్యేక హోదా కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో ఇచ్చిన హామీల ప్ర‌కారం ఆంధ్ర ప్ర‌దేశ్‌కు సాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌తి ప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిరాహార దీక్ష‌
చేప‌ట్టారు. ఇదే విష‌యంపై యువ‌భేరి పేరుతో తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో విద్యార్థులు, యువ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. 
ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష‌:
ఢిల్లీలో నిరాహార దీక్ష‌ల అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఉద్రుతం చేశారు. అన్ని మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తుళ్లూరులో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడు రోజుల పాటు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. అయితే ఈ దీక్ష‌ల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా భగ్నం చేశారు.
స‌మైక్య దీక్ష‌:
తెలుగు ప్ర‌జ‌లు క‌లిసి ఉండాల‌ని కోరుతూ వైఎస్ఆర్‌సీపీ స‌మ‌ర శీల పోరాటం చేసింది. అధికారం కోసం తెలుగు ప్ర‌జ‌ల‌ను విభ‌జించి 
పాలించాల‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావించ‌గా వారికి తెలుగు దేశం, బీజేపీ నాయ‌కులు మ‌ద్ద‌తు ప‌లికారు. పార్ల‌మెంట్‌లో ఏక‌ప‌క్షంగా బిల్లు 
బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఇందుకు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 
రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌ని కోరుతూ జ‌న‌నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జైల్‌లో ఉంటూనే నిర‌వ‌దిక దీక్ష‌లు చేప‌ట్టారు.
ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో జైలు అధికారులు బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించి దీక్ష‌లు భ‌గ్నం చేశారు.
విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా దీక్ష‌: (25-08-13 నుంచి 31-08-13)-చంచల్‌గూడా జైలు
ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విభ‌జించేందుకు అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర స‌మితి 
పార్టీలు చేస్తున్న కుట్ర‌ను నిర‌సిస్తూ వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో
జ‌న‌నేత చంచ‌ల్‌గూడా జైలులో ఉన్నారు. రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌ని కోరుతూ 2013 ఆగ‌స్టు 25 నుంచి 31వ తేది వ‌ర‌కు
నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. అయితే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగా దీక్ష‌ను
భ‌గ్నం చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. జ‌గ‌న్ దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తుగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఆయ‌న ఆరోగ్య‌
ప‌రిస్థితి రోజు రోజుకు క్షిణిస్తుండ‌టంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. జ‌న‌నేత‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన స‌మ‌యంలో 
పెద్ద ఎత్తున అభిమానులు హైద‌రాబాదుకు చేరుకొని ఆయ‌న‌ను చూసేందుకు త‌పించారు.
స‌మైక్యాంధ్ర కోసం దీక్ష‌: (05-10-13 నుంచి 09-10-13 వరకు)- లోటస్‌పాండ్ నివాసంలో
ఆంధ్ర రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌ని కోరుతూ క‌డ‌ప ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోరుబాట ప‌ట్టారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాస‌మైన లోట‌స్‌పాండ్ వ‌ద్దే 2013 అక్టొబ‌ర్ 5వ తేదిన నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఐదు రోజుల పాటు ఆయ‌న నిర‌వ‌ధిక దీక్ష చేప‌ట్ట‌డంతో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఆందోళ‌న ఉద్రుతం కావ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగా దీక్ష విర‌మింప‌జేశారు. తెలుగు ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్ట‌డం దారుణ‌మ‌ని జ‌గ‌న్ నిన‌దించారు. అయినాస‌రే కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ, తెలుగుదేశం రాష్ట్ర విభ‌జ‌న‌కు అంగీక‌రించ‌డంతో ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌గా ఏర్ప‌డ్డాయి. పార్ణ‌మెంట్‌లో లైవ్ కార్య‌క్ర‌మాన్ని తొల‌గించి ఏక‌ప‌క్షంగా ఆనాటి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని విడ‌గొట్టింది. ఇందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రించిన రెండు కళ్ల సిద్ధాంతం తోడైంది. రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌ని వైఎస్ఆర్‌సీపీ మాత్ర‌మే నాడు స‌మ‌ర‌శీల పోరాటాలు చేసింది. ఇందుకు సీపీఎం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా కేంద్రం ప‌ట్టించుకోలేదు. 
 విశాఖ‌ కలెక్టరేట్‌ ముందు ధర్నా: 05-12-14
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖ కలెక్టరేట్‌ ముందు ధర్నాచేప‌ట్టారు.
హుద్‌హుద్ తుపాను కార‌ణంగా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు స‌ర్వం కోల్పొయార‌ని, బాధితుల‌ను ఆదుకోవ‌డంలో స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని
ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం నుంచి చంద్ర‌బాబు నిధులు తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. బాధితుల‌కు పున‌
రావాస కేంద్రాలు ఏర్పాటు చేయ‌లేద‌ని, ప‌రిహారం చెల్లించ‌లేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 2014 డిసెంబ‌ర్ 5న త‌ల‌పెట్టిన విశాఖ 
క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నాకు భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి స‌ర్కార్ తీరును త‌ప్పుప‌ట్టారు.
రైతు దీక్ష‌: (31-01-15 నుంచి 01-02-15)- తణుకు
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు, చేనేత‌ల రుణాలు మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. తాను సీఎం కాగానే మొద‌టి సంత‌కం చేస్తాన‌ని మాట ఇచ్చాడు. అయితే అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డుస్తున్న ఏ ఒక్క రైతు, మ‌హిళ‌, చేనేత‌ల రుణాలు పూర్తిగా మాఫీ చేయ‌లేదు. దీంతో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గుంటూరు జిల్లా తణుకు ప్రాంతంలో ఈ ఏడాది జ‌న‌వ‌రి 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేది వ‌ర‌కు రెండు రోజుల పాటు రైతు దీక్ష చేప‌ట్టారు. రైతుల పంట రుణాలు బేష‌ర‌త్తుగా మాఫీ చేయాల‌ని, డ్వాక్రా మ‌హిళ‌లు, చేనేత‌ల రుణాలు ఒకే సారి మాఫీ చేయాల‌ని డిమాండ్ చేశారు.
స‌మ‌ర దీక్ష‌: (03-06-15 నుంచి 04-06-15)- మంగళగిరి
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యిన ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. చంద్ర‌బాబు ఏడాది మోసాలను నిర‌సిస్తూ, ఇంకా నాలుగేళ్లు ఎలా భ‌రించాల‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఈ ఏడాది జూన్ 3, 4వ తేదిల్లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో స‌మ‌ర దీక్ష త‌ల‌పెట్టారు. రైతుల‌ను వంచించార‌ని, డ్వాక్రా మ‌హిళ‌ల్ని మోస‌గించార‌ని, నిరుద్యోగుల‌ను ద‌గా చేశార‌ని జ‌న‌నేత ధ్వ‌జ‌మెత్తారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొన‌సాగుతుండ‌టాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. రాజ‌ధాని పేరిట విదేశి కంపెనీల కోసం బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌డం దారుణ‌మ‌ని దీక్ష చేప‌ట్టారు.
ప్రత్యేక హోదా కోసం ధర్నా:(10-08-15)- ఢిల్లీ
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని నాడు పార్ల‌మెంట్‌లో తీర్మానించారు. ఇందుకు అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌, నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇచ్చారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఈ రెండు పార్టీలు ఆంధ్ర‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో ఇచ్చిన హామీల ప్ర‌కారం ఆంధ్ర ప్ర‌దేశ్‌కు సాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌తి ప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిరాహార దీక్ష చేప‌ట్టారు. 
కొత్తమాజేరు జ్వరపీడితుల కోసం ధర్నా: (25-08-15) - మచిలీపట్నం
క్ర‌ష్ణా జిల్లాలో విష‌ జ్వ‌రాల కార‌ణంగా అమాయ‌క‌ప్ర‌జ‌లు మ్ర‌త్యువాత ప‌డుతుండ‌టంతో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 
చ‌లించారు. కొత్త‌మాజేరు జ్వ‌ర‌పీడితుల ప‌క్షానా జ‌న‌నేత ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.  2015 ఆగ‌స్టు 25న మ‌చిలీప‌ట్నంలో ధ‌ర్నా చేశారు.
జ్వ‌ర‌పీడితుల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేద‌ని మండిప‌డ్డారు.
సీఆర్‌డీఏ కార్యాలయం ముందు ధర్నా: (26-08-2015)-  విజ‌య‌వాడ
రాజధాని భూసేకరణపై విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ముందు ధర్నావైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ‌ర్నా చేప‌ట్టారు.
ప‌చ్చ‌ని పొలాల‌ను విదేశీ కంపెనీల‌కు అప్ప‌గించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు య‌త్నిస్తున్నార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 
రాజ‌ధాని పేరుతో రైతుల నుంచి బల‌వంతంగా భూములు లాక్కునేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా విజ‌య‌వాడ‌లోని సీఆర్‌డీఏ
కార్యాల‌యం ఎదుట 2015 ఆగ‌స్టు 26న జ‌గ‌న్ ధ‌ర్నా చేశారు. 
పొగాకు వేలం కేంద్రం దగ్గర ధర్నా:(30-09-15)- టంగుటూరు
  పొగాకు రైతు సమస్యలపై టంగుటూరు పొగాకు వేలం కేంద్రం దగ్గర వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సెప్టెంబ‌ర్ 30, 2015న ధ‌ర్నా 
చేప‌ట్టారు. పొగాకుకు మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని, త‌డిసిన పొగాకును ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ దీక్ష: (7.10.15 నుంచి 13.10.15)- గుంటూరు
ఢిల్లీలో నిరాహార దీక్ష‌ల అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఉద్రుతం చేశారు. అన్ని మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడు రోజుల పాటు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. అయితే ఈ దీక్ష‌ల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా భగ్నం చేశారు.
Back to Top