అప్పులు బాబోయ్ అప్పులు

() చంద్రబాబు విలాసాలకు విరివిగా డబ్బు ఖర్చు

() అప్పుల బాట పడుతున్న ప్రభుత్వం

() మరో సారి అప్పు కోసం తీవ్ర ప్రయత్నం

హైదరాబాద్)) చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతిమంగా ప్రజలు
బలైపోతున్నారు. అమరావతిని ప్రపంచ రాజధానిని చేస్తా, ప్రపంచ పటంలో పెడతా అంటూ
కబుర్లు చెబుతున్నారు కానీ వాస్తవంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలోకి
దించేస్తున్నారు.

సోకులు.. గ్రాఫిక్కులు..

చంద్రబాబు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో సాధించింది చూస్తే ఏమీ కనిపించటం
లేదు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానమో, ప్రత్యేక హెలికాప్టరో
తప్పనిసరి. 2,3 నెలలకోసారి విదేశీ పర్యటనలు, అక్కడకు చంద్రబాబు కి నచ్చిన వందల
మందిని తీసుకెళ్లటం జరుగుతోంది. దీనికి వందల కోట్ల రూపాయిలు ఖర్చు అవుతున్నా,
ప్రభుత్వానికి పట్టడం లేదు. తిరిగి వచ్చాక గ్రాఫిక్ బొమ్మలు చూపించి మురిపించటం
తప్ప పెట్టుబడులు మాత్రం రాలటం లేదు. ఇటు, చంద్రబాబు కార్యాలయాలు, నివాసాలకు
అవుతున్న ఖర్చు అంతు లేకుండా సాగిపోతోంది. క్యాంపులు, సమీక్షలకు ఫైవ్ స్టార్
హోటల్స్ తప్పనిసరి అవుతున్నాయి. ఇది చంద్రబాబు విలాసాల చిట్టా.

అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్

విభజనతో కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ప్రభుత్వ తీరు మరింత భారంగా
మారింది. దుబారా ఖర్చులకు కళ్లెం వేయాల్సిన వారే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు.
దీంతో ఖజానా ఖాళీ అయిపోయి అప్పుల మార్గం పట్టాల్సి వస్తోంది. ఇప్పటికే 6,050 కోట్ల
రూపాయిల దాకా అప్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా రూ. 750 కోట్ల మేర అప్పులకు
దరఖాస్తు పెట్టుకొన్నారు. దానా దీనా ఆంధ్రప్రదేశ్ పౌరుడి నెత్తి మీద అప్పుల కుప్ప
ఏర్పడుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.

పేదవాడికి ఇబ్బందులు

ఒక వైపు చంద్రబాబు సోకులు, దర్జాలకు వందల కోట్ల రూపాయిలు కరిగిపోతున్నాయి. మరో
వైపు అప్పులు మీద అప్పులు ఏర్పడి వడ్డీలు పేరుకొని పోతున్నాయి. దీంతో చంద్రబాబు
ప్రభుత్వం పేదల జేబులకు చిల్లు పెడుతోంది. పింఛన్లు, ఆరోగ్య శ్రీ బిల్లులు, ఫీజు
రీఇంబర్స్ మంట్ వంటి వాటికి కత్తిరింపు చేస్తున్నారు. ఇటువంటి వాటితో పేదవాడి
గుండె గుభేల్ మంటోంది. 

Back to Top