దళిత రైతులంటే ఇంత చులకనా చంద్రబాబూ..!

అమరావతిః రైతులను భయపెట్టి అణిచివేతకు పాల్పడుతుందని రాజధాని అసైన్డ్‌ లంక భూముల దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ఫ్యాకేజీ ఇప్పించాలని కోరుతున్న రాజధాని రైతులపై టీడీపీ ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడుతోంది. పోరాటం చేయకముందే బలవంతంగా తీసుకెళ్ళి ఫోన్లు లాక్కుని జీపుల్లో తిప్పుతూ చీకటి గదుల్లో  ఉంచి కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోంది. దళిత రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనో రాజధాని రైతుల వ్యవహరంలో తేటతెల్లమవుతోంది. న్యాయం అడిగితే చంద్రబాబుకు  రౌడీలు, ఉగ్రవాదుల్లా కనబడుతున్నామని రైతులు వాపోతున్నారు. చంద్రబాబు ఎంత భయపెట్టిన ఈ పోరాటం ఆగదని రాజధాని దళిత రైతులు హెచ్చరిస్తున్నారు. సమస్యలపై చర్చించుకోవడానికి గతంలో రచ్చబండ కార్యక్రమం జరిపితే అందులో పాల్గొన్న వారిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. 2013 చట్టం అమలు చేయాలని,. 41 జీవో రద్దు చేయమని కోరుతున్నామే తప్ప మేం పదవులు, అసెంబ్లీలో సీట్లు అడగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్యాకేజీ ఇవ్వడమే గొప్ప అని చంద్రబాబుకు వంతపాడుతున్నారన్నారు. ముగ్గురు అన్నదమ్ములు పంచుకోవల్సిన ఎకరం పొలాన్ని ప్రభుత్వం ఇచ్చే 600 ప్యాకేజీతో మా పిల్లలను ఎలా చదివించుకోవాలని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌ కార్డులు ఎందుకూ ఉపయోగపడటంలేదన్నారు. మాకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంలేదని  ఆర్థిస్తున్నామని దళిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అర్థ్రరాతి రైతులను అరెస్ట్‌ చేయించి భయపెట్టాలనే ప్రయత్నాలు ఎక్కువరోజులు సాగవని హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపు రాబోయే ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తావని హెచ్చరించారు.
Back to Top