అవినీతి హిత పాలన


 చెప్పిన అబద్ధాన్ని
చెప్పకుండా, పదే పదే చెప్పే అబద్ధాన్ని కూడా కాస్తైనా జంకకుండా చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అవినీతి రహిత పాలన చేస్తున్నానంటూ
ప్రజావేదికపై ఆయనకు చెప్పడం కొత్త కాదు మనకు వినడమూ కొత్త కాదు. చంద్రబాబు డిక్షనరీలో
అవినీతికి అర్థం వేరైయ్యుండాలి. లేదా ఎప్పటిలా నోరు తడబడి అవినీతి హిత పాలన అనబోయి
అవినీతి రహిత పాలన అని చెప్పి ఉండాలి.

బాబు జమానా అవినీతి
ఖజానా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో
బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి తిరిగి కాంట్రాక్టు ఇవ్వడం ఏ విధమైన అవినీతిరహిత పాలనో
బాబుగారే చెప్పాలి. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ధరల స్థిరీకరణ నిధులు ఎటు మళ్లుతున్నాయో కూడా తెలయపోవడమే
అవినీతి రహిత పాలనేమో? కేంద్రం ఇచ్చినట్టు చెబుతున్న 1.75 లక్షల కోట్లు ఏమయ్యాయో లెక్కపద్దూ లేకపోవడమే అవినీతి
లేకపోవడమా? ఇసుక మట్టి తమ్ముళ్లకు దోచిపెట్టి కమీషన్లే పుచ్చుకోవడాన్ని అవినీతి అనరా? బాబు జమానా అవినీతి
ఖజానా అని మార్క్సిస్టులు ముద్రించిన పుస్తకంలో ఉన్నది బాబు అవినీతి బాగోతాలు కావా? భూసేకరణ, మైనింగ్, పట్టిసీమ, నీరుమట్టి, పుష్కరాల పనులు, పెట్టుబడులు ఎమ్ఒయులు, జన్మభూమి కమిటీలు ఎందులో
తొంగి చూసినా అందులో చంద్రబింబమే కనిపిస్తోంది. ఆ అవినీతి ఆకారాన్ని కా గ్ కూడా బైటపెట్టినా చంద్రబాబు
ఇంకా తాను అవినీతి రహిత పాలనే చేస్తున్నానంటూ చెప్పుకుంటున్నాడు.

అవినీతి పేటెంట్ బాబుదే

దేశంలోనే అత్యంత సంపన్న
సిఎం చంద్రబాబే అని ముఖ్యమంత్రుల ఆస్తుల నివేదిక బైటపెట్టింది. బాబు సొంత కంపెనీ హెరిటేజ్
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ నాలుగేళ్లలో ఎన్నో రెట్లు ఎదిగిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
మాత్రం రోజు రోజుకీ దిగజారిపోయింది. అడుగడుగునా రాష్ట్రాన్ని దోచుకుని అవినీతి సామ్రాట్టుగా
ఉన్న చంద్రబాబు అవినీతి రహిత పాలన అంటుంటే ఎవ్వరికైనా నవ్వొస్తుంది. అసలు అవినీతికి అడ్రస్సే
బాబు అంటున్నారు తెలుగు ప్రజలు. చివరికి ప్రత్యేక హోదాను, విభజన హామీలను కూడా
తన ఓటుకు నోటు కేసులో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు పాలనలో ఏదీ పారదర్శకంగా
ఉండదు. రహస్య జీవోలు, ఏడాదికి నాలుగు సార్లు విదేశీయానాలు, నెలకో ఈవెంటుతో అవినీతికి
హితం చేయడం తప్ప ఈ  రాష్ట్రాన్ని అవినీతి రహితం
చేయడం చంద్రబాబు హయాంలో అసాధ్యం. 

Back to Top