సింహం సింగిల్ గా వస్తుంది

వైఎస్సార్సీపీలో చేరిన టీఆర్ఎస్ నాయకులు
అధికార దాహంతోనే ఎన్నిక..

గీసుకొండః
వరంగల్ జిల్లా గీసుకొండ జనసందోహమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్
జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. రాజన్న
బిడ్డను కళ్లారా చూసి పులకించిపోయారు. మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ గౌడ్
ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కు చెందిన ఎంపిటీసీలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున
వైఎస్సార్సీపీలో చేరారు. నాడు వైఎస్సార్ నీడలో పని చేశామని, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి నాయత్వంలో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. తనను తమ్ముడిగా ఆదరించి, తన వెంట వైఎస్సార్సీపీ లో చేరడానికి వచ్చిన వారికి ఈ సందర్బంగా రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఊకల్ ఎంపీటీసీ పులిచేరి మంజుల, గీసుకొండ ఎంపీటీసీ వీరగోని కవిత, గీసుకొండ పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలతో పాటు సుమారు ఆరు వేల మంది వైఎస్సార్సీపీలో  చేరారు .  జై జగన్ ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ
 వారు నినదించారు

రాజన్న
రాజ్యం రావాలంటే రావణాసురుడి పాలన పోవాలని రాజ్ కుమార్ గౌడ్ అన్నారు.
సమస్యలు తీరుస్తాడని కడియం శ్రీహరిని పార్లమెంటుకు పంపిస్తే...అధికార
దాహంతో ప్రజల ఆశలు వమ్ము చేశాడని నిప్పులు చెరిగారు. అధికారం కోసం ప్రజల
డబ్బును దుర్వినియోగం చేసేందుకే ఈరోజు వరంగల్ లో ఉపఎన్నిక వచ్చిందని
టీఆర్ఎస్ పై  విమర్శలు గుప్పించారు.  

కేసీఆర్
మంత్రులు, ఎమ్మెల్యేలను గుంపులు గుంపులుగా పంపించి కారు గుర్తుకు ఓటేయాలని
బెదిరిస్తున్నారని రాజ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది
గుంపులుగా వచ్చినా భయపడవద్దని ప్రజలకు సూచించారు. సింహం సింగిల్ గా
వచ్చిందని వైఎస్ జగన్ ను ఆశీర్వదించాలని  ఓటర్లకు పిలుపునిచ్చారు. తామంతా
రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులమని, వైఎస్సార్సీపీలో చేరినందుకు ఆనందంగా ఉందని
రాజ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. 
Back to Top