దళితులకు బాబు వంచన

 

నోటితో పొగడి నొసటితో
వెక్కిరించినట్టు, దళితతేజం పేరుతో కార్యక్రమాలు చేస్తూ, దళితులపై దాడులకు, దాష్టీకాలకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని
నిలదీస్తున్నారు దళితల సోదరులు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా సాగుతున్న అత్యాచారాలకు ఎక్కువగా
బలౌతున్నది దళితులే. అగ్రవర్ణాల అహంకారాలు, దాడులు, లొంగకపోతే బహిష్కరణలతో దళితులను అణగదొక్కుతున్నారు. అధికార పక్ష నేతలు, అగ్రవర్ణాల వారు కలిసి
చేస్తున్న ఈ దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. దళిత యువకులపై వేధింపులు, మహిళలపై కూడా పాశవికమైన
దాడులు జరుగుతున్నాయి. మృగాల్లా రెచ్చిపోతున్న వర్ణాహంకార శక్తులకు ప్రభుత్వమే
అండగా ఉండటం దురదృష్టకరం.

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై
దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన
పోలీసు వ్యవస్థ బాధ్యులపై చర్యలే తీసుకోవడం లేదు. వారి వెనుక అధికారపక్ష టిడిపి నాయకులు ఉండటమే అందుకు
కారణం. విశాఖలో మహిళలను దుస్తులు లాగి మరీ కొట్టిన సంఘటన, కర్నూలు లో దళితుల సామాజిక
బహిష్కరణ, గొట్టిపాడులో పరస్పర దాడులు ఇలా తరుచూ జరుగుతూ ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది
లేదు.

కారణాలు దారుణం

వెట్టి చేయలేదంటూ దళిత
కుంటుంబాలను సామాజిక బహిష్కరణకు గురి చేసి, వారికి నీరు, నిత్యావసరాలూ అందకుండా చేసిన పాశవిక ఘటనలు రాష్ట్రంలో
చోటు చేసుకున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనుకున్నందుకు ఓ ప్రాంతం మొత్తాన్ని పనులకు పిలవకుండా
అగ్రవర్ణాల వారు చేసిన సామాజిక కట్టుబాటు రాష్ట్రంలో సంచలనమైంది. దళితులే దాడికి దిగారంటో
మరో సామాజిక వర్గం వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి ఘర్షణలకు కారణమైంది. మచిలీపట్నంలో జరిగిన
బీచ్ ఫెస్ట్ లో సరదాగా ఆడుకుంటున్నందుకు దళితయువకులను పోలీసులు అవమానించి, దారుణంగా కొట్టిన సంఘటన
అత్యంత హేయమైనది. దళితులపై దాడులు చేయరాదంటూ దేశ ప్రధాని ప్రకటించిన మర్నాడే ఎపిలో దళితులపై
దాడులు జరిగాయి. చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్నారని బిజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా
పలువురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. అమలాపురంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై రాజ్యసభలో తీవ్రమైన
చర్చ జరిగింది.

నిరుపయోగంగాఎస్సీ ఎస్టీ అట్రాసిటీ
చట్టం

దళితులపై దాడులు చేసినా, చేయాలని ప్రయత్నించినా, వారిపై కఠిన చర్యలు
తీసుకుంటాం, ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఎవరైనా వదలం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా
హెచ్చరించినా, అవి మాటలకే పరిమితం అయ్యాయి. ఇంతవరకూ ఇన్ని సంఘటనల్లో కారకులైన నిందితులకు ఎక్కడా
శిక్ష పడలేదు. అసలు ఈ సంఘటనల్లో విచారణ సైతం ఏకపక్షంగా జరుగుతోందని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా
ఏర్పడ్డ జస్టిస్ పున్నయ్య కమీషన్రాష్ట్రంలో దళితుల స్థితిగతులను అధ్యయనం చేసి ఇచ్చిన
నివేదికలో ఆర్థిక అసమానతలను రూపుమాపాలని అప్పుడే వారికి సమాజంలో సరైన స్థానం దొరకుతుందని
సవివరంగా ఉంది. ఆ సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందే లేదు. కేవలం ఓట్ల కోసం దళిత
తేజం కార్యక్రమాన్ని నడుపుతున్న చంద్రబాబు, దళితులు, గిరిజనులకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేసే
విషంలో తీవ్రంగా అన్యాచం చేసాడు.

నాయకులే నోరు జారి

కులదురహంకరామే కాదు, అధికారపు అహంకారం నిలువునా
నిండిన టిడిపి నాయకులు దళితులను ఎన్నోసార్లు తమ వ్యాఖ్యలతో అవమానాలకు గురి చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబే
స్వయంగా ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని వారిని కించపరిస్తే, దళితులు చదువుకోరు శుభ్రంగా
ఉండరని ఓ మంత్రి వాఖ్యానించాడు. దళిత వర్గానికే చెందిన మరో టిడిపి నాయకుడు సొంత వర్గీయుణ్ణే
బూతులు తిడుతూ, పబ్లిక్ గాకుల దూషణలు చేసాడు. ఇలాంటి వదరుబోతు నాయకులు నేడు దళిత తేజం అని చెప్పి
వారి ఇళ్లకు వెళ్లి నిద్రలు చేసినంత మాత్రాన వారికి జరిగిన అవమానాలకు న్యాయం జరిగినట్టేనా? కాదనే అంటున్నారు దళిత
నేతలు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పేరు చెప్పి బాబు చేసిన ఓటు రాజకీయాన్ని
వారు అసహ్యించుకుంటున్నారు. భవిష్యత్ లో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతోనే చంద్రబాబు
దళిత వ్యతిరేక సర్కార్ కు బుద్ధి వచ్చేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

 

Back to Top