తుపాన్ పనుల్లోనూ చంద్రమార్కు అవినీతి


విశాఖపట్నం) హుద్ హుద్
తుపాన్ సహాయ చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కోసం బాగా తెగిస్తోంది.
కాంట్రాక్టర్లకు వాటాలు పెంచేందుకు పక్క దార్లు వెదకుతోంది. దీంతో అసలు
లబ్దిదారులకు ప్రయోజనం దక్కటం లే దు.

హుద్ హుద్ తుపాన్ తో
తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నం జిల్లాను ఆదుకొనేందుకు పెద్ద ఎత్తున విరాళాలు
వచ్చాయి. వీటిని రక రకాల అకౌంట్ల లోకి మళ్లించేసిన ప్రభుత్వం ఒక దశలో ఇళ్ల
నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు తగినట్లుగా మొత్తం ఉత్తరాంధ్రలో 10వేల
ఇళ్లను నిర్మించాలని నిశ్చయించారు. విశాఖ పట్నం జిల్లాలో 6వేల ఇళ్లు, విజయనగరం
జిల్లాలో 2,500 ఇళ్లు, శ్రీకాకుళం జిల్లాలో 1,500 ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు
రచించారు. ఈ లోగా చంద్రబాబు ప్రభుత్వానికి కావలసిన తాబేదార్లు రంగ ప్రవేశం చేశారు.
ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఒక ప్రైవేటు సంస్థకు విశాఖ జిల్లాలోని నిర్మాణ
బాధ్యతలు అప్పగించేశారు.

పక్కా ఇంటి నిర్మాణానికి
ఎంత చూసుకొన్నా రూ. 4లక్షలకు మించదని అధికారులు స్పష్టంగా అంచనా వేశారు. అయినాసరే,
అయిన వారి సంస్థ కాబట్టి ఇంటికి 4.80 లక్షల చొప్పున ఆర్డర్ ఇచ్చేశారు. మొత్తంగా
288.8 కోట్ల కు సంబంధించి ఆర్డర్ ఇచ్చే సమయంలోనే చేతి వాటం ప్రదర్శించారు. ఇంత
వరకు బాగానే ఉంది. ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టి చాలా కాలం అయింది. డిసెంబర్ నాటికి
మొత్తం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి. కానీ అన్ని చోట్ల పునాదుల దగ్గరే ఇళ్లు
ఆగిపోయాయి. కనీసం 4,5 నెలలు అయినా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

పనుల్ని సాగదీసేందుకు
కాంట్రాక్టర్లు అన్ని మార్గాలు వెదకుతున్నారు. 4.80 లక్షల నుంచి ఐదున్నర లక్షల కు
పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రివైజ్డ్ మార్గ దర్శకాలు విడుదల చేయించుకొని
డబ్బులు నొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాటర్ మొత్తం సీఎం ఆఫీసుకి
సంబంధించినది కావటంతో ఇక్కడ అధికారులు మాట్లాడలేకపోతున్నారు. తుపాన్ బాధితులకు ఇళ్లు
అందక పోయినా పెద్దగా పట్టించుకోవటం లేదు. చంద్రబాబు మాత్రం ఏడాది పూర్తి
చేసుకొన్నందుకు ర్యాలీలు, విజయోత్సవాలు చేయించుకొన్నారు. తప్పితే బాధితులకు మాత్రం
ఏమాత్రం ఉపశమనం కల్గించలేకపోయారు. 

Back to Top